ఈ వారం తార

త్వరలో....

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో నిర్మాతలు చెప్పే కామన్ డైలాగ్ ఇది. ఇప్పుడు శృతి కూడా అదే చెబుతోంది. ఎందుకంటే -బాలీవుడ్‌లో నిర్మాణ సంస్థను ప్రారంభించబోతోందట. నటనలో టాప్ హీరోయిన్ అనిపించుకున్న శృతి -నిర్మాణంలోనూ టాప్ అనిపించుకోవాలని ఆశ పడుతోంది. ఎంతైనా కమల్ తనయ కనుక -సృజనాత్మకంగా ఆలోచించడం శృతికి అలవాటే. అందుకే -కొద్దిమందే సాహసం చేసి సక్సెస్ అయిన బాలీవుడ్ హీరోయిన్లలాగే తానూ నిర్మాణ సంస్థను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటోందని అంటున్నారు. ‘అవును. సినిమాల్లో నటించాను. ఇప్పుడు నటిస్తూనే నిర్మించాలనుకుంటున్నా. నా ఆలోచనకు అనుగుణంగా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. మరిన్ని వివరాలు త్వరలో’ అంటోంది శృతి. ప్రస్తుతం తెలుగులో ‘కాటమరాయుడు’, తమిళంలో ‘సింగం-3’, తండ్రితో శెభాష్ రాయుడు ప్రాజెక్టులతో బిజీగా ఉంటూనే తన ప్రయత్నాలకు టైం కేటాయిస్తోందట శృతిహాసన్.