రివ్యూ

ఘాటు మసాలా.. ( పాకశాల) * బాగోలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారాగణం:
విశ్వ, శ్రీనివాస్, జగదీష్‌రెడ్డి, కీర్తి, అర్పిత, వైజాగ్‌ప్రసాద్ తదితరులు.
ఐశ్వర్య సినీ స్టూడియోస్
సంగీతం: శ్రవణ్ ఎస్ మిక్కి
నిర్మాతలు:
రాజ్‌కిరణ్, ఆర్‌పి రావు
దర్శకత్వం:
ఫణికృష్ణ సిరికి

స్నేహం అనిర్వచనీయ అనుబంధం. స్నేహాన్ని అడ్డంపెట్టుకుని భార్యాభర్తల బంధంతో ఒకటవుదామనుకుంటే -ఒక మనిషి ఇష్టం ఉండొచ్చు. మరొకరికి ఇష్టం ఉండకపోవచ్చు. స్నేహధర్మంతో ఎదుటి వ్యక్తి అభిప్రాయాన్ని గౌరవించాలే తప్ప, ఆవేశంతో మద్యానికి బానిసై రాక్షసంగా ప్రవర్తించి జీవితాలను నాశనం చేసుకునే స్నేహితులకు హెచ్చరికగా పాకశాల నిలుస్తుంది. ఆడ మగా స్నేహం ఆ సన్నటి తెర మధ్యలో ఉన్నంతకాలమే గొప్పగా ఉంటుంది. అడ్డులేనప్పుడు మనిషి ఎంత నీచానికి దిగజారుతాడనే అంశంతో పాకశాల నిర్మించారు.
కథేంటి?
పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి ఓ కేసు కొరకరాని కొయ్యలా నిలుస్తుంది. పదవీ విరమణ చేసే పోలీస్ అధికారి ఆ కేసును ఓ యువ అధికారికి అప్పగిస్తాడు. ఆ కేసు విషయంలోకెళ్తే -దేవిక అనే అమ్మాయి ముగ్గురు కుర్రాళ్లను కూరవండి తిన్నదట. అందులో ఒక కుర్రాడు ఆమె ప్రియుడు కూడా. ఎంత పరిశోధన చేసినా విషయం అర్థంకాక తలపట్టుకుంటుంది పోలీస్ డిపార్ట్‌మెంట్. చివరికి కోర్టు అనుమతి పొంది యువ పోలీస్ అధికారి విక్రమ్ ఆమెను ఇంటరాగేట్ చేయటానికి వెళ్తాడు. అక్కడ ఆమె ఎంతోమంది తనను ఈ విషయంపై ప్రశ్నించారు, ఎవరికైనా ఇదే సమాధానం చెప్పానంటూ తనకేం తెలియదంటుంది. చివరికి సంఘటన జరిగిన గెస్ట్‌హౌస్‌కి దేవికను తీసుకెళ్లి పరిశోధిస్తాడు విక్రమ్. అక్కడకెళ్లాక దేవిక నిజాలు చెబుతుంది. కార్తిక్, విష్ణు, సుబ్బులతోపాటుగా సునీష అనే స్నేహితురాలు కలిసిమెలిసి చదువుకుంటూ పెరుగుతారు. కార్తీక్ సునీషను ఇష్టపడినా బయటపడడు. విష్ణు కూడా సునీషను ఇష్టపడి ఆమెకు ఐలవ్‌యూ చెబుతాడు. మనం స్నేహితులుగానే ఉండాలికానీ ఇలా భార్యాభర్తలుగా మారిపోతే కొత్త తలనొప్పులు వస్తాయి కనుక అలాంటివేవీ తాను ఒప్పుకోనని సునీష కరాఖండిగా చెబుతుంది. పాకశాస్త్ర ప్రవీణురాలైన సునీష తన ప్రతిభతో విదేశాలకు వెళ్లడానికి సిద్ధవౌతుంది. ఎటూ వెళ్లిపోతుంది కనుక చివరికి ఓ పార్టీ చేసుకుందామని గెస్ట్‌హౌస్‌కి సునీషను ఆహ్వానిస్తారు మిత్రబృందం. అక్కడ తాగిన మత్తులో వారేం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో సునీష జీవితాన్ని నాశనం చేసి, చంపేస్తారు. ఆ విషయం తెలియకుండా చికెన్ కొట్టినట్టుగా ఆమెను కొట్టేసి కేసు మాఫీ చేసేస్తారు. కానీ నిజం నిద్రపోదు. సునీష ముగ్గురిపై తన పగను ఎలా తీర్చుకుంది అనేదే మిగతా కథనం. ఇదంతా దేవిక పోలీస్ అధికారి విక్రమ్‌కు చెప్పే నేపథ్యంలో జరుగుతుంది. ముగ్గురు స్నేహితుల కథలు పూర్తియ్యాక పోలీస్ అధికారి విక్రమ్ కథ కూడా తెరపైకి వస్తుంది. అదేంటి అన్నది సినిమాలో చూడాల్సిందే.
