మెయిన్ ఫీచర్

పూర్తిగా ఎంజాయ్ చేశాం.. బాహుబలి హీరో ప్రభాస్‌తో వెనె్నల ఇంటర్వ్యూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాహుబలి.. తెలుగు సినిమా ఖ్యాతిని చాటిన సినిమా. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఇమేజ్ తెచ్చుకున్నాడు హీరో ప్రభాస్. అప్పటివరకూ టాలీవుడ్ హీరోగావున్న ప్రభాస్, ఇప్పుడు యూనివర్సల్ హీరోగా మారిపోయాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన బాహుబలి మొదటి భాగం సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ‘కన్‌క్లూజన్’ పార్ట్ -బాహుబలి-2 వస్తోంది. ఏప్రిల్ 28న చిత్రం విడుదలవుతున్న సందర్భంలో హీరో ప్రభాస్‌తో ఇంటర్వ్యూ.

* ఒకే సినిమాకు నాలుగేళ్లు పని చేశారు. ఇప్పుడు రిలాక్సయ్యారా?
అంతకాలం ఒకే సినిమాకు పని చేశాను కదా.. బాహుబలి మూడ్ నుంచి బైటికి వచ్చినట్ట్టు లేదు. బహుశ సినిమా రిలీజయ్యాక రిలాక్సవుతానేమో.

* ఈ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది?
అంత ఈజీ మాత్రం కాదు. ఫస్ట్‌పార్ట్ విడుదల తరువాత రిలీఫ్‌గా కూర్చున్న టైంలో.. ఒకరోజు వినాయక్ అడిగారు. శివగామి ఎందుకు చనిపోయింది? కట్టప్ప ఎందుకు పొడిచాడు? అసలేమైంది? లాంటివి పది ప్రశ్నలున్నా సినిమా హిట్టయ్యిందంటే మామూలు విషయం కాదు. అన్ని ప్రశ్నలతో సినిమా బ్లాక్‌బస్టర్ చేశారు? ఎలా? అన్న ఆయన ప్రశ్నలకు షాకయ్యా. అసలు ఆ సినిమాలో అన్ని ప్రశ్నలున్నట్టు అప్పటిదాకా నాకనిపించలేదు. ఎందుకంటే, పూర్తి స్టోరీ విన్నవాడిని కదా. కథ, హీరో, హీరోయిన్.. ఇలా ఇందులోని ప్రతి పాత్రా కీలకమైనదే. ఆ పరిస్థితుల్లోనే రెండు భాగాలు చేద్దామని డిసైడ్ అయ్యారు. మొదటి భాగం ఎక్కడ ఆపాలన్న అంశంపై రాజవౌళి పెద్ద కసరత్తే చేశారు. కట్టప్ప నెత్తిమీద కాలు పెట్టుకున్న క్యారెక్టర్ ఎడిసోడే బ్యాంగ్ అనుకున్నాం. కానీ ఇంత పెద్దగా ఉంటుందనుకోలేదు. వార్‌ని సడెన్‌గా ఆపడమే ఆడియన్స్‌ని నచ్చినట్టుంది.

* రెండు పాత్రల్లో ఏది కష్టమనిపించింది?
- శివుడి పాత్ర ఈజీ. సీన్లు బావుంటాయి. అరవచ్చు, కోప్పడొచ్చు. అడవుల్లో పెరిగిన వ్యక్తికాబట్టి ఎలాగైనా ఉండొచ్చు. కానీ బాహుబలి డిజైన్డ్ క్యారెక్టర్. కింగ్ అవుతాడా? లేదో? వంటివన్నీ అతని పాత్రలో ప్రధానం. అందుకే ఆ డిజైన్డ్ పాత్ర కష్టమనిపించింది. బాహుబలికి రెస్పాన్సిబులిటీ వుంది?

