రివ్యూ

ఆపరేషన్ సక్సెస్, బట్..! (బాగోలేదు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కిల్లింగ్ వీరప్పన్

తారాగణం:
శివరాజ్‌కుమార్, సందీప్ భరద్వాజ్, పరుల్ యాదవ్, యజ్ఞశెట్టి తదితరులు.
సంగీతం: రవిశంకర్
నిర్మాతలు:
బివి మంజునాథ్,
ఇ శివప్రకాష్, బిఎస్ సుధీంద్ర
రచన, దర్శకత్వం:
రామ్‌గోపాల్‌వర్మ

స్టేట్‌మెంటైనా, సినిమాతోనైనా -సంచలనం సృష్టించడం రామ్‌గోపాల్‌వర్మకు తెలిసిన విద్య. అలాంటి వర్మ కొంతకాలంగా సంచలన సినిమాల్లేక డీలాపడ్డాడు. వర్మ తాజా ప్రయత్నం -కిల్లింగ్ వీరప్పన్. టైటిల్‌లోనే కంటెంట్ కూర్చి -ఇరవై ఏళ్ళపాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను ముప్పుతిప్పలెట్టి హత్యలు, కిడ్నాప్‌లు, స్మగ్లింగ్ నేరాలతో విరాజిల్లిన వీరప్పన్ గుట్టు ఎలాపట్టారు, ఎలా మట్టుబెట్టారన్న కథాంశమిది.
పోలీస్ ఆఫీసర్ విజయ్‌కుమార్ బృందం వీరప్పన్‌ను కోసం వేటసాగిస్తున్న టైంలో అతని సబార్డినేట్ ఎస్పీ (శివరాజ్‌కుమార్) ఓ పాచిక చెప్తాడు. ఆఫీసర్లంతా వీరప్పన్ (సందీప్ భరద్వాజ్) ప్రాంతమైన ఫారెస్ట్‌కెళ్లి చనిపోతున్నారు. అది అతని స్థానబలం. కలుగునుంచి అతన్ని బయటకు తీసుకురాగలిగితే మట్టుబెట్టడం పెద్ద కష్టం కాదన్నది పాచిక సారాంశం. పాచిక పారేందుకు ఎస్పీ ఎవరెవర్ని వాడుకున్నాడు? ఫైనల్‌గా వీరప్పన్‌ను అడవినుంచి ఎలా బయటకి తీసుకొచ్చాడు, ఎలా చంపాడన్నదే కథ. వీరప్పన్ ఎన్‌కౌంటర్ మిషన్‌ని మాత్రమే ప్రధానంగా ఎంచుకున్నారు.
వీరప్పన్ హంటింగ్‌లో చివరి ప్రయత్నంగా ఆపరేషన్ కొకూన్ సాగుతుంది. మొదలెట్టిన పోరాటానికి స్పెషల్ టాస్క్ఫోర్స్ హెడ్ విజయ్‌కుమార్ ముగింపు ఎలా ఇచ్చాడన్నది సినిమాగా సాగుతుంది. ఎస్పీ పాత్రను కన్నడ హీరో శివకుమార్ పోషించాడు. వీరప్పన్‌కి సంబంధించి అతని చివరి రోజుల్లోని కొన్ని అంశాలను మాత్రమే చిత్రంలో ప్రస్తావించారు. అతని నేర ప్రపంచానికి సంబంధించిన కొన్ని సంఘటనలను చూపించారు. సినిమాలో ఎక్కువభాగం ఎస్టీఎఫ్‌కి సంబంధించిన వ్యూహాలు, వీరప్పన్‌ని పట్టుకోవడానికి వేసే పథకాలు, వాటినుంచి వీరప్పన్ తప్పించుకోవడం, పట్టువదలని ఎస్టీఎఫ్ మళ్లీమళ్లీ ప్రయత్నించి ఎలా మట్టుబెట్టిందన్న సన్నివేశాలు ఆసక్తిగా సాగుతాయి. ఒకప్పుడు కన్నడ సూపర్‌స్టార్ రాజ్‌కుమార్‌ను వీరప్పన్ కిడ్నాప్ చేయడం తెలిసిందే. ఇప్పుడదే వీరప్పన్ సినిమాలో రాజ్‌కుమార్ తనయుడు శివరాజ్‌కుమార్ ప్రధాన పాత్ర పోషించడం సినిమా ప్రమోషన్‌కు పనికొచ్చే చిన్న అంశం. ఎస్టీఎఫ్ ఆఫీసర్‌గా శివరాజ్‌కుమార్ అద్భుతమైన నటన ప్రదర్శించాడు. కొన్ని సన్నివేశాల్లో అతని పెర్‌ఫార్మెన్స్ ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది. వీరప్పన్‌ని పట్టుకోవాలన్న కసిని అతన్ని కళ్ళల్లో పెర్‌ఫెక్ట్‌గా చూపించగలిగాడు. ఇక వీరప్పన్‌గా నటించిన సందీప్ భరద్వాజ్ హావభావాలు, బాడీలాంగ్వేజ్ గమనిస్తే వీరప్పన్‌నే మళ్ళీ చూస్తున్నామా? అన్న ఫీలింగ్ కలుగుతుంది. వీరప్పన్ క్రూరత్వాన్ని, కళ్ళముందు కట్టినట్టు భరద్వాజ్ అద్భుతంగా చూపించగలిగాడు. మిగతా పాత్రల్లో పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా నటించిన పరుల్ యాదవ్, వీరప్పన్ భార్య ముత్తులక్ష్మిగా యజ్ఞశెట్టి ఫర్వాలేదనిపించింది. టెక్నికల్‌గా మొదట చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ రామీ గురించి. వర్మ మనసు తెలుసుకుని దృశ్యాలను చిత్రీకరించాడు. కొన్ని సందర్భాల్లో ఆడియన్స్‌ని థ్రిల్ చేసినా, కెమెరా మూమెంట్స్ తలనొప్పి తెప్పించాయి. ఆడియన్స్ కళ్లకు ఒత్తిడి పెంచేవిలా అనిపించాయి. మ్యూజిక్ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకున్నారు. ఆర్‌ఆర్‌తోనే కొన్ని సన్నివేశాలు ఎలివేట్ అయ్యాయి. దర్శకుడిగా, కథకుడిగా వర్మ ప్రతిభను ఎంచాల్సిన పని లేదు. కాకపోతే ‘కిల్లింగ్ వీరప్పన్’లో పాత్రలను డిజైన్ చేసినంత గొప్పగా మిగతా అంశాలను రక్తికట్టించలేకపోయాడు. ఆపరేషన్ కొకూన్ తప్ప వీరప్పన్ అసలు కథను టచ్ చేయకపోవడంతో -ఆడియన్స్ ఆశించింది దొరకలేదు.
కథకి పర్ఫెక్ట్ అనిపించే నటీనటులను ఎంపిక చేశారు. వాళ్లూ పెర్ఫార్మన్స్ అదరగొట్టారు. కానీ వీరప్పన్‌ను కిల్లింగ్ యాంగిల్ నుంచి నడిపించటంతో ఆకట్టుకునే అంశాలు కరవయ్యాయి. వీరప్పన్ ఎపిసోడ్స్‌తో ఫస్ట్ఫాలో ఓకే అనుకునేలోగా -సెకండాఫ్‌లో ఆపరేషన్ కొకూన్ అతిగా విసిగిస్తుంది. ఆశించిన కంటెంట్‌కు అందనంత దూరంగా కథ సాగడంతో -ఆడియన్స్‌కి ‘వర్మ’ను గుర్తు చేసుకుంటూ సినిమా చూడాల్సిన పరిస్థితి వచ్చింది.

- ద్వివేది