Others

అడిగినంత ఇస్తేనే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరైన సినిమా ఒక్కటి పడగానే -రెమ్యునరేషన్ రెండింతలు చేయటం టాలీవుడ్ హీరోయన్లకు కొత్తేం కాదు. డిమాండ్ ఉన్నపుడే డబ్బు చేసుకోవాలన్న ఆలోచనను ఆధునిక హీరోయన్లు వంటబట్టించుకునే ఇండస్ట్రీకి వస్తున్నారు. ఫలానా సినిమాకు ఫలానా హీరోయన్ సూటవుతుందని దర్శకుడు బలంగా ఫిక్సయ్యాడంటే -అది నిర్మాత చావుకొచ్చినట్టే. ఎందుకంటే -ఫలానా అమ్మాయే కావాలనుకుంటే అడిగినంత ఇచ్చుకోక తప్పదు. తప్పదనుకున్న నిర్మాతలు ఒప్పుకుంటున్నారు. తట్టుకోలేమనుకుంటే -తప్పుకుంటున్నారు. ఇదీ టాలీవుడ్‌లో హీరోయిన్ల బెట్టు. హన్సికను కావాలనుకున్న నిర్మాతలు కోటి ఇచ్చుకోడానికి సిద్ధపడితే, రష్మికి అంత సీన్ లేదనుకున్న నిర్మాతలు సీక్వెల్ నుంచి పక్కన పెట్టినట్టు ఇండస్ట్రీలో వినిపిస్తోన్న తాజా టాక్. తెలుగులో చాన్స్‌లు లేకున్నా బబ్లీగాళ్ హన్సిక డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. మంచు విష్ణు హీరోగా రాజ్‌కిరణ్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో హన్సిక హీరోయిన్‌గా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ప్రాజెక్టు చేయడానికి హన్సిక కోటి డిమాండ్ చేసిందంటున్నారు. ఆ పాత్ర ఆమె చేత చేయిస్తేనే బావుంటుందన్న ఉద్దేశంతో కోటి ఇచ్చుకోడానికి నిర్మాతలు సిద్ధపడ్డారన్న టాక్ వినిపిస్తోంది. ఇక చిన్న సినిమాగా హిట్ మార్క్ వేసుకున్న -గుంటూరు టాకీస్ సీక్వెల్‌కూ రంగం సిద్ధమైంది. ‘గుంటూరు టాకీస్’లో పల్లెటూరి సువర్ణగా తన టాలెంట్ ఏంటో అందంగా చూపించి కుర్రకారుకు గట్టి గాలం వేసింది హాట్ యాంకర్ రష్మి. సో.. సీక్వెల్‌లోనూ ఆమెనే తీసుకోవాలని యూనిట్ అనుకుందట. చివరకు సీక్వెల్‌లో మాత్రం ఆమెకు ఛాన్స్ దక్కలేదు. కారణం -ఆమె డిమాండ్ చేసిన రెమ్యునరేషన్ ఇచ్చుకోలేక అంటున్నారు. రష్మి కోరినంత ఇవ్వలేక సీక్వెల్ కోసం సన్నీ లియోన్‌ని తీసుకుంటున్నారనే ప్రచారం జరిగింది. కానీ సన్నీ చేస్తున్నది సువర్ణ పాత్ర కాదని, మరో పాత్రలో ఆమెను చూపించనున్నట్టు ప్రాజెక్టు టీం చెబుతోంది. రష్మి అడిగినంత ఇచ్చేబుదులు, నికిషా పటేల్‌తో సీక్వెల్ చేస్తే బెటరన్న నిర్ణయానికి టీం వచ్చినట్టు తెలుస్తోంది. సో.. ‘గుంటూరు టాకీస్-2’లో పల్లెటూరి అందాల భామ సువర్ణగా నికిషా పటేల్ కనిపించబోతోందన్న మాట.