Others

డైరెక్షన్ ఛాన్స్ ఇస్తేనే.. ( అప్పటి సంగతి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గృహప్రవేశం హీరో పాత్ర ఎవరు పోషిస్తే బాగుంటుందా? అనే విషయంపై చర్చలు జరిగాయి. కొన్ని పేర్లు అనుకున్నప్పటికీ ముంబయిలో తన ప్రతిభను ప్రదర్శిస్తున్న తెలుగుతేజం ఎల్వీప్రసాద్ చేత ఆ పాత్ర వేయిస్తే బాగుంటుందని అంతా అభిప్రాయపడ్డారు. అప్పటికే ఆయన తెలుగులో తెనాలి రామకృష్ణ, చదువుకున్న భార్య, ఘరానాదొంగ చిత్రాల్లో నటిస్తూ దర్శకత్వ శాఖలోనూ పనిచేశారు. హెచ్‌ఎం రెడ్డి ద్వారా ఆయనను సంప్రదించారు. నటుడిగాకంటే దర్శకుడుగానే పేరు తెచ్చుకోవాలనే కోరికతో ప్రసాద్ ఉన్నారు. అందుకే ప్రకాశరావు వచ్చి అడగగానే ఆ సినిమాకి దర్శకత్వం ఛాన్స్ ఇస్తే హీరోగా నటిస్తానని మెలిక పెట్టారు ఎల్వీ ప్రసాద్. దాంతో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఈ సినిమా ప్రారంభం కావడానికి మూల కారకుడు త్రిపురనేని గోపీచంద్. కథ ఆయనదే. దర్శకత్వ బాధ్యతలు కూడా ఆయనకే అప్పగించారు. దర్శకుడిగా కూడా అవకాశం ఇస్తేనే ఇందులో హీరోగా నటిస్తానని ప్రసాద్ కండిషన్ పెడుతున్నారు. ఏం చేయాలో తోచక మిత్రులను సలహా అడిగారు ప్రకాశ్‌రావు. ముంబయిలో పలువురు దర్శకుల దగ్గర పనిచేసిన ప్రసాద్, మోడ్రన్ టెక్నిక్ తెలిసినవాడు కనుక ఆయననే దర్శకుడిగా నియమించడం మంచిదని సలహా ఇచ్చారు అందరూ. దాంతో గోపీచంద్‌ను ఒప్పించి ప్రసాద్‌కు అవకాశం ఇచ్చారు. అలా గృహప్రవేశం చిత్రంతో దర్శకుడయ్యారు ఎల్వీప్రసాద్. పెంకిపెళ్లి పేరును గృహప్రవేశంగా మార్చి చెన్నయ్‌లోని న్యూటోన్ స్టూడియోలో షూటింగ్ చేశారు. తెలుగులో 12 చిత్రాలకు ఎల్వీప్రసాద్ దర్శకత్వం వహించారు. ఇందులో 9 చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. మిగతా మూడు చిత్రాలు షావుకారు- ఈ చిత్రం అపజయం పొందిన చిత్రం. విజయవాడలో మాత్రం 100 రోజులు ఆడింది. పెంపుడుకొడుకు, పరదేశి చిత్రాలు కూడా అంతంత మాత్రంగానే ఆడాయి.

-కె.శ్రీనివాసరావు