Others

ట్రేడ్ టాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథవున్న చిత్రాలకు ప్రేక్షకులు పట్టంకడుతున్నారు. అభిరుచిలో మార్పు వచ్చిందని తెలియని పరిశ్రమ పాత చింతకాయ, కాకమ్మ కథలతోనే చిత్రాలు తీసి చేతులు కాల్చుకుంటోంది. ఈవారం మారుతి మార్క్ ‘రోజులు మారాయి’, అర్ధనారి, లవ్‌స్టోరీతో టైటానిక్, హారర్ జోనర్‌లో దిగ్బంధన, డార్లింగ్ టు చిత్రాలతోపాటు భారీ అంచనాలతో సత్యరాజ్ ‘దొర’ చిత్రాలు విడుదలయ్యాయి. అయితే, ప్రేక్షకులు ఏ చిత్రానికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. రోజులు మారాయి చిత్రానికి తొలిరోజు నుంచి ప్రేక్షకులు కరవయ్యారు. టైటానిక్, దిగ్బంధన, డార్లింగ్-2 చిత్రాల గురించి మాట్లాడుకోకపోవడం ఉత్తమం. భారీ అంచనాలతో వచ్చిన దొర ప్రేక్షకులకు తలపోటులా తయారైంది. ఇక ఉన్నంతలో పాత ధోరణిలో సాగినా ఏదో చెప్పాలని దర్శకుడు ప్రయత్నించడంతో ‘అర్ధనారి’ ఒక్కటే బీసీ సెంటర్లలో కనిపిస్తోంది. మంచి చిత్రం కోసం ప్రేక్షకుడు ఎదురుచూపులు మళ్లీ మొదలయ్యాయి.