Others

ఉమాసుందరి ఫ్లాష్‌బ్యాక్@ 50

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథ, మాటలు, పాటలు:
సదాశివ బ్రహ్మం
నృత్యం: వెంపటి చినసత్యం
కూర్పు: గోవింద స్వామి
కళ: కెఆర్ శర్మ
కెమెరా: రాము
సంగీతం: జి అశ్వత్థామ
నిర్మాత: పి సోమసుందరం
సహకార దర్శకుడు: లంక సత్యం
దర్శకత్వం: పి.పుల్లయ్య

తమిళనాడుకు చెందిన అభిరుచిగల నిర్మాత పి సోమసుందరం. ప్రముఖ నిర్మాణ సంస్థ నారాయణం అండ్ కంపెనీలో భాగస్వామిగా తమిళంలో ‘కణ్ణాన్ కన్ కండ్, దైవం’ చిత్రానికి, దాన్ని తెలుగులో ‘పతియే ప్రత్యక్ష దైవం’, హిందీలో ‘దేవత’గా.. ఆపైన మరికొన్ని తమిళ చిత్రాలు రూపొందించారు. ఆ సంస్థ నుంచి విడిపోయి ‘జూపిటర్ పిక్చర్స్’ స్థాపించి కొన్ని తమిళ చిత్రాలు, తెలుగులో ఎన్టీఆర్ హీరోగా ‘సంతోషం’, తరువాత ‘ఉమాసుందరి’ నిర్మించారు. ‘జూపిటర్ సోము’గా ప్రసిద్ధి చెందిన వీరు దక్షిణ భారత నిర్మాతల మండలిలో ప్రముఖ నిర్మాత ఎస్‌ఎస్ వాసన్‌తోపాటు కీలక సభ్యునిగా కొనసాగారు. ఆ తరువాత జూపిటర్ పిక్చర్స్‌పై నిర్మించిన ‘వాల్మీకి’, ‘మర్మయోగి’ చిత్రాలకు ఎన్టీఆర్ హీరోగా నటించటం విశేషం. ఉమా సుందరి చిత్రం 1956 జూలై 20న విడుదలై 60 ఏళ్లు పూర్తి చేసుకుంది.
***
మహారాజు భూపి (నాగయ్య) సోదరి ఉమాసుందరి (జూనియర్ శ్రీరంజని). ఆమె వదినె నీలవేణి (కన్నాంబ). పిల్లలులేని ఆ దంపతులు ఉమాసుందరిని గారాబంగా పెంచి పెద్ద చేస్తారు. ఉమాసుందరిని తన తమ్ముడు అలంకార భూపతి (రేలంగి)కి ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటుంది నీలవేణి. ఉమాసుందరి అందుకు అంగీకరించక పోవటంతో ఆమెపై క్రోధం, అసూయ పెంచుకుంటుంది. రాయదుర్గం చక్రవర్తి విజయరాయలు (ఎన్టీఆర్) శివాలయంలో చూసి ఇష్టపడిన ఉమాసుందరితో వివాహానికి ఆమె అన్నగారికి కబురు చేస్తాడు. ఉమాసుందరి అంగీకారంతో వారిరువురికీ వివాహం జరుగుతుంది. ఉమాసుందరికి తొలుత మగబిడ్డ జన్మిస్తాడు. తరువాత వారికి వరుసగా ఆరుగురు సంతానం, దాంతోపాటు వారి రాజ్యంలో ‘సప్తవర్ష క్షామం’ ఏర్పడి.. రాజ్యం, ప్రజలు కడగండ్ల పాలవుతారు. పుట్టింటి సాయం కోసం ఉమాసుందరి పంపిన వర్తమానాలు, నీలవేణి కారణంగా అందకపోవటం జరుగుతుంది. భర్త సలహాతో పిల్లలతో పుట్టిల్లు చేరిన ఉమాసుందరిని వదిన నీలవేణి నానా హింసలు పెట్టి తరిమేస్తుంది. భూపతికి నిజం తెలిసి నీలవేణిని నిలదీయగా, ఆమె తన క్రోధం తెలిపి ఆత్మహత్య చేసుకుంటుంది. అడవిలో భార్యా పిల్లల కోసం వెదకుతున్న రాయలకు శివుడు జ్ఞానబోధ చేస్తాడు. పిల్లలను బావిలో తోసి తానూ మరణించాలనుకున్న ఉమాసుందరిని పార్వతీదేవి (రమాదేవి) అడ్డుపడి ఆపుతుంది. బొమ్మల నోము, సావిత్రి గౌరీ వ్రతం, ఉల్లంఘన చేసి బొమ్మలను దాచుకుందని, దాని ఫలితంగానే ఈ కష్టాలని వివరిస్తుంది. ఇపుడు ఆమె పిల్లలను బావిలో వేయటంతో వ్రతం పూరె్తై ఆమె కష్టాలు తొలిగాయని వివరిస్తుంది. భర్త రాయలు, అన్నగారు భూపతి రావటం, పిల్లలందరూ బ్రతికి రావటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
