మీ వ్యూస్

చిక్కిన పులి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో రవితేజలో ఇదివరకటి తేజస్సు పోయింది. బక్కపల్చగా వున్నా బాహుబలుల లాంటి విలన్ గ్యాంగులను ఒంటి చేత్తో చితక్కొట్టడం మిక్కిలి అసహజం అనిపించింది. ఇటువంటివి మన తెలుగు సినిమాలో కొత్తేమీ కాదు. రాజకీయ నాయకుడిమీద రాయి విసరకుండా చెప్పు విసిరి ఉన్నట్టయితే సహజంగా ఉండేది. గతంలో రాజకీయ నాయకులమీద చెప్పులు, బూట్లు విసిరిన సందర్భాలున్నాయి. సెలబ్రిటీ శాస్ర్తీ అరుపుల డైలాగులు అలరించలేదు. ఎవరండి బాబు రవితేజకు పాటలు పాడింది? అందులో శ్రావ్యత ఏమైనా ఉందా? మామూలుగానే సంగీతం చెవులను బద్దలు చేసింది. ఈమధ్య టైగర్లు, లయన్లు సహజత్వాన్ని కోల్పోతున్నాయి.
-ఎన్.ఆర్.లక్ష్మి, సికింద్రాబాద్

వేస్ట్ గది
దెయ్యం సినిమా అంటూ ఊదరగొట్టి చివరలో దెయ్యం లేదు, ఏమీ లేదు.. ఇదంతా విలన్‌తో నిజం చెప్పించడానికే అంటూ హీరో, అతని మిత్ర బృందం కలిసి ఆడిన నాటకం ఈ చిత్రం. తామే కావాలని దెయ్యం పాత్రను సృష్టించామని చెప్పి ‘రాజుగారి గది’లో చిత్రంలో నిరాశపరిచారు. సినిమాలో రెండు మూడు కామెడీ సీన్లు తప్ప, భయపెట్టే సన్నివేశం ఒక్కటీ లేదు. చానళ్లల్లో హిట్ అని ప్రచారం చేసినా వెనె్నల మాత్రం ఒకే స్టార్ ఇచ్చింది. రాజుగారి గది నిజంగా వేస్ట్ గదే.
-రామానందం, భీమవరం

కలిసి వచ్చింది
రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులకు గత సంవత్సరం చక్కటి చిత్రాలు దొరికాయి. బాగానే కలిసి వచ్చింది. ఈ సంవత్సరం విడుదలైన అన్ని రకాల చిన్న పెద్ద భారీ విభిన్న కథా కథనాలు కలిగిన చిత్రాలను ప్రేక్షకులు ఆదరించి పట్టం కట్టారు. అక్కడక్కడా అపజయం పాలైన చిత్రాలు ఈ సంవత్సరంలో వున్నా పరిశ్రమ సంతృప్తికరమైన ముగింపునే పలికింది. ఈ సంవత్సరం కూడా మంచి విజయాలతో ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాం.
-పెయ్యల శ్రీనివాస్, అలికాం

స్వరాభిషేకం
చానల్స్‌లో వచ్చే అన్ని కార్యక్రమాలు అందరికీ నచ్చవు. ఏవేవో లోపాలు కన్పిస్తాయి. స్వరాభిషేకంపై ఆక్షేపణలు సహజమే. మిగిలిన చానల్స్‌లోని సంగీత కార్యక్రమాలకన్నా స్వరాభిషేకం, పాడుతా తీయగా ఫర్వాలేదు. కొందరికి శ్రీశ్రీ గొప్ప అయితే, మరికొందరికి ఇతరులు గొప్ప. గొప్పతనాల నిష్పత్తిలో పాటలు ఎంపిక చేయడం కుదరదు. ఎంపికచేసిన పాటలన్నీ వేదికమీద పాడలేరు. హక్కుదారులు, కాపీరైట్ చట్టాలు అడ్డుకోవచ్చు. స్వరాభిషేకంలో ఎవరు పాడే పాటలను వారుగాని, యాంకర్లుగాని విశే్లషిస్తే బాగుంటుంది. రాసింది చదవడానికే యాంకర్లు పరిమితం! ఏం చేస్తాం మరి?
-సాహిత్య దీప్తి, రమణయ్యపేట

