Others

ట్రేడ్ టాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈసారి విజయ దశమికి ఆడియన్స్‌ను స్టార్ హీరోలు పలకరించలేకపోయారు. దీపావళి, సంక్రాంతి టార్గెట్‌గా స్టార్ హీరోల సినిమాలు నిర్మాణంలో ఉండటంతో -దసరా స్లాట్‌లో మీడియం, చిన్న సినిమాలు పండగ చేసుకున్నాయి. ఈవారం నాగచైతన్య హీరోగా మళయాల రీమేక్ ‘ప్రేమమ్’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రభుదేవాతో కలిసి ద్విపాత్రాభినయంగా తమన్నా చేసిన ‘అభినేత్రి’, సునీల్ హీరోగా ‘ఈడు గోల్డ్ ఎహె’, ప్రకాష్‌రాజ్, ప్రియమణిల ‘మనవూరి రామాయణం’తోపాటు కర్నాటక మాజీ సిఎం కుమారుడు నిఖిల్ హీరోగా ‘జాగ్వార్’ చిత్రాలు విడుదలయ్యాయి. ఈ ఐదు చిత్రాల్లో ప్రేమమ్ మంచి వౌత్ టాక్ సంపాదించుకుంటే, అభినేత్రి పండగ సినిమాగా ఎంజాయ్ చేసేస్తున్నారు. సునీల్‌కు భారీ ఆశలు, ఆడియన్స్‌లో అంచనాలు పెంచిన ‘ఈడు గోల్డ్ ఎహె’ స్టామినా చూపించలేకపోయింది. ఇక ట్రైలర్స్‌తో గొప్ప యాక్షన్ ఎడిసోడ్స్ ఉన్న చిత్రం అనిపించుకున్న ‘జాగ్వార్’ పోటీలో పూర్తిగా జావగారిపోయింది. వైవిధ్యమైన పాయింట్‌గా టాక్ తెచ్చుకున్న ‘మన ఊరి రామాయణం’ ‘ఏ’ గ్రేడ్ థియేటర్లలోనూ నిలబడలేక ఇబ్బందులు పడుతోంది. ముందే కూసిన కోయిల అన్నట్టు -ఈ సీజన్‌లో విడుదల కావాల్సిన సినిమా కాదన్న వ్యాఖ్యలు మూవీ ఎక్స్‌పర్ట్స్ నుంచి వినిపిస్తున్నాయి. మొత్తానికి దసరా హడావుడి అంతా ప్రేమమ్, అభినేత్రి చిత్రాలపైనే నడుస్తోంది.