Others

ఊహించినట్టు ఇక్కడుండదు! --డైరెక్టర్స్ ఛాయిస్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రీమేక్ సినిమాలకంటే స్ట్రెయిట్ సినిమాల్లోనే కిక్కుంటుంది. స్ట్రెయిట్ సినిమా అంటే నా ఊహ. కనుక ఆసక్తి పుట్టిస్తుంది. అలాగని ఇండస్ట్రీలో అన్నీ మనం ఊహించుకున్నట్టు ఉండవు. పరిస్థితులకు అనుగుణంగా ముందుకెళ్లాలి అంటున్నాడు కుమార్ నాగేంద్ర. నారా రోహిత్, లతా హెగ్దె జంటగా రూపొందిన ‘తుంటరి’ రీమేక్‌తో మంచి పేరు తెచ్చుకున్న నాగేంద్రతో ఈవారం చిట్‌చాట్.
---
మీ నేపథ్యం?
తూర్పు గోదావరి జిల్లా చాగల్లు మా ఊరు. దర్శకుడు వినాయక్ సహా చాలామంది అక్కిడి నుంచి పరిశ్రమకు వచ్చినవాళ్లున్నారు. వాళ్లకులాగే నాకూ ఆసక్తి పుట్టిందేమో. వెతుక్కుంటూ వచ్చేశా.

గత అనుభవం?
ఖడ్గం నుంచి రాఖీ వరకూ కృష్ణవంశీకి ప్రియ శిష్యుడ్ని. దాదాపు పదిహేనేళ్లు ఆయన దగ్గరే పని చేశా.

దర్శకుడిగా ఫస్ట్‌చాన్స్
‘గుండెల్లో గోదారి’ కథతో వచ్చింది. లక్ష్మీ మంచుకు కథ నచ్చడంతో ప్రాజెక్టు చేశాం. తరువాత ‘జోరు’, ఇప్పుడు తుంటరి.

కమర్షియల్ లైన్‌లోకి...?
గుండెల్లో గోదారిలాంటి కథ చేయడం సాహసమే. నిజానికి తక్కువ బడ్జెట్‌తోనే బాగా తీశాం. కానీ, అలాంటి కథలు చేయడానికి ఎవరు ముందుకొస్తారు చెప్పండి. అందుకే కమర్షియల్ లైన్‌కి వచ్చా..

మనకు రీమేక్‌లు తప్పవంటారా?
స్ట్రెయిట్ సినిమాలో కిక్కుంటుంది, నిజమే. కానీ, తమిళంలో హిట్టు కొట్టింది కనుక రైట్స్ తీసుకుని తుంటరి చేశాం.

నెక్స్ట్ ప్రాజెక్టు?
కన్ఫర్మ్ కాలేదు. ఏదోకటి చేసేసి ప్రేక్షకుడిని నిరుత్సాహపర్చే ఆలోచన లేదు. మంచి సినిమా చేయాలి. అందుకు తగిన సమయం రావాలి. అవకాశాలు వెనువెంటనే రావు కనుక, చాన్స్‌ని వెతుక్కుంటూ నేనే వెళ్తున్నా. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లే సినిమా మాత్రం కచ్చితంగా చేస్తా.

-‘శ్రీ’