వారికి తెలియవు
అన్నీ తమకే తెలుసునన్న ధీమాతో నవయువకులు దర్శకులుగా తయారవ్వడంవల్ల సినిమాలు పేలిపోతున్నాయన్న వ్యాసం, అలాంటివారికి కనువిప్పు కావాలి. ఇందులో వారి తప్పేం లేదు. ఎందుకంటే, వారికి గ్రామ వాతావరణంగాని, ఉమ్మడి కుటుంబాల అనుబంధాలు కానీ తెలియవు. ఇపుడన్నీ తల్లీదండ్రి ఒకరిద్దరి పిల్లలున్న చిన్న కుటుంబాలే. చదువులకోసం పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా నగరాల్లో వుంటున్నారు. అందువల్ల వారికి నేటివిటీ తెలియదు. ప్రేమాభినాలు, అనుబంధాలు, జీవితంలో వచ్చే సమస్యలు వాటి పరిష్కారాలూ తెలియవు. నదురుగా కన్పించే అమ్మాయి వెంట పడటమే ప్రేమ అనుకుంటాడు. అందుకే వాళ్లు తీసే సినిమాలు పేలిపోతున్నాయి.
-డి.ప్రభాస్, గాంధీనగరం

ఆస్కార్ సినిమా
సువర్ణసుందరి భారతదేశ చిత్ర జగత్తులో ఓ అద్భుత సంగీత సాహిత్యభరిత చిత్రం. ఆదినారాయణరావు స్వరాల రూపకల్పనలో విశ్వరూపం కనబరిచారు. దేశంలోని పెద్ద పెద్ద సంగీత దర్శకులందరూ వేనోళ్ల శ్లాఘించారంటే ఆదినారాయణరావు ఎంత కీర్తినార్జించారో కదా! ఈ చిత్రాన్ని హిందీ భాషలో కూడా నిర్మించారు.
అందులో ఓ పాటకు మహ్మద్ రఫికి నేషనల్ అవార్డు వచ్చింది. అటువంటి అవార్డు మన ఘంటశాలకు రావాలి. ఈ సినిమా ఆస్కార్ అవార్డుకు అన్ని విధాలా అర్హత వున్నదే. కనీసం అందుకు ఎంపిక కాకపోవడం తెలుగువారి దురదృష్టం.
-ఎన్.రామలక్ష్మి, సికింద్రాబాద్

స్పెషలేమీ కాదు
ఇటీవల మీడియా సినీ హీరో పవన్‌కళ్యాణ్‌ను ఆకాశానికెత్తేయడం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే పవన్‌కు ఏ మాత్రం తగ్గని విధంగా మహేష్, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లకు అభిమానులున్నారు.
మా హీరో కోసం ప్రాణత్యాగానికి కూడా వెనుకాడము అంటూ ప్రతి హీరో అభిమాని బిల్డప్‌లు ఇస్తుంటాడు. కాని బయట వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకుని, హీరోలను ఏ విధంగా అభిమానించాలో, ఆ విధంగా అభిమానిస్తే బాగుంటుంది. వీళ్ళంతా కేవలం సినిమా హీరోలు మాత్రమే అని అభిమానులు గమనించాలి.
-బానాల కృష్ణమాచారి, హైదరాబాద్

బర్‌ఖా
వెనె్నలలో మంచి మనసుకు మంచి రోజులు చిత్రంగురించి రాశారు. దీని మాతృక ‘తై ఇరందాల్ వళి పిరక్కుం’ అని రాయాలి. అలాగే హిందీలో ఈ చిత్రాన్ని బర్‌ఖా పేరుతో రూపొందించారు.
చార్‌ఖా కాదు. అలాగే ఇలా అయితే ఎలా శీర్షికన మహ్మద్ హుమాయిన్ 2015లో దారుణంగా పరాజయం పొందిన బ్రూస్‌లీ, షేర్ చిత్రాల గురించి రాశారేగానీ, అఖిల్ చిత్రం గురించి రాయలేదు. పైగా ఈ చిత్రం వారం రోజుల్లో 35 కోట్లు వసూలు చేసిందని, రెండో వారంలో వాల్‌పోస్టర్‌లో ప్రకటించారు. ఇలా ప్రజలను మభ్యపెడితే ఎలా? 15 రోజుల్లోనే ఈ చిత్రాన్ని ఎత్తేశారు కదా.
-ఎస్.శ్రీనివాసరావు, ఎమ్మిగనూరు