Others

ఎవ్వరినీ వదలదట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన లైఫ్‌ని సర్వనాశనం చేసిన దుర్మార్గులు ఎవ్వరినీ వదిలిపెట్టనని హెచ్చరిస్తుంది -రోజ్ బ్యూటీ రెజీనా కాసాండ్రా. తన చావుకి కారణమైన దుర్మార్గుల మీద పడ తీర్చుకోడానికి సన్నద్ధమవుతోందట. ఇంతకూ ఆమె చేసేది యాక్షన్ సినిమా అనుకుంటున్నారా? కాదు, హారర్ సినిమా. పెద్ద హీరోయిన్లు సైతం దెయ్యాలు, ఆత్మల వెంట తిరుగుతంటే తనేం తక్కువ తిన్నానా అనుకుందో ఏమో -ఓ హారర్ సినిమాకు కాల్షీట్లు ఇచ్చిందని అంటున్నారు. తమిళంలో ఎస్‌జె సూర్య హీరోగా దర్శకుడు సెల్వ రాఘవన్ నిర్మిస్తోన్న హారర్ సినిమాలో పనిమనిషి పాత్రలో రెజీనా కనిపించబోతోంది. ఆమె జీవితంతో ఆడుకుని ప్రాణం తీసిన దుర్మార్గులపై ఆత్మలా వచ్చి పగ తీర్చుకునే పాత్ర చేస్తోందట. క్యూట్ అందగత్తె దెయ్యం అవతారం ఎత్తితే ఎంత భయంకరంగా ఉంటుందో చూడాలంటే కొద్దిరోజులు ఆగాలి మరి.