Others

నటన స్కీమ్ నాది కాదు! -కాశీవిశ్వనాథ్ (డైరెక్టర్స్ ఛాయిస్..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు కావాలనుకున్నాడు.
నటుడిగా యు టర్న్ తీసుకున్నాడు. తరుణ్‌తో ‘నువ్వులేక నేను లేను’,
కళ్యాణ్‌రామ్ తొలి చిత్రంగా
‘తొలిచూపులోనే...’కు దర్శకత్వం వహించి, తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రూవ్ చేసుకున్న కాశీ విశ్వనాథ్‌తో
చిట్‌చాట్.

ఎక్కడినుంచి వచ్చారు?
తూర్పుగోదావరి జిల్లా పోలవరం దగ్గరలోని పురుషోత్తమపట్టణం మా వూరు. ఆరు నుండి ఇంటర్ వరకూ ఊళ్లోనే చదువు. డిగ్రీ రాజమండ్రిలో!
దర్శకుడవ్వాలన్న కోరిక?
1980లో ‘తొలి కోడి కూసింది’ చిత్రాన్ని బాలచందర్ మా ఊళ్ల్లో తీసారు. అప్పుడు పడింది బీజం. అమ్మానాన్నలు, మేనమామల ప్రోత్సాహంతో మద్రాస్‌లో విజయనిర్మల దగ్గర చేరాను. తరువాత తాతినేని రామారావు, యన్‌బి చక్రవర్తి, శరత్, జయంత్ సి.పరాంజీలాంటి వారివద్ద పనిచేసాను.
నటుడిగా..?
దేవుని దయ. నటుడవ్వాలని ప్రయత్నించలేదు. నచ్చావులే చిత్రంలో రవిబాబు అవకాశమిచ్చారు. కట్‌చేస్తే.. వందో చిత్రానికి దగ్గర్లో ఉన్నా!
పరిశ్రమలో సమస్యలు
సమస్యల్లేని పరిశ్రమ ఉండదు. వాటిని కొందరు అధిగమిస్తారు. చిన్న సినిమాలతో లాభం లేదని థియేటర్లు అంటున్నాయ. కొన్ని థియేటర్లయనా చిన్న సినిమాలకు ఇచ్చేలా ప్రభుత్వం నిబంధన పెట్టాలి. మల్టీఫ్లెక్స్‌లతో లాభాలున్నాయ కనుక అవీ పెంచాలి.
ఈ సంక్రాంతి ఎక్కడ?
నేను నటించిన ‘డిక్టేటర్’ విడుదలవుతోంది. మా ఊళ్లో చూస్తా. అక్కడ కుటుంబం, బంధువులతో ఆనందంగా గడపాలనుకుంటున్నా!
మళ్లీ దర్శకత్వం?
తప్పకుండా చేస్తా. అది నా కష్టం. నటన నా అదృష్టం. మంచి అనువైన ప్రాజెక్టులు వస్తే దర్శకత్వం చేస్తా!
దర్శకుడంటే?
ప్రేక్షకుడికి ఏది నచ్చుతుందో తెలుసుకోగల సత్తా ఉన్నవాడు. ట్రెండ్‌ను గమనిస్తూ ప్రేక్షకుల నాడి పట్టగలవాడు.

-శేఖర్