ఎలా వుంది?
సస్పెన్స్, హారర్ సినిమాలు వస్తున్న నేపథ్యంలో కొంచెం థ్రిల్లింగ్‌గా చిత్రాన్ని రూపొందించే ప్రయత్నం చేశారు. మనిషిని చంపి వండి పెట్టడమనేది కొత్త కానె్సప్టే! ఇది ఎవరికీ ఆమోదయోగ్యంకాదు. కానీ దయ్యం నేపథ్యంలో చిత్రం కనుక తప్పదు అనుకోవాలి. ముగ్గురు స్నేహితులకు బుద్ధిచెప్పే సన్నివేశాల్లో కొంచెం ఘాటుగానే చిత్రీకరణ చేశారు. విక్రమ్, దేవిక పిచ్చిదని తెలిసినా జీపులోవెళ్తూ ఆమెపై డ్యూయెట్ వేసుకోవడంలో అర్థం లేదు. మంచి మంచి తినుబండారాలను చూపించి, భయం పుట్టేలా చేయడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ఇలాంటి సన్నివేశాలలోను కామెడీ కూడా జొప్పించే ప్రయత్నం బాగుంది. సన్నివేశాలు గతంలో చూసినవి కాకపోవడంతో నవ్వొస్తుంది. ముఖ్యంగా డైలాగులతో అక్కడక్కడ నవ్వించారు. మాంసాన్ని తీసుకోవడానికి కష్టపడుతున్నాం కానీ అది తింటుంటే దాని రుచి చెప్పలేం అనీ, వీణ్ణి ఎక్కువగా తాగొద్దన్నాను అయినా నా మాట వినలేదు. చూడు లివర్ తింటానికి పనికిరాకుండాపోయింది, నేను కష్టపడి ఈ వంట చేస్తే ఊసేస్తావా? ఇలాంటివి ఎవరైనా నీకు వండి పెడతారా? అంటూ చెంపదెబ్బకొట్టి అడగటం ఆలోచింప చేస్తుంది. విక్రమ్ మళ్లీ పులుసు చేసిందిరా అని ఎడవటంలో కూడా అర్థం వుంది. మొత్తానికి వంట గది నేపథ్యంలో హారర్, థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ చిత్రం భయపెట్టకపోయినా నవ్వించింది. ఎక్కువసేపు పడుకుంటే కలలే వస్తాయి. రిలేషన్‌షిప్స్ ఛేంజ్ అయితే అలవాట్లు మారతాయి, చీకటి పడితే మనుషుల మధ్య బంధాలు మారిపోతున్నాయి, ఉల్లిపాయలు వేగగానే వంట అయినట్లుకాదు అంటూ చెప్పిన మాటలు బావున్నాయి. నటుల్లో కీర్తి ఆ పాత్రకు బాగా సరిపోయింది. నటన కూడా ఓకే. మిగతా వాళ్లందరూ సోసో. ఓ వంటల కార్యక్రమాన్ని వెండితెరపై థ్రిల్లింగ్‌గా చూపించడంలో దర్శకుడు ఓకే అనిపించాడు.