రివ్యూ

మల్టీ.. మాస్ మిలియనీర్! ** డిక్టేటర్ ( ఫర్వాలేదు )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారాగణం:
బాలకృష్ణ, అంజలి, సోనాల్ చౌహాన్, రతి అగ్నిహోత్రి, సుమన్, పృథ్వీ, హేమ, షకలక శంకర్ తదితరులు
సంగీతం: తమన్
కథ, కథనం:
కోన వెంకట్, గోపీ మోహన్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
శ్రీవాస్
** డిక్టేటర్
సంక్రాంతి వస్తోందంటే- పల్లె వాతావరణం తాలూకు కళకళలతోపాటు.. సినీ సందడి మొదలవుతుంది. ఇది ఏళ్లనాటి చరిత్ర. పండుగకి వచ్చే కొత్త అల్లుళ్ళతోపాటు సినీ ‘కథలు’ బరిలోకి దిగి తెగ కొట్టేసుకుంటాయి. అభిమానులకి అదో టెన్షన్- సంక్రాంతి సంబరాల్ని సైతం పక్కనబెట్టి థియేటర్ల ముందు బారులు తీరుతారు. అభిమాన హీరోల సినిమా చూట్టానికీ.. మరో అభిమానుల భరతం పట్టటానికీ ‘బరి’లో ఉంటారు. చాన్నాళ్లుగా సంక్రాంతికి సరైన సినిమాలు పడలేదని ఇబ్బంది ఫీలవుతున్న సగటు ప్రేక్షకుడికి ఈసారి తికమకపెట్టే సినిమాలు రిలీజయ్యాయి. బాలకృష్ణ 99వ సినిమా అంటే మరీనూ. కానీ.. బోలెడంత ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దని ముందుగానే ‘శ్రీవాస్’ హెచ్చరించి.. ఇది కేవలం అభిమానుల కోసం మాత్రమేనని బాహాటంగా ప్రకటించటంతో అభిమానులు మరో ఆలోచన పెట్టుకోలేదు.
ఐతే- మరీ ఇంత రొటీన్‌గానూ సినిమా తీయ్యొచ్చునని శ్రీవాస్ నిరూపించాడు. ‘లౌక్యం’ తర్వాత బాలకృష్ణతో సినిమా అవడం.. ప్రముఖ కథా రచయితలంతా కలిసి ‘సమిష్టి’గా కథని తయారుచేయడం.. ఇలా కావల్సినన్ని కారణాల రీత్యా పక్కా ‘మాస్’ సినిమా తయారైంది.
బాలకృష్ణ జాబితాలో ఇప్పటికే ఇలాంటి కథలు వచ్చేశాయి. కాబట్టి- కేవలం ఫైట్స్.. రొమాన్స్.. ఊరమాస్ ‘డైలాగ్స్’తో సినిమాని చుట్టేశారు.
అనగనగా -ఒక అబ్బాయి -చాలా సాఫ్ట్‌గా ఉంటూ.. ఎక్కడో సుదూరంగా ఎవరికీ దొరకని ప్రాంతంలో పని చేసుకొంటూ జీవితాన్ని వెళ్లబుచ్చుతుంటాడు. మధ్యలో ఓ అమ్మాయి వచ్చేసి.. ఆ అబ్బాయి మంచితనాన్నీ.. సాఫ్ట్ కార్నర్ చూసి తెగ మెచ్చేసుకొని ప్రేమించేస్తుంది. ఇంతలో వాళ్ల నాన్నో.. మరొకడో వచ్చి.. ఠట్. కుదర్దు అని కథని అడ్డం తిప్పేస్తే.. ఆ ‘సాఫ్ట్’ అబ్బాయి కాస్తా వీరోచిత ఉగ్ర నరసింహావతారం ఎత్తి.. అడ్డొచ్చిన ప్రతి ఒక్కరినీ వీరబాదుడు ప్లస్ నరుకుడు కలిపి ఉతికి ఆరేసి.. ఆఖరికి -అతడెవరో తెలుసా? ఎవరి పేరు చెబితే.. అంటూ ఇంట్రడక్షన్ కోసమే ఓ పది పేజీల్ని కేటాయించి.. అతనిక్కడ ఎందుకున్నాడో తెలుసా? అంటూ ముగించటం పరమ రొటీన్ కథ. కానీ -అలాంటి పక్కా ఫార్ములా మాస్ చిత్రానికి ఏ ఆడంబరం అవసరం లేదు. కథ దానంతట అదే పరిగెడుతుంది. ఈక్వేషన్‌ని బట్టి ఆరు పాటలు.. నాలుగు మాస్ రొమాన్స్ సీన్లు.. పండించాల్సి వస్తే సెంటిమెంట్ సీన్లు.. పవర్‌ఫుల్ డైలాగులు.. వాటితోపాటు పదునైన ఫైట్లు. చాలు. ఇంతకిమించి ఏ అభిమానీ మరొకటి కోరుకోడు. ఈ సినిమాలోనూ అదే.
