ఈ వారం తార

పబ్లిసిటీ పిచ్చి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోస్టర్ లావణ్య త్రిపాఠి

లావణ్యకు పబ్లిసిటీ పిచ్చి బాగా ముదిరిందట. సహజంగా ఏదైనా ప్రాజెక్టులో చేసే సమయంలో మాత్రమే హీరోయన్లు మీడియాలో వినిపిస్తారు, కనిపిస్తారు. మరి, మిగతా సమయాల్లో ఏంచేయాలి? అందుకే తన గురించి ఫ్రీటైంలో ఫ్రీ చాటింపు వేసుకోడానికి ఓ కొత్త ఐడియాని అమల్లో పెట్టేసింది లావణ్య. ఎక్కడికెళ్లినా తన స్టైల్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారని, తాను ఒక్కసారి ఒక్క చూపు చూస్తే అందరూ సమ్మోహితులవుతున్నారని ప్రింట్, విజువల్ మీడియాకు ఫీలర్లు వదులుతోంది. లావణ్య సరికొత్త స్ట్రాటజీ చూసి మీడియా వర్గాలు బిత్తరపోతున్నాయ. స్టార్ స్టేటస్ పొందిన సమంత కూడా ఇలా సొంత డబ్బా కొట్టుకోదని, లావణ్యకు ఎందుకింత గుర్తింపు గోలంటూ టాలీవుడ్ చెవులు కొరుక్కుంటోంది. ఈమధ్యే ఒకటి రెండు హిట్లు తన ఖాతాలో పడటంతో లావణ్య రెచ్చిపోతోందని అంటున్నారు. హీరోయన్లకు గుర్తింపు గోల ఉండొచ్చుగానీ, మరీ చీప్ పాపులారిటీ కోసం ఎగబడితే నవ్వులపాలు కాక తప్పదంటున్నారు టాలీవుడ్ జనాలు.