మీ వ్యూస్

ఇద్దరితోనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్, మోహన్‌లాల్ ప్రధాన తారాగణంగా విడుదలైన జనతా గ్యారేజ్‌లో అనేక రిపేర్లు చేస్తామని చెప్పినా, సినిమాకు కొన్ని రిపేర్లు చేయడం మర్చిపోయారు దర్శక నిర్మాతలు. కథనం కొత్తగా ఉన్నా కథలో పసలేకపోవడంతో సినిమా సోసోగానే సాగింది. ఇక ఇద్దరు హీరోయిన్లున్నా ఒక్కరికీ కూడా సరైన ప్రాథాన్యత ఇవ్వకపోవడం విచారకరం. సమంత, నిత్యామీనన్‌లు గ్లామర్‌కు మాత్రమే నిలబడ్డారు. ఎన్టీఆర్, మోహన్‌లాల్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు మరింత హుందాగా ఉంటే బాగుండేది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా సరిగా కుదరలేదు. మోహన్‌లాల్ లాంటి నటుడ్ని తీసుకుని ఇలాంటి పాత్ర ఇస్తారా?
-టి రఘురామ్, నరసరావుపేట

అందగాడు హరనాథ్
తెలుగు చిత్రసీమలో ఒక అందాల నటుడు హరనాథ్. రామారావు, కాంతారావుల మాదిరిగా పౌరాణిక, చారిత్రక, జానపద, సాంఘిక చిత్రాల్లో మెప్పించిన గొప్ప నటుడాయన. భీష్మ సినిమాలో కృష్ణుడిగా వేసిన పాత్రను ఎవరయినా మరచిపోగలరా? స్పష్టమైన వాచకం ఆయన సొత్తు. అంత తెలివైన ఆకర్షణీయమైన నటుడు వ్యసనాలకు పాల్పడి వెండితెరమీద బంగారు జీవితాన్ని కోల్పోయి చిన్నతనంలోనే అనంత లోకాలకు వెళ్లిపోవడం విచారకరం. ఆయన స్థానం తెలుగు చిత్రసీమలో ఎప్పటికి పదిలమే. శరత్కాలంలో హరనాథ్‌ను గుర్తు చేసుకోవడం ఒకింత ఆనందం.
-ఎన్‌ఆర్ లక్ష్మి, సికిందరాబాద్

ఆపాత మధురాలు
నాటి తెలుగు సినిమా పాటలు ఆపాత మధురాలు. అవి ఈనాటికీ మన మనసుకు ఆహ్లాదాన్ని.. ఆనందాన్ని ఇస్తున్నాయి. అలాంటి పాటలను నేడు మన హీరోలు రీమిక్స్ చేసి నానా రచ్చ చేస్తున్నారు. దయచేసి అలా చేయవద్దని మనవి. కొంతమంది హీరోలు చేసిన కొన్ని పాటలు కొంచెం ఫర్వాలేదు. మరికొంతమంది చేసిన పాటలు వింటే పరమ రోతగా ఉంటుంది. నాటి సంగీత దర్శకులు, గాయకులు ఎంతో కష్టపడి కేవలం మనకోసం వీనులవిందుగా అందించిన అలనాటి మేటి పాటలు అద్భుతాలు. అవి ఈనాటికీ నిత్య నూతనాలు, ఆనంద పరవశాలు. అలాంటి మంచి పాటలను చెడగొట్టొద్దు. సదరు హీరోలు, నిర్మాతలు, సంగీత దర్శకులు ఈ విషయాన్ని గమనించాలి. అమరులైన మహామహుల ఆత్మలను క్షోభకు గురిచేయకండి. బతికున్న వీక్షకుల మనసు నొప్పించకండి.
-కె శ్రీనివాసులు, హైదరాబాద్

వీళ్లు మారరా?
ఆకాశంలో నల్లమబ్బు చూసి బ్రహ్మాండంగా వర్షాలు కురిసి బాగా పంటలు పండి గాదెలు నిండి రైతులు కోటీశ్వరులైపోతారని జోస్యం చెప్పడం ఎలాంటిదంటే -నిర్మాణంలోవున్న చిత్రానికి హైప్ సృష్టించి గొప్ప కలక్షన్లు కురుస్తాయని చెప్పడంలాంటిది. ఒక చానెల్ సినీ విలేఖరి -బాహుబలి ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లు ఆర్జించింది కనుక రెండో భాగానికి వెయ్యి కోట్లు ఆశిస్తున్నారు. రాజవౌలి పారితోషికం 30 కోట్లు. ఈసారి లాభంలో భాగం కూడా తీసుకొని వంద కోట్ల దర్శకుడు అయిపోతాడని జోస్యం చెప్పాడు. సర్దార్, బ్రహ్మోత్సవం, కబాలి నిర్మాణ దశలోనూ ఇలాంటివే వినిపించాయి. ఫలితం అందరికీ తెలిసిందే. అయినా కొందరు జోస్యాలు మానరు. నమ్మి మునిగిపోతూనే వుంటారు. అలాంటివాళ్లను చూసి.. అదృష్టదేవత నవ్వుతూనే ఉంటుంది.
-పి శాండిల్య, కాకినాడ

