Others

ట్రేడ్ టాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్ద తారల చిత్రాలు ఎప్పుడు విడుదలైనా ఫరవాలేదు. వాటికి ఏ పోటీ ఉండటం లేదు. ఆ సినిమాలు విడుదలై ఐదారు వారాలైంది కదా. ఇక మన సినిమాలు విడుదల చేసుకుందాం అని చిన్న నిర్మాతలు అనుకుంటే అది నిరాశే అవుతుంది. ఎందుకంటే ఆయా చిత్రాల్లో ఎటువంటి ఆకర్షణ లేకపోవడమే. ఇది ప్రతివారం అనుభవైక వేద్యమే అవుతోంది. ఈవారం మెగా క్యాంపస్ హీరోయిన్ నిహారిక, నాగశౌర్య జంటగా రూపొందిన ‘ఒక మనసు’, చాందినీ చౌదరితో రూపొందించిన ‘కుందనపు బొమ్మ’ చిత్రాలతోబాటుగా శర్వానంద్, నిత్యామీనన్ జంటగా చేరన్ దర్శకత్వంలో వచ్చిన ‘రాజాధిరాజా’ చిత్రాలు విడుదలయ్యాయి. చిత్రాలన్నీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో వెనకబడ్డాయి. ఒక మనసు చిత్రం తొలి ఆటతోనే ప్రేక్షకులు పెదవి విరిచారు. కుందనపుబొమ్మలో ఎటువంటి విశేషాలు లేకపోవడంతో ఆకట్టుకోలేకపోతోంది. ఉన్నంతలో ద్విభాషా చిత్రంగా రూపొందిన రాజాధిరాజా ఒక్కటే సోసోగా ఉందని వౌత్‌టాక్ వచ్చినా థియేటర్ల వద్ద ప్రేక్షకులు కనబడటం లేదు. గతవారాల్లో విడుదలైన పెద్ద చిత్రాలే ఇంకా బాక్సాఫీస్‌ను గలగల్లాడిస్తున్నాయి. కొత్త చిత్రాలు వెలవెలబోయేలా చేస్తున్నాయి.