ఈ వారం తార

భలే ఫీలింగ్! ( పూజా హెగ్దె)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నపుడు చదువుకున్న పాఠంలాంటి కథలో ఓ పాత్ర పోషించే అవకాశం వస్తే ఎంత బావుంటుంది? పూజా హెగ్దెకు అలాంటి చాన్స్ దక్కినందుకు తెగ సంబరపడిపోతోంది. ముకుందా, ఒక లైలా కోసం చిత్రాల తరువాత -తెలుగు స్క్రీన్‌పై కనిపించే అవకాశానికి దూరమైన ఈ కన్నడ అందం, ఇప్పుడు మళ్లీ ఓ స్టార్ హీరో ప్రాజెక్టుకు సంతకం చేసిందని తెలుగు పరిశ్రమలో టాక్. ఇప్పటి వరకూ ప్రతిష్టాత్మక బాలీవుడ్ చిత్రం ‘మొహంజదారో’కే ఎక్కువ సమయం కేటాయించి, ప్రస్తుతం ఆ చిత్రం ప్రమోషన్స్‌లో బిజీగా గడుపుతోంది పూజ. ఆగస్టు 12న విడుదలవుతోన్న ‘మొహంజదారో’ -తనకు స్టార్ స్టేటస్ తెస్తుందన్న ఆశల్లోనూ విహరిస్తోంది. బాలీవుడ్‌లో అడుగుపెట్టడంతోనే -హీరో హృతిక్‌రోషన్, డైరెక్టర్ అశుతోష్ గోవరికర్‌లాంటి లెజెండ్స్‌తో కలిసి పనిచేసే అవకాశం దక్కించుకున్న పూజహెగ్దె -ఈ ప్రాజెక్టుతో కల నిజమైనట్టు ఫీలవుతోందట. ఇప్పుడు తెలుగులో ఏ స్టార్‌తో జతకట్టేందుకు సిద్ధమవుతుందో -వివరాలు త్వరలోనే తెలుస్తాయి.