దటీజ్ ఎన్టీఆర్
నర్తనశాల సినిమా ప్రారంభంలో దర్శకుడు కమలాకర కామేశ్వరరావు ఎన్టీఆర్‌ను బృహన్నల పాత్రలో నటించమని చెప్పినప్పుడు మొదట ఆయన ఒప్పుకోలేదు. నృత్యంలో దిట్ట అయిన ఎల్ విజయలక్ష్మితోపాటుగా భరతనాట్యం చేయటం ఎంతో కష్టమైనదని, ఆ విషయంలో ఆమె ముందు తాను నిలువలేనని అనుమానం వ్యక్తం చేశారు ఎన్టీఆర్. అప్పుడు వెంపటి సత్యం వద్ద 20 రోజులపాటు నృత్యంలో శిక్షణ పొందితే మీ పాత్ర విజయవంతంగా ఉంటుందని దర్శకుడు సలహా ఇచ్చారు. అలా ఎన్టీఆర్ నృత్యంలో శిక్షణ పొందారు. అప్పుడు ఆయన వయసు 39 ఏళ్లు. అయినా కానీ దీక్షతో నృత్యం నేర్చుకుని ఎల్ విజయలక్ష్మి వంటి గొప్ప నర్తకికే పాఠాలు నేర్పినట్టుగా ఆయన నటించిన తీరు అద్భుతం. అదీ దీక్షాపరుల శక్తి! ఆ సినిమా చూసిన ప్రతీసారీ ఈ విషయం గుర్తుకొస్తుంటుంది.
-కెవి ప్రసాదరావు, కందుకూరు

మాకు తెలియదు
గుమ్మడి భక్తపోతనగా నటించాడని ఫ్లాష్‌బ్యాక్ చదివే వరకు మాకు తెలీదు. నిజానికి ఆణిముత్యాలను మళ్లీ సృష్టించాలనుకుంటే -అవి కృత్రిమమైపోతాయని చాలాసార్లు రుజువైంది. బీదలపాట్లు, క్షేత్రయ్య చిత్రాల్ని అక్కినేని చరిష్మా రక్షించలేకపోయింది. దాసరి తీసిన సోషల్ మాయాబజార్ సోదిలో లేకుండాపోయింది. సోమయాజులుతో తీసిన త్యాగయ్య గతీ అంతే. మీ చిత్రాల్లో చెంపదెబ్బ సీను తప్పక ఉంటుంది కదా, మరి త్యాగయ్య సినిమాలో లేదెందుకు? అని విలేఖరులు నిర్మాతను అడిగితే ఈసారి త్యాగయ్యే నన్ను చెంపదెబ్బ కొట్టాడని చమత్కరించాడట.
-బి సోనాలి, సూర్యారావుపేట

భావ నిజాయితీ
కమల్‌హాసన్ మంచి నటుడే కాక ఆలోచనాపరుడు కూడా. అవార్డులు, పొగడ్తలు తనకిష్టం అని దాపరికం లేకుండా చెప్పాడు. తనను ఫ్రెంచి ప్రభుత్వం షవాలియర్ అన్న బిరుదుతో సత్కరించినప్పుడు తన అనుభూతుల్ని ఓ పత్రిక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. ఆ అవార్డు శివాజీగణేశన్‌ను వరించినప్పుడు ఆ సన్మాన సభలో మొదటి వరుసలో కమల్‌హాసన్ కూర్చుంటే, ఓ మహిళ వచ్చి శివాజీ తరువాత ఆ అవార్డు నీకే అన్నదట. అలాగే జరిగిందని, తనను పొగిడితే గర్వంగాను, బాధగాను ఉంటుందని చెప్పాడు. తను చదివింది హైస్కూలు వరకే అయినా తనను పొగిడేవారికి ఆ విషయం తెలుసోలేదో, తెలిస్తే అవమానిస్తారేమోనని బాధపడేవాడట. తనకంటే గొప్ప నటులు ఏ అవార్డూ రాకుండానే చనిపోయారే అని బాధ కూడా పడతాడట. కమల్ భావ నిజాయితీని మెచ్చుకోవాల్సిందే!
-ఎస్ కృష్ణ, కొండయ్యపాలెం