ఈ వారం తార

ఔరా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రూపొందిస్తన్న ‘వంగవీటి’ చిత్రంలోని రత్నకుమారి పాత్ర పోషిస్తున్న నైనా గంగూలీ ఇటీవల చేసిన హాట్ ఫొటో షూట్ ఆమెకు గొప్ప క్రేజ్ తెచ్చింది. కెరీర్‌ను చక్కదిద్దుకోడానికి ఇటీవలి కాలంలో హీరోయిన్లు -తమ గట్స్ ఏమిటో పొటో షూట్స్‌తో చూపుతున్నారు. అవకాశాలు లేక ప్రాజెక్టుల కోసం ఎదురు చూస్తున్న హీరోయిన్లు ఒకతరహా ఫొటో షూట్ చేస్తుంటే -కెరీర్ జెట్ స్పీడ్‌తో నడుస్తున్న హీరోయిన్లు సైతం సంచలనాల కోసం చిత్రమైన ఫొటో షూట్ స్టిల్స్ వదులుతున్నారు. గతంలో పత్రికల్లో అచ్చయితేనే అవి బయటకు వచ్చేవి. ఇప్పుడు ఎలాంటి హద్దుల్లేని అందాల చిత్రాలను సైతం సామాజిక మాధ్యమాల ద్వారా బయటకు వదులుతుంటే -ఔరా! అనుకోవాల్సి వస్తుంది. ఉన్న వ(వి)లువలైనా ఉంచుతారో లేదో?
-కె ప్రసన్నకుమార్, ఆదోని
గడుగ్గాయి..
ఇంటర్వ్యూలలో సమంత చెప్పే విషయాలు చమత్కారానికి నిదర్శనంగా, నిజాయితీకి ప్రతిబింబంగా నిలుస్తున్నాయ. ఈమధ్య ఆమె అభిమానులతో జరిపిన చిట్‌చాట్‌లో ‘ఏ మూడూ లేకపోతే జీవితం శూన్యం అనిపిస్తుంది’ అని ఓ అభిమాని అడిగినపుడు ‘చైతు, ఐస్‌క్రీం, మనీ’ అని చెప్పింది. ‘చైతు ఎందుకు, నన్ను ప్రేమించొచ్చు కదా?’ అని అడిగాడు మరో అభిమాని. మరొక నటి అయితే బహుశ కోపంతో తిట్టిపోసి ఉండేదేమో. సమంత మాత్రం నవ్వేస్తూ ‘ఎనిమిదేళ్ల క్రితం చైతు కనిపించాడు. నువ్వు కనిపించలేదు’ అని చమత్కరించింది. అమ్మో గడుగ్గాయి అనిపిస్తోంది కదూ.
-్ధర్మతేజ, గొడారిగుంట
భలే కాపీ సీన్లు!
కార్తీ నటించిన కాష్మోరా సినిమా చూసిన తరువాత -బాహుబలి, అరుంధతిల కలయిక అనిపించింది. కథతో పెద్దగా సంబంధం లేకపోయినా ఈ రెండు సినిమాల ఇన్‌స్పిరేషన్‌తోనే దర్శకుడు సన్నివేశాల విజువల్స్ అల్లుకున్నాడనిపించింది. -కథనాన్ని కాస్త బిగింపుతో తీసుకెళ్లి కాసేపు కూర్చోవచ్చులే అనిపించేలా తీర్చిదిద్దారంతే. తెరవెనుక టీం కష్టమే కాదు, తెరపై కనిపించే నటవర్గం కూడా ఏమేర కష్టపడిందన్న అంశం మాత్రం ‘విజువల్ గ్రాండియర్’ను చూస్తున్నపుడు తెలుస్తుంది. ఫస్ట్ఫా అంతా కార్తీ, వివేక్ కామెడీ కాలక్షేపంతో లాగేసినా -సెకెండాఫ్‌లో అసలు కథ మొదలైన దగ్గర్నుంచీ సినిమాపై ఆసక్తి పెరిగింది. దెయ్యాలు, ఆత్మలు లేవని ఒకవైపు, ఉన్నాయని మరోవైపు.. అలవాటైపోయిన రొటీన్ ఫార్ములానే ఆశ్రయించటం వల్ల అనుకున్నంత ఆసక్తి కలగలేదు.
-పివిఎస్‌పి రావు, అద్దంకి
అంత అవసరమా?
