Others

జంట హాస్య గాయకులు (శరత్కాలం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమా రంగంలో జంట నిర్మాతలు, జంట కవులు, జంట సంగీత దర్శకులు మరికొన్ని జంటలతోపాటు జంట గాయకులూ ఉన్నారు. వారే మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు. ఇద్దరి గురించీ అందరికీ తెలుసు, కొత్తగా చెప్పేదేముంది? అనిపిస్తోంది కదూ.
సరే, పిఠాపురం నాగేశ్వరరావు ఇంటి పేరు పిఠాపురం కాదని చాలామందికి తెలీదు. ఆయన స్వస్థలం పిఠాపురం కనుక అదే వాడుకలోకి వచ్చేసింది. ఆయన ఇంటిపేరు పాతర్లగడ్డ. ఎటొచ్చీ ‘పి’తోనే మొదలైందని శ్రోతలు సీరియస్‌గా తీసుకోలేదనుకుందాం. మంగళసూత్రం చిత్రం ద్వారా నేపథ్య గాయకునిగా పరిచయమైన నాగేశ్వరరావు, తర్వాత మాయాలోకం, పరదేశి, మంత్రదండం చిత్రాల్లో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలకు గాత్రం అందించారు. తర్వాత సాలూరి రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో విడుదలైన గ్రామఫోన్ రికార్డుల పాటలు ‘ప్రభూ మరల పలకవేలా, నాడు పలికిన మాటలనే మరచినావటే చెలియా’ సినిమా పాటలకు మించి ప్రజాదరణ పొందటంతో నేపథ్య గాయకుడిగా బిజీ అయి హాస్య పాటలపై మరింత శ్రద్ధ చూపారు. ఘంటసాల సంగీత దర్శకత్వంలో వచ్చిన మాయాబజార్ చిత్రంలో రేలంగి పాత్రకు ‘సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెతికిన లేదుకదా’ పాటను ముందు నాగేశ్వరరావుతోనే పాడించి రికార్డు చేశారు. తర్వాత జరిగిన మార్పులలో ఆ పాటను ఘంటసాల పాడగా రికార్డుచేసి అదే సినిమాలో వాడుకున్నారు. పిఠాపురం రెండో ఇన్నింగ్స్ మాధవపెద్ది సత్యంతో కలసి పలు హాస్య గీతాలు పాడి పామర జనాన్ని ఆనందపరిచారు. పిఠాపురంతోపాటు మాధవపెద్ది సత్యం కూడా రంగస్థల నటుడు. సినిమాల్లో ఎంత బిజీగావున్నా నాటకాల్లో నటిస్తూ కచేరీలు చేసేవారు. పిఠాపురానికి ఆంధ్ర రఫీ అనే బిరుదూ ఉంది. వీరిద్దరు నాటక ప్రదర్శనకు హాజరైతే డబుల్ బోనస్‌లాగా హాస్య గీతాల కచేరీ కూడా అదనపు ఆకర్షణగా లభించేది. పిఠాపురం చలన చిత్రాల్లో నటించకపోయినా మాధవపెద్ది సత్యం కొన్ని చిత్రాల్లో నటించారు. షావుకారు చిత్రంలో పిచ్చన్నతాత పాత్రలో నటిస్తూ పాడిన తత్వాలు ఆ పాత్రకు, గానానికి మంచి పేరు తెచ్చాయి. మరొకటి మాయాబజార్ చిత్రంలో రథచోదకుడిగా నటిస్తూ పాడిన ‘్భళి భళి భళి దేవా బాగున్నదయా నీ మాయ’. ఈ రెండు పాత్రలూ విజయా సంస్థ నిర్మించిన చిత్రాలు కావటం విశేషం. సత్యం, పిఠాపురం కలిసి పాడిన ‘అయ్యయ్యో జేబులు డబ్బులుపోయెనే’ (కులగోత్రాలు) మరికొన్ని హాస్య గీతాలతో ప్రేక్షకులను అలరిస్తూ వారిద్దరూ అవేకళ్లు సినిమాకు పాడిన ‘మావూళ్ళో ఒక పడచుంది దయ్యమంటే భయమన్నది’ గొప్ప హిట్టయ్యింది. ప్రతీ కచేరీలో ఈ పాటను కోరి కోరి పాడించుకునేవారు. నిజానికి చిత్రంలో ఈ పాట పాడింది ఘంటసాల, పిఠాపురం. సాలూరి రాజేశ్వరరావు స్వరకల్పన రికార్డింగ్‌లో స్వర్ణలతతో కలసి గానం చేస్తున్న ఈ జంటే ఆ హాస్య గాత్ర జంట పిఠాపురం, మాధవపెద్ది.

-పర్చా శరత్‌కుమార్ 9849601717