Others

స్వీటీ క్యూటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ ముహూర్తాన స్క్రీన్‌మీదకు అడుగు పెట్టిందోగాని -కీర్తి ట్రాక్ మిగితా హీరోయిన్లకు సెపరేట్‌గా సాగుతోంది. క్యూట్‌గాళ్‌గా తెలుగులో మంచి మార్కులు కొట్టేసిన కీర్తి -తమిళంలో మాత్రం యమ స్వీడ్‌గా ప్రాజెక్టులు అందుకుంటోంది. తమిళంలో స్టార్ హీరోలతో జోడీ కట్టే అవకాశాలు వెతుక్కుంటూ వస్తుండటంతో -తెలుగులో అవకాశాలు వస్తున్నా ఆలోచించి అడుగులేస్తోందట. ‘నేను శైలజ’లో రామ్‌తో కెమిస్ట్రీని బాగానే వర్కవుట్ చేసిన కీర్తి -తొలి సినిమాతోనే శెభాష్ అనిపించుకుంది. ఇప్పుడు వరుస హిట్లతో ఊపుమీదున్న నానితో ‘నేను లోకల్’లో జోడీకట్టింది. తెలుగులో సాఫీగా వెళ్తున్న ఆమె కెరీర్ -తమిళంలో మాత్రం జెట్ స్పీడ్‌తో వెళ్తోందట. బబ్లీగాళ్‌ని తమిళులు అమితంగా ఇష్టపడుతుండటంతో -నిర్మాతలు ఆమె డేట్లు కోసం ఎగబడుతున్నారు. ధనుష్, శివకార్తికేయన్‌తో జోడీ కట్టి మంచి మార్కులు వేయించుకున్న కీర్తి -ప్రస్తుతం స్టార్ హీరో విజయ్‌తో ఓ ప్రాజెక్టు చేస్తోంది. ఇది పూర్తికాకుండానే -తాజాగా సూర్య సరసన చాన్స్ కొట్టేసిందని అంటున్నారు. సూర్యతో దర్శకుడు విఘ్నేష్ శివ తెరకెక్కిస్తున్న ‘తానా సెరిందా కూట్టమ్’ చిత్రానికి కీర్తిని ఎంపిక చేసుకున్నట్టు ఇండస్ట్రీ టాక్. మొదట నయనతారను తీసుకోవాలని అనుకున్నా ఆమె డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో -ఆ అవకాశం కీర్తికి దక్కిందట. క్యూట్ అండ్ క్లాసిక్ స్టయిల్‌తో మెప్పించే కీర్తి ఇమేజీ -ఇక ‘తారా’పథానికి చేరిపోయినట్టేనని అంటున్నారు.