Others

మెగాపటేల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరుణ్‌తేజ్ కథానాయకుడుగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో కథానాయికగా ఎవరిని ఎంపిక చేస్తారా అని ఇన్నాళ్లు టాలీవుడ్ ఎదురుచూసింది. ఇప్పుడు ఆ అదృష్టం హేబాపటేల్‌ను వరించడంతో అందరూ ఆమెను ఇప్పుడు మెగాపటేల్ అని సంబోధిస్తున్నారు. ఎందుకంటే మెగా కాంపౌండ్‌లోకి వెళ్లిన మరో హీరోయిన్‌గా గుర్తిస్తున్నారు. మొదట ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్‌సింగ్‌ను కథానాయికగా అనుకున్నారు. ఆ తర్వాత కాజల్‌ను కూడా సంప్రదించారు. వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు ఎంపిక అవుతారు అనుకున్న సమయంలోనే హేబాపటేల్ ఎంటరై షాకిచ్చింది. నటనాపరంగా కుమారి చిత్రంతో మంచి మార్కులు పొందిన హేబాకు అవకాశాలు ఎదురొస్తున్నాయి. ప్రస్తుతం ఆమె ఈడోరకం ఆడోరకం చిత్రంలో రాజ్‌తరుణ్‌కి జంటగా నటించింది. దీంతోపాటు నిఖిల్ కథానాయకుడుగా చేస్తున్న చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. వాటితోపాటుగా మెగా కాంపౌండ్‌లోకి కూడా ఎంటరైంది. ఓకే!