మెయిన్ ఫీచర్

వీరే లేకపోతే...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వనాథ్ సినిమాలు ఎంతగా తెలుగు ప్రేక్షకులను అలరించాయో.. ఆయన పరిచయం చేసిన ఇద్దరు అనంతర కాలంలో సినిమాను కొత్త పుంతలు తొక్కించిన నిరుపమాన రచయితలయ్యారు. ఓ సీత కథతో వేటూరిని, సిరివెనె్నలతో సీతారామ శాస్ర్తీని పరిచయం చేసిన ఘనత విశ్వనాథ్‌దే. వేటూరి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇక సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నారంటే ఆ సినిమాలో సీతారామశాస్ర్తీ రాసిన పాటలు ఎంతటి కమనీయమైనవో చెప్పక చెప్పేదే. ప్రతిభను గుర్తించడంతో పాటు అది రాణించేందుకూ బలమైన అవకాశాలు ఇవ్వడం అన్నది విశ్వనాథ్ విజయబాట. ఆయన సినిమాలు ఎంతగా తెలుగునేల ఖళాఖండాలుగా నిలిచాయో ఆయన పరిచయం చేసిన వీరిద్దరూ లేకపోతే.. తెలుగు సినిమాకు ఇంత ఖ్యాతి, వైవిధ్యం, సంగీత, సాహిత్య ప్రధానమైన గుర్తింపూ లభించి ఉండేదా అన్నది అనుమానమే..శంకరాభరణంతో వేటూరి కలం సారస్వత ప్రవాహమే అయింది. సిరివెనె్నలదీ అదే ప్రవాహం. సంగీత, సాహిత్యాల సమాహారం.