Others

ట్రేడ్‌టాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెను తుపానుకు ముందు మహానిశ్శబ్దం అలుముకున్నట్లుగా సంక్రాంతి సినిమాలకోసం ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నిశ్శబ్దాన్ని ఛేదించడానికి ఈవారం తొమ్మిది సినిమాలు తెలుగు తెరపై తళుక్కుమన్నాయి. అయితే ఏ సినిమాలో కూడా సరైన నటీనటులు లేకపోవడంతో, అందరూ కొత్తవాళ్లతో రూపొందించడంతో ఆ సినిమాలకు వెలుగు తక్కువైంది. ఈవారం కవ్వింత, కిల్లింగ్ వీరప్పన్, పాకశాల, ఓ మై గాడ్, దిల్ వున్న రాజు, వీలైతే ప్రేమిద్దాం, తస్కర లాంటి చిత్రాలతోపాటుగా పిశాచి బంగ్లా, హాలీవుడ్ నుండి అనువాదమైన ‘జోంబి బెల్లె’ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ చిత్రాలన్నీ పెద్ద సినిమాలకు స్వాగతం చెప్పడానికి థియేటర్ల దగ్గర వున్నాయి. ఇష్టమైనవాళ్లు అగ్ర హీరోల పోస్టర్లు చూడడానికి వెళ్లి, అటునుంచి అటు థియేటర్లలోకి వెళుతున్నారు. కొద్దో గొప్పో బాక్సాఫీస్‌లో బతికించే ప్రయత్నం ఈ వారం ఇలా సాగింది.