Others

శ్రీకృష్ణ పాండవీయం (నాకు నచ్చిన చిత్రం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినీ చరిత్రలో ఎన్నో పౌరాణికాలు, గొప్ప సాంఘిక చారిత్రక సినిమాలు వచ్చాయి. అలాంటి చిత్రాల జాబితాలో చిరస్మరణీయ చిత్రం -శ్రీకృష్ణ పాండవీయం. మహాభారతంలోని ఆది, సభాపర్వాల్లోని ఘట్టాలను తీసుకుని శ్రీకృష్ణ పాండవీయంగా మలిచారు. తన బిడ్డలను రక్షించమంటూ శ్రీకృష్ణుడిని కుంతీదేవి వేడుకునే సన్నివేశం నుంచి మొదలయ్యే సినిమా -చివరి వరకూ మహాకావ్యంగానే సాగిపోతుంది.
మానధనుడైన ధుర్యోధనుడిగా, శాంతస్వభావుడైన శ్రీకృష్ణుడిగా వైవిధ్యమైన పాత్రల్ని ఏకకాలంలో పోషించడంలో మహానటుడు ఎన్టీఆర్‌కే చెల్లింది. దర్శకత్వపరంగానూ తనకున్న అపార అనుభవాన్ని రంగరించి -ఎన్టీఆర్ ఈ చిత్రానికి ప్రాణం పోశారు. శకుని మాయాజూదం, లక్క ఇల్లు తగులబెట్టే ఘట్టం, హిడింబి పాత్ర, భీమ బకాసురుల యుద్ధ ఘట్టం, ఇంద్రప్రస్థ సన్నివేశం, జరాసంధుడిని మట్టుబెట్టడంలాంటి ఎన్నో అద్భుత సన్నివేశాలు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ముఖ్యంగా కొసరాజు రాఘవయ్య తన కలానికున్న పౌరాణిక పదును పాటల్లో చూపిస్తే -ఘంటసాల, సుశీల, జిక్కి, మాధవపెద్ది, పిబి శ్రీనివాస్‌ల గాత్రధర్మం పాటలకు మరింత వనె్న తెచ్చింది. కన్నడ నటుడు ఉదయకుమార్ చిత్రీకరించిన ‘మత్తు వదలరా నిద్దుర మత్తువదలరా, మత్తులోన పడితే గమ్మత్తుగ చిత్తవుదువురా’ పాట -వ్యక్తిత్వ వికాసంలో పది పాఠాల పెట్టు. కెఆర్ విజయ, కాంతారావు, ధూళిపాళ, మిక్కిలినేని ఇలా నట దిగ్గజాలు వాళ్లు పోషించిన పాత్రలకు ప్రాణం పోసిన సినిమా ఇది. టివి రాజు స్వర బాణీలు, రవికాంత్ నగాయిచ్ ట్రిక్ ప్రొటోగ్రఫీ మనల్ని మరో లోకంలోకి తీసుకుపోతాయి. ఛాంగురే బంగారురాజా, ప్రియురాల సిగ్గేలనే, స్వాగతం కురుసార్వభౌమ స్వాగతం, భళ భళీ నా బండీ పరుగూ తీసేనండి.. ఇలా ఈ చిత్రంలోని ఎన్నో మధురగీతాలు మనస్సులో మెదులుతూనే ఉంటాయి. మాయాబజార్ మాదిరిగా ఈ చిత్రాన్నీ రంగులలో నిర్మించి తిరిగి విడుదలచేస్తే రాబోయే తరాలకీ జ్ఞాపకంగా ఉంటుంది. స్వర్ణయుగంలో నిర్మితమైన సినిమాయే అయినా, ఏ తరానికీ మెచ్చదగిన చిత్రం శ్రీకృష్ణ పాండవీయం.

-సిహెచ్ హనుమంతరావు, హైదరాబాద్