మంచి మాట

తరిగొండ వెంగమాంబ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దైవభక్తి చిన్ననాటినుండే అలవడిన ఆధ్యాత్మిక కవయిత్రి, మహాభక్తురాలు తరిగొండ వెంగమాంబ. ఈ మహాభక్తురాలు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారికి పరమ భక్తురాలు.
క్రీ.శ.1730 సంవత్సరంలో వెంగమాంబ చిత్తూరు జిల్లా వాల్మీకి పురం తాలూకా తరిగొండ గ్రామంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు కృష్ణయామాత్యుడు, మంగమాంబ. చిన్ననాటనుండి వారు వెంగమాంబను అల్లారుముద్దుగా పెంచారు. చిన్ననాటినుండి వెంగమాంబ ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి చూపించేది. విచిత్రమేమిటనగా ఆమె గురువుల వద్ద ఏనాడూ విద్యను అభ్యసించలేదు. తన అపారమైన భక్తిప్రపత్తులతో కూడిన యోగ విద్యా పాటవంతో శ్రీ వేంకటేశ్వరస్వామివారిపై శ్రీ వేంకటాచల మహత్మ్యం అన్న పద్యకావ్యం రచించింది.
తొలుత ఈ సాధ్వీమణి తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి భక్తురాలు. దైవభక్తి సహజంగా అలవడింది ఆమెకు. ఆమె భక్తి ప్రపత్తులు చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయేవారు. రానురాను ఆమెకు భక్తి ఎక్కువగా ముదిరి తన్మయత్వంతో పాటలు పాడి నృత్యం చేసి తన్ను తాను మరచిపోయేది. భగవంతుని ఆరాధనలో మురిసిపోయేది. ఆ బాలిక భక్తి ధోరణికి వారు కలత చెంది ఏదో పిచ్చి పట్టిందని భావించి తల్లిదండ్రులు ఆమెకు బాల్యం వయసులోనే చిత్తూరు ప్రాంతంలోని నారగుంటపాళెం వాస్తవ్యుడు ఇంజేటి వెంకటాచలపతినిచ్చి వివాహం చేశారు. అయితే విధి వక్రీకరించి ఆమె భర్త వివాహం జరిగిన కొద్దిరోజులకే మృతి చెందాడు. పూర్వాచార ప్రకారం అనుసరించి ఆమె తన నుదుటిబొట్టు చెరుపుకోలేదు.
ఆ కలియుగ వేంకటాచలపతియే తన భర్తగా భావించుకుని యోగిని మార్పును కోరుకుంది. యోగినిగా మారిన వెంగమాంబ తిరుమల పుణ్యక్షేత్రం చేరుకుని తిరుమల ఉత్తరామాడ వీధిలో నివాసం వుండి స్వామివారిని భక్తితో ఆరాధించేది. అటు తర్వాత కొద్దిరోజులకు వెంగమాంబ తిరుమల శ్రీవారి ఆలయానికి పదిమైళ్ల దూరంలో నెలకొని వున్న ‘తుంబరు కోన’ ప్రాంతానికి వెళ్లి అక్కడ కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి స్వామివారి సాక్షాత్కారాన్ని పొందింది. ఆమె అపారమైన భక్తి తిరుమల శ్రీవారి ఆలయంలో ఆమె విగ్రహం ఒక చోట ఇప్పటికీ ఉండడం గొప్ప విశేషం.
వెంగమాంబ రచయిత్రిగా మారింది. ఆమె పవిత్రమైన కలం నుండి పలు గ్రంథాలు వెలువడ్డాయి. విష్ణుపారిజాతం (యక్షగానం), రమా పరిణయం (ద్విపదకావ్యం), చెంచు నాటకం (యక్షగానం), శ్రీకృష్ణమంజరి, శ్రీ రుక్మిక్షీ నాటకం, గోపికానాటకం, శ్రీవేంకటాచల మహత్మ్యం (పద్యకావ్యం), జలక్రీడా విలాసం, ముక్తికాంతా విలాసం, తత్వకీర్తనలు (ఆధ్యాత్మిక గేయములు), వశిష్ట రామాయణం (ద్విపదకావ్యం) ఆమె రచించి తన ఇష్టదైవమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వమివారికి, తిరుమల శ్రీవారికి అంకితం చేసిన ఆధ్యాత్మిక మహిళా కవయిత్రి తరిగొండ వెంగమాంబ. ఆమె భక్తి సేవలకు ఆదర్శంగా నేటికీ తిరుమల శ్రీవారి ఏకాంతసేవ సందర్భంలో ‘నిత్య ముత్యాల హారతి’ కైంకర్యాన్ని సైతం శాశ్వతంగా నెలొకొల్పింది.
తన జీవితాన్ని ఆధ్యాత్మికపరంగా సాహితీ సేవకే అంకితం చేసిన ధన్యురాలు తరిగొండ వెంగమాంబ తిరుమల తిరుపతి దేవస్థానములకే మహిళామణి దీపంగా నిలిచింది. క్రీ.శ.1817 సంవత్సరంలో ఆమె దైవ సన్నిధికి చేరుకుంది.
=========================
మంచిమాట శీర్షికకు ఆధ్యాత్మిక సంబంధమైన వ్యాసాలను సులభశైలిలో ఎవరైనా సొంతంగా రాసి పంపించవచ్చు. రచనలు పాఠకులకు ఆసక్తికరంగా వుండాలి. మూడు అరఠావులకు తగ్గకుండా వుండాలి. ప్రచురించిన రచనలకు పారితోషికం ఉంటుంది.

-ఎల్.ప్రపుల్ల చంద్ర