రాష్ట్రీయం

కేంద్ర బృందం నివేదిక అందగానే సాయం అందిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర మంత్రి వెంకయ్య హామీ

మనుబోలు (నెల్లూరు జిల్లా), నవంబర్ 21: కేంద్ర బృందం ఇచ్చే నివేదిక ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహాయం రాష్ట్రానికి ఆధారపడి ఉంటుందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. శనివారం ఆయన మండలపరిధిలోని జాతీయరహదారిపై పడిన గండిని, మరమత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్రం వద్ద ప్రకృతి వైపరీత్యాల నిధి నుంచి 350 కోట్లు ఖర్చు చేసినట్టు కేంద్రానికి ధ్రువీకరణ ఇవ్వాలన్నారు. అటు తర్వాత కేంద్రం బృందం వచ్చి అధ్యయనం చేసి నివేదిక తయారు చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికను సమన్వయం చేసుకుని కేంద్ర కమిటికి తెలియజేయాలన్నారు. అనంతరం ఆర్ధిక, గృహ, వ్యవసాయ శాఖా మంత్రులతో కూడిన ఉన్నతస్ధాయి కమిటి కేంద్ర బృందం ఇచ్చిన నివేదికను పరిశీలించి రాష్ట్రానికి తగు సహాయం చేస్తుందన్నారు. గతంలో ప్రకృతి వైపరీత్యాలలో మరణించిన వారికి కేంద్ర ప్రభుత్వం రూ.1.20లక్షలు మాత్రమే ఇస్తుండగా మోదీ ప్రధానిగా వచ్చిన తర్వాత దానిని రూ.4లక్షలకు పెంచారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరో లక్ష రూపాయలు జోడించడం సంతోషకరమన్నారు. గతంలో 50శాతం పంట నష్టపోతేనే పరిహారం చెల్లించేవారని దానిని ప్రస్తుతం 30శాతానికి తగ్గించారన్నారు.వరద సహాయక చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సమర్ధవంతంగా పనిచేస్తోందని కితాబిచ్చారు. అయితే ఈ వరద సహాయ చర్యలు పారదర్శకంగా ఉండాలని సూచించారు.అంతకుముందు జిల్లాకేంద్రంలో పర్యటనలో ఉన్న సిఎం చంద్రబాబునాయుడును ఆయన కలిసి వరద సహాయం, నిధుల సమీకరణ వంటి అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో వరదసహాయక చర్యలకు మూడువేల కోట్లు కావాలని కేంద్రాన్ని అడిగారని, ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లినట్టు వెంకయ్య స్పష్టం చేశారు. (చిత్రం) మనుబోలు వద్ద గండిపడిన ప్రాంతంలో శనివారం జాతీయ రహదారి అథారిటీ అధికారులతో చర్చిస్తున్న కేంద్ర మంత్రి వెంకయ్య