Others

రచయితకు స్వేచ్ఛనివ్వాలి (డైరెక్టర్స్ ఛాయిస్..) -ఇంద్రగంటి మోహనకృష్ణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైవిధ్యమైన కథలను తెరకెక్కించే దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్నాడు
ఇంద్రగంటి మోహనకృష్ణ.
మానవ సంబంధాలు, వాటిమధ్యసాగే హృద్యమైన భావాలే కీలక సన్నివేశాలుగా సాగుతాయ ఆయన సినిమాలు. ఆయన తొలిసారిగా
వేరే రచయిత రాసిన
కథతో తెరకెక్కిన ‘జెటింల్‌మన్’ విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది.
ఈ సందర్భంగా ఆయనతో చిట్‌చాట్..

రెస్పాన్స్ ఎలా ఉంది?
-నా కెరీర్‌లో ప్రతి సినిమాకి కనీసం రెండేళ్ల గ్యాప్ వచ్చింది. కానీ మొట్టమొదటిసారిగా అతి త్వరగా పూర్తిచేసిన మొదటి సినిమా కూడా ఇదే. రెస్పాన్స్ సూపర్.

వేరే రచయిత కథతో
చేయడం మొదటిసారి కదా?
-ఇప్పటివరకూ నేను రాసుకొన్న కథలనే డైరెక్ట్ చేశాను. మొదటిసారి కొత్త రచయిత డేవిడ్ నాథన్ కథను డైరెక్ట్ చేశాను.

రచయితగా పరిశ్రమలో ఎలా ఉంది?
-ఇండస్ట్రీలో రచయితలకు స్వేచ్ఛ తక్కువ. నిర్మాతలు మాకు ఈ తరహా సినిమాలే కావాలని అడుగుతుండటంతో రచయితలు కూడా అవే రొట్టగొట్టుడు కథలు రాయాల్సి వస్తుంది. అదే రచయితకు స్వేచ్ఛనిచ్చి చూడండి.. ఎంత మంచి కథలు వస్తాయో.

పరిశ్రమకు ఎలా వచ్చారు?
-నేను మొదట జర్నలిస్ట్‌గా చాలాకాలం పనిచేశా. తరువాత సినిమాలపై ఉన్న కోరికతో రచయితగా ప్రవేశించా. దర్శకుడిగా గ్రహణం సినిమాతో ఎంట్రీ ఇచ్చా.

బాగా గ్యాప్ ఇస్తున్నారు కారణం?
-ఇక నుండి ఏడాదికి ఒక సినిమా చేయాలనుకొంటున్నాను. నా తదుపరి చిత్రంగా ‘షేక్‌స్పియర్’ నవలల్లోని ఒక కామెడీ ఎపిసోడ్‌ను ఎంచుకొన్నాను.

-శ్రీ