జాతీయ వార్తలు

పాలక, ప్రతిపక్షాలు సహకరించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజాస్వామ్య వ్యవస్థకు అదే అసలైన బలం * వెంకయ్య నాయుడు

న్యూఢిల్లీ, నవంబర్ 30: ప్రజాతీర్పును గౌరవిస్తూ పాలక, ప్రతిపక్షాల మధ్య కీలక అంశాలపై ఏకాభిప్రాయం కుదిరినప్పుడే పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ పదికాలాలపాటు పటిష్టంగా నిలబడుతుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ప్రజాతీర్పును అపహాస్యం చేసేలా వ్యవహరిస్తే ప్రజాస్వామ్య మనుగడకు విఘాతంగా మారుతుందని ఆయన రాజ్యసభలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 125వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్యాంగంపై జరిగిన చర్చలో మాట్లాడుతూ చెప్పారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే దేశంలో అసహనం, బలహీన వర్గాలు, దళితులపై అత్యాచారాలు పెరిగిపోయాయన్న అభిప్రాయాన్ని కలిగించటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. సమాజంలో తీవ్ర అశాంతికి దారితీస్తున్న సంఘటనలను రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించరాదని ఆయన సూచించారు. పాలక, ప్రతిపక్షాలు ప్రతి విషయంలో పరస్పరం సహకరించుకోవలసిన అవసరం ఉందని ఆయన తెలియచేశారు. ఒకరి సంప్రదాయాలు, మతం, సంస్కృతిని పరస్పరం గౌరవించుకుంటూ, సహజీవనానికి అలవాటుపడాలని ఆయన కోరారు. మన దేశానికి అత్యంత పటిష్టవంతమైన రాజ్యాంగాన్ని అందచేసిన అంబేద్కర్ అనేక ఆటుపోట్లను ధైర్యంగా అధిగమించి ప్రతి ఒక్కరికీ స్పూర్తిగా నిలిచారని ఆయన చెప్పారు. అయితే ఆయన ఆశయాలు, ఆకాంక్షలు ఎంతవరకూ సవ్యంగా నెరవేరుతున్నాయన్న అంశంపై ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్ళ చేసుకోవాలని ఆయన కోరారు. న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించుకోవటం మన దేశంలో తప్పించి ప్రపంచంలో మరేక్కడా లేదని ఆయన గుర్తుచేశారు. దక్షిణాది రాష్ట్రాలలో సుప్రీం కోర్టు బెంచ్‌లను ఏర్పాటుచేయాలన్న చిరకాల డిమాండ్‌ను అమలుచేయటంలో ఎదురవుతున్న ఇబ్బందులేమిటో తనకు అంతుపట్టటం లేదని ఆయన అన్యాదేశంగా సుప్రీం కోర్టును తప్పుపట్టారు. అసహనం పెరిగిపోతోందన్న అసంతృప్తి వ్యక్తం అవుతోంది. చలనచిత్రాలపై వివాదం నడుస్తోంది. పాఠ్యాంశాలలో పొందు పరచవలసిన అంశాలపై విస్తృత చర్చ జరుగుతోంది. సెన్సార్‌పై అసంతృప్తి వ్వక్తం అవుతోంది. అధికారులు, ప్రజాప్రతినిధుల జీతాల పెంపు గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి అనుమానాన్ని నివృత్తి చేసి ప్రజలకు సదవగాహన కలిగించే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పార్లమెంట్ సజావుగా పని చేయకపోవటంపై ప్రజలలో అసహనం, అసంతృప్తి పెరగకుండా ప్రజాప్రతినిధులు ప్రయత్నించాలని ఆయన కోరారు.