ఈ చిత్రంలో రేలంగి జంట వనజగా బాల సరస్వతి, మహారాణి అనుచరుడు అవతారంగా పేకేటి శివరామ్, ఎన్టీఆర్ మిత్రునిగా వంగర, ఈశ్వరుడు మారువేషంలో సన్యాసిగా నాగభూషణం నటించారు.
చక్రవర్తి జయరాయలుగా ఎన్టీ రామారావు దర్పాన్ని చూపించారు. చక్కని చిర్నవ్వుతో ఉమాసుందరితో ప్రణయాన్ని రంజింప చేశారు. రాజ్యంలో క్షామం సంభవించగా ప్రజల కష్టాలకు స్పందించటంలో క్షోభను, అడవిలో భార్యాబిడ్డల వెతుకులాటలో తీరని ఆవేదన, శివుని జ్ఞానబోధ పట్టించుకోని విరాగిలా ఎంతో అద్భుతమైన భావావేశాలను ప్రదర్శించి మెప్పించారు. ఉమాసుందరిగా జూ.శ్రీరంజని ఆనందం, కరుణ, విచారం, దైవభక్తి సన్నివేశానుగుణంగా సహజమైన నటన చూపారు.
మహరాజుగా నాగయ్య సోదరిపట్ల వాత్సల్యం, భార్యపట్ల అనురాగం, బావగారిపట్ల అభిమానం, ఉదాత్తమైన నటన చూపారు. నయవంచన, అసూయ, కుటిలత్వం భావాలను చిరునవ్వు చాటున దాచటంలో యుక్తి, చూపుల్లో, మాటల్లో వ్యక్తపరచటం, నీలవేణిగా కన్నాంబ అభినయం, వైవిధ్యంగా అలరించింది. అనుభవజ్ఞులైన దర్శకులు పి పుల్లయ్య చిత్రాన్ని కథానుగుణంగా సన్నివేశాలను అర్థవంతంగా తీర్చిదిద్దారు. క్షామ పరిస్థితులను, ఉమాసుందరి దైన్యాన్ని ఎంతో విఫులంగానూ, మహారాజు ఎన్టీఆర్ తరతరాలుగా వెలిగే దేవుని ముందు దీపం కొండెక్కి పోతుందని విచారించటం, మహారాణి ఉమాసుందరిని ప్రజలు నిందించటం వంటి విషయాలను ఆర్థ్రత నిండేలా రూపొందించటం విశేషం.
సదాశివ బ్రహ్మం వ్రాసిన భక్తి గీతాలతోపాటు ఈ చిత్రంలోని హిట్‌సాంగ్స్ ‘మాయా సంసారం తమ్ముడు’ ‘కోరితెచ్చుకున్న బారమంతే కాని దార పుత్రులు నిను దరి చేర్చుతారా’, ‘అద్దె కొంప దేహమంతరా తమ్ముడు, వద్దు పొమ్మనగానే వదిలేచి పోవాలి’ (పిఠాపురం), మరోగీతం (ఘంటసాల, పిఠాపురం) ‘నమ్మకు రా ఇల్లాలు పిల్లలు’లో ఘోర దురిత సంసార జలధిలో జ్ఞానమే చేయూత, అజ్ఞానమే ఎదురీతా జీవా నిత్యసత్యాలైన గీతాలు ‘ఉమాసుందరి’ చిత్రాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకునేలా నిలిచాయి. ఎన్టీఆర్, జూ.శ్రీరంజనిలపై చిత్రీకరించిన యుగళగీతం చక్కని ఉద్యానవనం, రాజభవనాలు, వెనె్నల, చంద్రుని చూపుతూ సాగటం ‘ఎందుకో రేరాజా మా మీద జాలి వెనె్నల్లో వేడి, పువ్వుల్లో వాడి’ (ఘంటసాల), మేనల్లుడిని ఎత్తుకుని నాగయ్య పాడేపాటు ‘రావోయి, రావోయి రతనాల పాపాయి’ అశ్వత్థామ సంగీతం అలరించేలా రూపొందింది. ‘తొమ్మిది తొర్రల బుర్ర ఇది’ అని దేహాన్ని గురించి, ఈ ‘సంసార జలధిలో బంధువులు కష్టాలలో కనబడరు’ ‘వల్లకాడు నువువద్దన్నా నిన్ను వదలదు పుట్టిన ప్రాణుల, కన్నీటికిది పుణ్యక్షేత్రం’.. మరిన్ని సందర్భోచిత మాటలతో, ఆకట్టుకునేలా రచన సాగింది. బైరాగిగా ఎన్టీఆర్‌ను అనుసరించే శివునిగా నాగభూషణం ఎంతో ఈజ్‌తో నటించి తన ప్రత్యేకత నిలుపుకున్నారు. మహిళా దారణ పొందిన చిత్రంగా ‘ఉమాసుందరి’ విజయం సాధించింది.

-సివిఆర్ మాణిక్యేశ్వరి