Others

ఆడియన్స్‌ను వీడని నీడ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నిను వీడని నీడను నేనే/ కలగా కదిలే కథ నేనే’. -ఈ పాటకు ముందు ఇలాంటి హారర్ సాంగ్స్ ఉండే ఉండొచ్చు. కాకపోతే, ఈ సాంగ్ ఏ ముహూర్తాన రాశారో.. ఏ ఘడియల్లో గుమ్మడిపై షూట్ చేశారోగాని అప్పటినుంచీ దెయ్యాల పాటలు ఆడియన్స్‌ని వెంటాడుతూనే ఉన్నాయ.
నిజానికి తెలుగు సినీ ప్రేక్షకులు హారర్ సినిమాలని, వాటిలోని భయపెట్టే పాటలని బాగానే ఆదరించారు, ఆదరిస్తూనే వస్తున్నారు. నేటికీ ఒక తరహా హారర్ సినిమాలకు ఆదరణ లభిస్తోందంటే అందుక్కారణం -ఆయా సినిమాల్లోని కథాకథనాలే కాదు సినీ దిగ్గజాలైన పాటల రచయితలు ఎంతగానో స్పందించి రాస్తున్న చక్కని పాటలు కూడా. -సి.ఐ.డి.రాజు సినిమాలో విజయలలిత దెయ్యం వేషంలో పాడే ‘నేనేలే పిలుపు నాదేలే’, ‘విలువైన ఈనాటి రేయి నేననుకున్నదే తీరునోయి నిలువెల్ల పులకించి చూడూ నిను వీడిపోలేను నేను’ ఈ రెండు పాటలూ అప్పట్లో బాగా పాపులరయ్యాయి. ఇక కృష్ణ, కృష్ణంరాజులు నటించిన ‘రాజ్‌మహల్’ చిత్రంలో విలన్లు నిధికోసం పాడుబడిన బంగ్లాలో తవ్వకాలు చేస్తుంటే వచ్చే హారర్ సాంగ్ కూడా ఆసక్తికరంగా వుంటుంది. ‘నాగభైరవ’ సినిమాలో కూడా రాత్రివేళ దెయ్యాలు సంచరిస్తున్నప్పుడు శ్రీలక్ష్మి పాటలేకున్నా ఒక్కర్తే తిరుగుతూ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో భయపెట్టేసింది. ఇక శోభన్‌బాబు, జయప్రద నటించిన ‘్ధర్మచక్రం’ సినిమాలో ఒక బంగ్లాలో జయప్రద పాడే ‘రావోయి ఈరేయి అలనాటి చెలియ వలచి పిలిచేనోయి’ పాట కూడా ఎంతో ఉత్కంఠగా సాగేదే. ‘జగమేమాయ’ సినిమాలోనూ హారర్ సన్నివేశాలు ఆకట్టుకునేలా డిజైన్ చేశారు. ‘గుండెలు తీసిన మొనగాడు’ చిత్రంలో ‘ఆరని జ్వాలన తాపము సుడిగాలిలోన నా గీతము పోదాం రారా మరో లోకం ఓ ప్రియా’ సాంగ్ అప్పట్లో సంచలనమే సృష్టించింది. ‘ఇద్దరూ అసాధ్యులే’ చిత్రంలో కవిత మీద చిత్రీకరించిన దెయ్యం పాట కూడా అప్పట్లో భయంకరమైన హారర్ సాంగ్‌గా పేరుతెచ్చుకుంది. డబ్బింగ్ సినిమాగా వచ్చిన ‘అర్ధరాత్రి’ సినిమాలో బేబీ షామిలీపై చిత్రీకరించిన ‘నేనే మరీ ఓ జాబిలి’ పాటను అప్పట్లో ప్రేక్షకులు బాగానే ఆదరించారు. ఎన్టీఆర్ నటించిన వేటగాడు సినిమాలో వేటూరి సాహిత్యం, చక్రవర్తి సంగీత సారథ్యంలో వచ్చిన ‘ఇది పువ్వులు పూయని తోట’ పాట హారర్ నేపథ్యంలో చిత్రీకరించిన తీరు ముఖ్యంగా రాఘవేంద్రరావు దర్శకత్వ ప్రతిభ స్పష్టంగా కనిపిస్తుంది. వేటగాడు సినిమాలో సన్నివేశాల మధ్యలో వచ్చే ఈ హారర్ సాంగ్ అప్పట్లో ఆ సినిమా విజయానికి కారణమైందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ముఖ్యంగా ఈ పాట వస్తున్నప్పుడు ఆ పాడుబడిన బంగ్లాను చీకట్లో వివిధ కోణాల్లో చూపించడమూ, పుష్పలత వీణ పట్టుకుని ఉండే ఫొటో.. ఇంకా రకరకాల యాంగిల్స్‌లో షూట్ చేసిన విధానం ప్రేక్షకులకు బాగా నచ్చింది.
