Others

ట్రేడ్ టాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త ఏడాది శుభారంభం మంచి చిత్రాలతో
జరుగుతుందని ఆశించిన బాక్సాఫీస్ తొలివారమే మొదటి
దెబ్బతిన్నది. మొదటివారంలో విడుదలైన చిత్రాలేవీ సరైన వసూళ్లు రాబట్టలేదు. ఇక ఈవారం రామ్ కథానాయకుడిగా ‘నేను శైలజ’, నాగశౌర్య, పల్లక్ లల్వాని జంటగా ‘అబ్బాయితో అమ్మాయి’, మరొక హారర్ సినిమా ‘చిత్రం భళారే విచిత్రం’తోపాటుగా
భోజ్‌పురి నుంచి డబ్బింగైన ‘నేటి విజేతలు’ చిత్రాలు విడుదలయ్యాయి. చిత్రాల్లో నేను శైలజ మాత్రమే వౌత్ టాక్‌తో మాదిరి కలెక్షన్లు రాబడుతోంది. మిగతా చిత్రాల గురించి చెప్పుకునే
అవసరమే లేదు.

సెంచరీకి చేరువైన పరిస్థితిలో 99వ అడుగు బలంగా వేయబోతున్నాడు -బాబాయ్. రజతోత్సవాన్ని ఘనంగా జరపాలని చూస్తున్నాడు -అబ్బాయ్. తండ్రి ‘ఆత్మ’కథతో అడుగేయాలని అక్కినేని, అచ్చొచ్చిన సినిమా టైటిల్స్‌నే హాఫ్ హాఫ్ షేర్ చేసి పరిగెత్తడానికి శర్వానంద్ రెడీ అయ్యారు. సంక్రాంతి పందేరానికి -నాలుగు పుంజులూ కూతపెడుతున్నాయి. గెలుపు ధీమాతో థియేటర్ల ముందు కటౌట్లుగా కళకళలాడుతున్నాయ. తెరమీద విజృంభించి.. బాక్సాఫీస్ దగ్గర బాసింపట్టేసుకుని కూర్చోడానికి సీనియర్, యంగ్ హీరోలు దాదాపు సిద్ధమైపోయినట్టే. డిక్టేటర్, సొగ్గాడే చిన్నానాయినా, నాన్నకు ప్రేమతో, ఎక్స్‌ప్రెస్ రాజా -చిత్రాలు పెద్ద పండక్కి పక్కా వినోదం పంచబోతున్న ప్రాజెక్టులు.