Others

అనసూయే కావాలట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బాహుబలి’లో కట్టప్పగా ఆకట్టుకున్న సత్యరాజ్ కొడుకు శిబిరాజ్ అనసూయ వెంటపడుతున్నాడు. హీరోగా తరువాతి ప్రాజెక్టులో పట్టుబట్టి మరీ అనుసూయను ఖరారు చేసుకున్నట్టు సమాచారం. సినిమాలు చేస్తున్నా కెరీర్‌పరంగా ఒక్క కమర్షియల్ హిట్టూ కొట్టలేకపోయిన శిబిరాజ్, ఈసారి హిట్టు చాన్స్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడని వినికిడి. అందులో భాగంగానే తెలుగు హాట్ యాంకర్ అనుసూయను అడుగుతున్నాడని ఇండస్ట్రీ టాక్. హిట్టుకొట్టాలనుకుంటే అనసూయను కోరడమేంటని అనుకుంటున్నారు కదూ. దానికో కారణం ఉంది. గత ఏడాది చిన్న సినిమాగా విడుదలై పెద్ద సినిమాలను భయపెట్టే స్థాయిలో బాక్సాఫీస్‌ను గలగలలాడించిన అడవి శేష్ ‘క్షణం’ గుర్తుందిగా. ఆ చిత్రాన్ని ఇప్పుడు తమిళంలో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో అడవి శేష్ పోషించిన పాత్రను -తమిళంలో శిబిరాజ్ చేస్తున్నాడు. ‘క్షణం’లో నెగిటివ్ రోల్‌తో ప్రాజెక్టుకు అనుకోని బలాన్నించింది అనసూయ. అందుకే -హిట్టుకోసం చూస్తున్న శిబిరాజ్, చాయిస్ తీసుకోకుండా ఆ పాత్ర అనసూయ చేతే చేయించాలని పట్టుబట్టాడట. నెగెటివ్ రోల్‌తో ప్రాజెక్టుకు టాప్ గేర్ వేసిన అనసూయ చేతే చేయిస్తే తన సినిమాకూ బలం చేకూరుతుందని ఆశపడుతున్నాడట శిబిరాజ్. అందుకే అనసూయను అప్రోచ్ అవుతున్నట్టు చెబుతున్నారు.