1989లో వచ్చిన గీతాంజలి సినిమాలో సైతం తెలివిగా హారర్ సాంగ్ పెట్టారు మణిరత్నం. చిత్రీకరణలో వేటూరి సాహిత్యంలో ఇళయరాజ స్వరకల్పనలో అద్భుతంగా వచ్చిన పాటే ‘నందీ కొండ వాగుల్లో నల్లతుమ్మా నీడల్లో నీడల్లే ఉన్నా’. ఈ పాట మణిరత్నం దర్శకత్వ ప్రతిభ, నాగార్జున అభినయం అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. గీతాంజలి సినిమా ఎంతగా హిట్టయిందో ఈ పాటా అంతగా ప్రజాదరణ పొందింది. ఈమధ్య లేటెస్ట్‌గా వచ్చిన ‘చంద్రముఖి’ చిత్రంలో దెయ్యం పాడే ‘రారాయ్ నా నుడి తీరా’ హారర్ సాంగ్ తెలుగు ప్రేక్షకులను ఎంతగా ఉర్రూతలూగించిందో చెప్పడం అంటే చేపకు ఈత నేర్పడమే అవుతుంది. పైన ఉదహరించిన సినిమాల్లో కథాకథనాలేకాక సినిమా మధ్యలో వచ్చే దెయ్యం పాటలే ఈ సినిమాల విజయానికి ముఖ్య కారణమని చెప్పొచ్చు. పైన ప్రస్తావించిన చిత్రాల్లో అన్ని సినిమాలూ సూపర్ హిట్ సినిమాలే. అంటే ఒక సినిమాలో ఒక ఫార్ములా హిట్టయిందంటే అదే ధోరణిలో వెళ్ళడం మన కలవాటే కాబట్టి -అంతస్తులు చిత్రం నుంచీ ఆ ట్రెండ్ కొనసాగిస్తున్నారు. గత 50, 60 ఏళ్ళుగా తెలుగు హారర్ సినిమాల్లో కనిపించే దృశ్యాలివే. ఒక పాడుబడిన బంగ్లా లేదా ఎక్కడో అడవిలో ఒక శిధిల భవనం. అందులో దెయ్యాలో, విలన్లో చేరి భయపెట్టే పాటలు, శబ్దాలతో జనాల్ని భయభ్రాంతులకు గురిచెయ్యడం.. హీరో మధ్యలో ఆ బంగ్లాలో ప్రవేశించి అసలక్కడ నిజంగా దెయ్యాలున్నాయా లేక మనుష్యులే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారా అని కనిపెట్టడం.. క్లైమాక్స్‌లో పని పట్టడం. ఈ ఫార్ములాకు ఆడియన్స్ బాగా అలవాటుపడ్డారని చెప్పడానికి -వచ్చే హారర్ సినిమాల్లో కనిపిస్తున్న దృశ్యాలు, వినిపిస్తున్న పాటలే ఉదాహరణ. సో, హారర్ సినిమా విజయంలో దెయ్యం పాటను అంత ఈజీగా తీసెయ్యలేం. ఏమంటారు?

-బంటు గిరివాసు