* ప్రపంచవ్యాప క్రేజ్.. మీ ఫీలింగ్?
రాజవౌళి ఐదేళ్ళముందు లైన్ చెప్పారు. అదీ రెబెల్ సినిమా డబ్బింగ్ టైంలో. దానికి ముందూ ఐదారు కథలు చెప్పారు. అందులో కృష్ణదేవరాయల కథ కూడా ఉంది. అన్నింట్లోకి ఇదే నచ్చింది. లైన్ ఇంపాక్ట్ నుంచి బయటపడటానికి ఐదారు రోజులుపట్టింది. అవన్నీ ఇప్పుడు సకెండాఫ్‌లో ఉంటాయి. కథ తొందరగా పూర్తయినా, ప్రీప్రొడక్షన్స్ టైమ్ పట్టేసింది. ఫస్ట్‌పార్ట్‌లో ప్రతి షాట్ నాకు ఎక్స్‌పీరియనే్స. ప్రతిదీ ఊహించే చేయాలి. అలా షూట్ జరుగుతుండగానే మొదటి భాగం రిలీజైంది. ఇంత డబ్బు ఖర్చుపెట్టి అన్‌ఫినిష్డ్ సినిమాను ఎప్పుడూ మనం రిలీజ్ చేయలేదు. ఇన్ని ప్రశ్నలతో మన సినిమా ఎప్పుడూ విడుదల కాలేదు. అలాంటి అన్ని యాంగిల్స్‌లోనూ బాహుబలి తొలి సినిమా అయ్యింది. ఆ టైంలో నిర్మాతలు కూడా చాలా రిస్కే తీసుకున్నారు.
* అంతా మధ్యలో సినిమాలు చేసినా మీరు, రాజవౌళే సినిమాలు చేయలేదు, ఎందుకని?
నేను, రాజవౌళి వేరే సినిమాలు చేసివుంటే ‘కన్‌క్లూజన్’కు ఎనిమిదేళ్లు పట్టేది. అలా చేయలేదు కాబట్టే, ఇప్పటికి పూర్తయింది. నేను కూడా వేరే సినిమాలు చేసి ఉండొచ్చు. కానీ నాకు నచ్చలేదు. పూర్తిగా దీనిమీదే ఉండాలనుకున్నా. వార్ సీన్స్‌ని 80 రోజులు ప్లాన్ చేశాం. రిఫరెన్స్ సరిపోక, సీన్లోకి దిగాక ప్లాన్ చేసేవాళ్లం. చేసుకుంటూ వెళ్ళాం. దాంతో 80 అనుకున్నది 120కి చేరింది. సో.. ఇదొక ఎక్స్‌పెరిమెంట్, ఎక్స్‌పీరియన్స్, అంతే! మధ్యలో మరో సినిమా చేయాలనుకోవడం ఊహకు కూడా కష్టమే.

* ప్రభాస్ లేకుండా బాహుబలి లేదన్నాడు రాజౌమళి? మీరేంమంటారు?
ఆయన చాలా అన్నారు (నవ్వేస్తూ). రాజవౌళి ఛత్రపతి నుంచీ నాకు క్లోజ్. పనె్నండేళ్లుగా ఆయనతో ట్రావెల్ చేస్తున్నా. అందుకే ఈ సినిమా ఇంత బాగా కుదిరింది. ఆయన పిచ్చి ఫాషన్‌తో ఏదో చేస్తున్నారు. వర్కవుటైతే ఏదోక వండర్ అవుతుందని ఆశతో చేశా. జరిగింది.

* ఐదేళ్ళు.. అదే మనుషులతో,
అదే సెట్స్‌లో.. ఏమనిపించింది?
రాజవౌళి కుటుంబంతో ముందునుంచీ మంచి రిలేషన్ ఉంది. మామమూలుగా ఎవరికైనా బోర్ కొడితే ఎగ్జైట్ కలిగించే అంశాలను వెతుక్కుంటారు. ఆటలాడతారు. ఏదైనా ప్రదేశాలకు వెళ్తారు. మాకు ఆ అవసరం లేకపోయింది. ఎందుకంటే -బాహుబలి సెట్‌లోనే ప్రతిరోజూ ఏదోక ఎగ్జయిట్‌మెంట్ ఉండేది. ఒక రోజు వార్. ఇంకోరోజు గుర్రాలతో ఆటలు. అలా సాగిపోతున్న టైంలోనే సడెన్‌గా పిలిచి రాజవౌళి వాటర్‌ఫాల్స్ సీన్ చూపించారు. అద్భుతం అనిపించింది. ఇలాంటి సినిమాలో మనం ఉన్నామన్న ఫీలింగ్‌తోనే కొన్ని నెలలు గడిపేశాను. ఇక బోరేముంటుంది?

* సెట్స్‌నుంచి బయటకు వస్తున్నపుడు ఏమనిపించింది?
ఫస్ట్ పార్ట్ అయినపుడు కాస్త ఎమోషన్‌ల్ అయ్యా. ఇలాంటి గొప్ప సినిమా ఆడుతుందా? ఆడితే ఇంకో పార్ట్ ఉంటుంది.. లేకపోతే..? అనుకుంటూనే భయటపడ్డాను. కానీ ఇప్పుడు నేనింకా సినిమా నుంచి బయటకు రాలేదు. ఏదోకటైంలో రాజవౌళి పిలిచి క్లోజప్ తీసుకోవాలని అడుగుతారేమోనన్న ఫీలింగే వెంటాడుతుంది. నా దృష్టిలో సినిమా ఇంకా పూర్తయినట్టు కాదు. ఏదోక అద్భుతం జరిగుతుందనే ప్రతి ఒక్కరూ ఫీలవుతున్నాం. ఆర్టిస్టులకు కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఆర్ట్ డైరెక్టర్లు, వెనకాల పనిచేసేవాళ్లు అహర్నిశలూ అప్రమత్తంగా ఉండేవారు. రాజవౌళి పిచ్చోడు కాబట్టి, అలాంటి

పిచ్చోళ్ళను సెలెక్ట్ చేసుకొన్నారా? అనేది తెలియదు. ప్రతివాడూ పిచ్చిగా పనిచేశాడు.

