Others

డైరెక్టర్స్ ఛాయిస్..ఆయన సపోర్ట్ మర్చిపోలేను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-తరుణ్ భాస్కర్

‘సైన్మా’ షార్ట్ ఫిలిమ్‌తో ఇండస్ట్రీని టార్గెట్ చేశాడు తరుణ్ భాస్కర్. గ్లోబల్ సినిమా తరహాలో -కంటిముందు కనిపించే
కథనే ‘పెళ్లిచూపులు’ పేరుతో తెరకెక్కించాడు. ఆ చిత్రం యూత్‌ఫుల్
ఎంటర్‌టైనర్‌గా మంచి టాక్
తెచ్చుకుంది. ఈ సందర్భంలో దర్శకుడు తరుణ్ భాస్కర్‌తో చిట్ చాట్..

మీ సినిమా జర్నీ?
-మాది వరంగల్. ‘అష్టాచమ్మా’ నిర్మాత రామ్మోహన్ ద్వారా బిటెక్ అనే డ్రామా స్క్రిప్ట్‌ను షార్ట్ఫిల్మ్‌గా తీయడంతో నా ఫిల్మ్ మేకింగ్ కెరియర్ మొదలైంది. తరువాత సైన్మా షార్ట్ ఫిల్మ్ ద్వారా పేరొచ్చింది. ఆ కాన్ఫిడెన్స్‌తోనే ఈ ఛాన్స్ వచ్చింది.
ఈ కథని ఎవరెవరికి చెప్పారు?
-సైన్మా షార్ట్ ఫిల్మ్ చూసి మంచు లక్ష్మి ఓ సినిమాకు అడ్వాన్స్ ఇచ్చారు. ఈ స్టోరీ చెప్పగానే ఆమెకు కథ బాగా నచ్చి చేద్దామనుకున్నాం. కానీ ఆమెకున్న బిజీవల్ల కుదరలేదు. తరువాత రాజ్ కందుకూరిని కలిసి కథ చెప్పగానే నచ్చి సినిమా మొదలుపెట్టాం.
సినిమా అనుభవాలు?
-మా టీమ్ మొత్తం సినిమా కోసం క్లౌడ్ ప్రొడక్షన్ యూజ్ చేశాం. ‘ప్రొడక్షన్ మైన్స్’ సాఫ్ట్‌వేర్ ద్వారా మొత్తం స్క్రిప్ట్, లొకేషన్స్, డైలాగ్స్ అన్నీ దాని ద్వారానే టీమ్‌తో పంచుకునే వాళ్ళం. 32 రోజుల్లో సినిమా తీశాం.
విడుదలకు ముందే ప్రివ్యూ వేశారు?
-నిజంగా ఇది సురేష్‌బాబు ఐడియా. 700ల మందికి చూపిస్తే అందులో 99శాతం మందికి ఖచ్చితంగా నచ్చుతుందని, సినిమాలో పెద్దస్టార్లు లేరు కాబట్టి వౌత్‌టాక్ హెల్పవుతుందని చూపించమన్నారు. ఓపెన్ హార్ట్‌తో రిసీవ్ చేసుకున్న ఆయన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను.
పెళ్లిచూపులు టైటిల్?
-ముందుగా సినిమాకి ‘అనుకోకుండా’ అనే టైటిల్ అనుకున్నాం. కానీ అప్పటికే అది రిజిస్టరైంది. తరువాత వివాహ భోజనంబు, పెళ్లిచూపులు అని రెండు టైటిల్స్ అనుకున్నాం. వాటిలో బాగా చూస్తే సినిమా మొదలయ్యేది. పూర్తయ్యేది పెళ్లిచూపులతోనే కాబట్టి అదే బాగుంటుందని పెట్టాం.
నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి?
-నేను తీసిన సైన్మా అనే షార్ట్ ఫిలింనే డెవలప్ చేసి ఫీచర్ ఫిల్మ్‌గా చేయాలన్న ఆలోచన ఉంది. ఈ సినిమా తరువాత సురేష్‌బాబుతో చేస్తా. ప్రస్తుతానికి ఆయన రానా, నాగచైతన్యల ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అవన్నీ అవగానే ఖచ్చితంగా కూర్చొని డిస్కస్ చేసుకుంటాం.

-శ్రీ