అతి సర్వత్రే వర్జయేత్ -అన్న పెద్దల మాట ప్రస్తుత సినిమా పరిశ్రమకు సరిగ్గా సరిపోతుంది. సినిమా మొదలు పెట్టడం దగ్గర్నుంచే ఆహా, ఓహో అంటూ బాజాభజంత్రీలు మొదలవుతున్నాయి. ఆడియో ఫంక్షన్ దగ్గర్నుంచీ సినిమా థియేటర్‌కు వచ్చేవరకూ ప్రపంచంలోనే ఇంత గొప్ప సినిమా లేదంటూ రోటీన్ స్టేట్‌మెంట్లతో ఊదరగొడుతున్నారు. ఇంతవరకూ ఏ సినిమాలోనూ చూపించని డిఫరెంట్ పాయింట్‌ను డిస్కస్ చేస్తున్నాం అంటాడు మరో దర్శకుడు. అసలు హీరో ఒక రకం, హీరోయిన్ ఇంకో రకం.. అంటూ కబుర్లు చెబుతాడు మరో నిర్మాత. తీరా సినిమా థియేటర్‌కు వచ్చిన తరువాత పట్టుమని నాలుగు షోలు కూడా పడకుండానే టపా కట్టేస్తోంది. ఎందుకింత అతి. నిజంగా తీసేవి గొప్ప సినిమా అయినపుడు -తాటాకు చప్పుళ్లు మోగించటం ఎందుకు? సరుకుంటే, తన సత్తా ఏమిటో సినిమాయే చెబుతుందిగా. ప్రేక్షకులను ఎంతకాలం మోసం చేయగలుగుతారు? తెలుగు సినిమావాళ్ల ధోరణి ఇక మారదా?
-జి అనుపమ, రావులపాలెం
భజనమేళం!
సినిమా భజన నిజంగానే శృతి మించుతోంది. తమాషా ఏంటంటే -తమ స్తోత్రాలను ప్రేక్షకులు నిజంగానే నమ్మేస్తున్నారని భజనరాయుళ్లు భజల్లోంచి బయటకు రావడం లేదు. ఫ్లాపు సినిమాను కూడా హిట్టు సినిమాగా చెబుతూ, బాక్సాఫీస్‌ను కొల్లగొట్టడం గ్యారంటీ’ అంటూ థియేటర్ల వద్ద కొందరు చేస్తున్న హడావుడి చూస్తుంటే.. వీళ్లంతా నిర్మాతల కిరాయి మనుషులే అనుకోవాల్సి వస్తుంది. అతి తెలివిగాళ్లు మరో అడుగు ముందుకేసి -పోటీ చిత్రంపై నెగెటివ్ వౌత్ టాక్ తెచ్చే ప్రయత్నాలు చేస్తుండటం మరీ విడ్డూరం. బాలీవుడ్‌లో గత 28న విడుదలైన రెండు చిత్రాల్లో ఒక చిత్రం ఇలాంటి నెగెటివ్ టాక్‌తోనే ఢాం అందని అంటున్నారు. ఇలాంటి ట్రిక్కులకు అన్నిసార్లూ ప్రేక్షకులు పడిపోతారనుకోవడం భ్రమ. కథ, కథనాలు బలంగావుండి సినిమా చూడదగ్గది అనిపిస్తే -ప్రేక్షకులను ఇలాంటి నెగెటివ్ ప్రచారాలు ఆపలేవు.
-శాండోప్రచండ్, శ్రీనగర్
ఎక్కడివాడక్కడే!
అన్నీవున్నా ఏదో తక్కువన్నట్టుంది -హీరో సుమంత్ పరిస్థితి. కెరీర్‌పరంగా హిట్ పర్సెంట్ తక్కువనుకుంటే -వస్తున్న సినిమాలు కూడా ఒక్కటీ తనను పైకి లేపేలా ఉండటం లేదు. ఆ మధ్య చేసిన ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ సినిమా చూసినపుడు, ఈ కథ సుమంత్ ఎందుకు ఎంచుకున్నాడన్న సందేహాలు కలిగాయ. ఇప్పుడు నరుడా -డోనరుడా సినిమా చూసిన తరువాత, డౌట్ లేదు అతను సినిమాలు ఎంపిక చేసుకోవడంలోనే విఫలమవుతున్నాడని అర్థమైంది. అక్కడెక్కడో హిట్టయన సినిమాను తెచ్చకుని చేసేస్తే -మనకూ హిట్టు దక్కేస్తుందన్న ఆలోచన ఎంతమాత్రం సరైంది కాదని సుమంత్‌కు ఇప్పటికైనా అర్థమైందో లేదో. ఒక సినిమా చేయాలనుకున్నపుడు ఆ కథ మనకు సూటవుతుందా? కథలోని తాను చేయబోయే పాత్రకు న్యాయం చేయగలనా? అన్న విశే్లషణలు వదిలేసి ముందుకు దిగితే ఫలితాలు ఇలానే ఉంటాయ. అప్‌కమింగ్ హీరోలు సైతం కథను ఎంచుకోడానికి ఎన్నో కోణాల్లో ఆలోచిస్తుంటే, నటుడిగా ప్రూవ్ చేసుకున్న సుమంత్ తనకు సూట్‌కాని కథలతో వస్తున్నాడేంటి అనిపిస్తుంది. పూర్.. సుమంత్!
-పిల్లా కౌశిక్, విజయవాడ