* మళ్లీ రాజవౌళితో ఎప్పుడు?
- రాజవౌళి బాహుబలి తరువాత ఆరు నెలలపాటు విశ్రాంతి తీసుకుంటారనే అనుకుంటున్నా. నెక్స్ట్ సినిమా గురించి ఇప్పట్లో ఆలోచిస్తారని నేననుకోను.

* పెరిగిన ఎక్స్‌పెక్టేషన్స్ తరువాతి సినిమాపై ప్రభావం చూపుతుందా?
- ఆడియెన్స్ బాగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే, ఛత్రపతి సినిమా తరువాత డార్లింగ్ చేశాను. ప్రేక్షకులు ఆదరించారు. అలాగే మిస్టర్ ఫర్‌ఫెక్ట్ చేశాను. దాన్నీ ఆదరించారు. సినిమా రిలీజ్‌కు ముందుగానే ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఇతనేదో కొత్తగా ట్రై చేశాడని అనుకుంటారు.

* బాహుబలి వంటి భారీ సినిమాల్లో చేయాల్సి వస్తే..?
తరువాతి సినిమా కూడా అదే రేంజ్‌లో చేయాలంటే.. నేనెందుకు చేయాలి? అది లక్ష కోట్ల సినిమా అయినా సరే.. పేరొచ్చినా, రాకున్నా సరే.. నాకు కొంత టైమ్ కావాలి. అన్నీ అనుకున్నట్టే కుదిరితే నాలుగేళ్ళ తరువాత ఆలోచిస్తాను.

* రాజకీయాలంటే ఇష్టమా?
- నేను రాజకీయాల్లోకి రావడమేమిటండి? చూస్తున్నారుగా, నాదొక డిఫరెంట్ మైండ్ సెట్.

* రానా పాత్ర ఎలా ఉంటుంది?
- బాహుబలి పార్ట్-1లో రానా పాత్ర ఇంట్రొడక్షన్ మాత్రమే చూశారు. సెకెండ్ పార్ట్‌లో తన పాత్ర ఇంకా భయంకరంగా, శక్తివంతంగా ఉంటుంది. రాజవౌళి ప్రతి పాత్రను పీక్స్‌లో చూపించారు. రానా ఒకపక్క హీరోగా చేస్తున్నా, విలన్‌గా చేయడమంటే చిన్న విషయం కాదు. ఆ ధైర్యానికి మెచ్చుకోవాలి.

* కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపారనే విషయాన్ని ఎవరికన్నా చెప్పారా?
- నేను బాహుబలి సినిమా షూటింగ్ టైమ్‌లో పెద్దగా ఎవరినీ కలవలేదు. అయితే నేను కలిసిన కొంతమంది ఆ విషయాన్ని అడిగారు. అసలు విషయమేమంటే, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనేది 30 సన్నివేశాలతో లింక్ అయి వుండే ఎలిమెంట్. దాన్ని ఓ సీన్ ఆధారంగా చేసుకొని చెప్పమంటే కుదరదు. అది సినిమాలో చూడాల్సిందే. ఒకవేళ చెప్పినా ఎంజాయ్ చేయలేరు. ఎంతవిన్నా సినిమాలో ఆ సీన్‌ని చూడాలనే ఆసక్తి చాలామందికి ఉంటుంది.

* అనుష్క, తమన్నా కష్టపడ్డట్టున్నారు?
- అవును. ఇద్దరూ కష్టపడ్డారు. అనుష్క ముసలి గెటప్ వేసుకుని పని చేయాలంటే ధైర్యం, నమ్మకం ఉండాలి. తను మధ్యలో సైజ్ జీరోలో కూడా యాక్ట్ చేసింది. బాహుబలి-2లో తను అందంగా కనపడుతుంది.

* హాలీవుడ్ సినిమాలో చేస్తున్నారని వినిపిస్తోంది?
- ఈ సినిమా సక్సెస్‌తోపాటు మంచి విషయాలు, రూమర్స్ ఎడాపెడా వాయించేస్తున్నాయి. హాలీవుడ్‌లో నేను చేస్తాననడం రూమర్. బాలీవుడ్‌లో కరణ్‌జోహార్ సినిమా చేస్తానన్నదీ రూమరే.

* రాజవౌళి మహాభారతం చేస్తే మీ క్యారెక్టర్?
- రాజవౌళికి మహాభారతం చేయాలని ఉంది. కానీ బాహుబలి తరువాత మహాభారతం చేయమంటే కష్టం. ఆయన మహాభారతంలో ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయడానికి నేను రెడీ.

* రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా ఎప్పుడు?
- సుజిత్ సినిమాతోపాటు చేయాలనే ఆలోచన వుంది. బాహుబలి-2 తరువాత దానికి సంబంధించి కూడా ఆలోచిస్తాను.

-శ్రీ