Others

తీరని కోరిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు, తమిళ తెరలను పదిహేడేళ్లపాటు ఏలేసిన త్రిషకూ -ఓ తీరని కోరిక ఉందట. తెలుగు, తమిళ హీరోలతో వరుసపెట్టి సినిమాలు చేసేసిన త్రిష -స్టార్ హీరో రజనీతో ఒక్క సినిమా కూడా చేసే అవకాశం రాలేదని ఇప్పుడు ఆవేదన చెందుతోంది. ఈ విషయానే్న ఈమధ్య చెప్పుకొస్తూ అనేకమంది హీరోలతో నటించినా, సూపర్‌స్టార్ రజనీతో నటించాలన్న కోరిక ఇప్పటికీ తీరలేదని, ఆ ఒక్క కోరికా అలాగే ఉండిపోయిందని చెప్పుకొచ్చింది. తన కెరీర్ మంచి ఊపులో ఉన్నపుడే ఈ అవకాశం వస్తుందని భావించినా, ఇప్పటి వరకూ రాకపోవడం బాధాకరమేనన్నది త్రిష మాటల్లోని ఆంతర్యం. ఎప్పటికైనా చాన్స్ రాకపోతుందా? అంటున్న త్రిషకు -కెరీర్ మీద ఇంకా చాలా ఆశలే ఉన్నట్టున్నాయి.