ఆ కథనమేంటో చూద్దాం.
ఓ సూపర్ మార్కెట్‌లో సూపర్‌వైజర్‌గా పని చేస్తూంటాడు చందు (బాలకృష్ణ). నివాసం అతని మామ ఇంట్లోనే. ఆ సూపర్ మార్కెట్‌లో ఇందు (సోనాల్ చౌహాన్) పరిచయమవుతుంది. ఇందు అన్నయ్య ఓ మర్డర్ కేసులో ప్రత్యక్ష సాక్షి. మర్డర్‌తో సంబంధం ఉన్న గ్యాంగ్ అతడి కోసం వెతుకులాట మొదలెడుతుంది. అతడు కనిపించక పోవటంతో ఇందుని కిడ్నాప్ చేస్తారు. దాంతో చందు తన ఉగ్రరూపాన్ని బయటపెడతాడు. చందు ఓ మల్టీ మిలియనీర్ అన్న సంగతి తెలుస్తుంది. కోటికి పడగలెత్తినవాడు సూపర్ మార్కెట్లో ఏం చేస్తున్నట్టు? అతడి భార్య ఢిల్లీలో ఉండటానికి గల కారణమేమిటి? విలన్‌కి అతడికి సంబంధమేమిటి? లాంటివన్నీ రొటీన్ క్లైమాక్స్‌తో కూడుకున్నవే.
బాలకృష్ణని ఏ యాంగిల్‌లో చూట్టానికి అభిమానులు ఇష్టపడతారో అలాంటి ‘కోణం’లోంచి దర్శకుడు కథని నడిపించాడు. ఇలాంటి కథలు బాలకృష్ణకి కొత్త కాదు. అందుకేనేమో- ఆయా కథలకు ‘గ్యారంటీ’ ఉంటుందన్న భరోసా కావొచ్చు. ఆ ఫార్ములా ప్రకారమే ‘డిక్టేటర్’ నడిచింది.
ఇందుతో రొమాన్స్.. అరగంటకోమారు వచ్చే పాటల హడావిడి.. అక్కడక్కడ చెణుకుల మాదిరి నవ్వించేందుకు ‘కాలనీ’ ట్రాక్... దీంతో ఫస్ట్ హాఫ్ నడిచిపోయింది. ఇక ఢోకా ఏముంది? కథ ట్రాక్‌లో పడటానికీ.. చందు ఎవరో చెప్పటానికీ క్లైమాక్స్ ఉండనే ఉంది. ఈ సినిమాకి ఫ్లాష్ బ్యాక్ ప్లస్ పాయింట్. ఎంతో ఉత్కంఠని కలిగించింది కూడా. అదీ తెలిసిన సన్నివేశాలే అయినప్పటికీ.
బాలకృష్ణ అంటేనే డైలాగ్స్‌కి పెట్టింది పేరు. అభిమానులు -కొన్నికొన్ని సందర్భాల్లో బాలయ్య సినిమా డైలాగ్స్‌ని వల్లెవేయటం తెలిసిందే. శ్రీవాస్ దాన్ని క్యాష్ చేసుకొన్నాడు. ఏ సన్నివేశం తీసుకున్నా.. పవర్ డైలాగ్స్‌తో నింపేశాడు. అదీగాక -కొన్ని సినిమాల్లో మాదిరిగా ‘రక్తపాతం’ జోలికి అస్సలు వెళ్లకపోవటం బోలెడంత రిలీఫ్. ప్రతిదీ ‘సాఫ్ట్’గానే నడిచింది. ఫైట్స్ కూడా. గాల్లోకి ఎగరటం.. దుమ్ము రేగటం.. ఇలా ఎలా చూసినా.. ఇదేదో బానే ఉందనిపించేట్టు అభిమానుల కోసం తాపత్రయపడిన దర్శకుడి శ్రమ వృధా కాలేదు. కాకపోతే -శ్రీవాస్ దర్శకత్వ ప్రతిభ ఏ సన్నివేశంలోనూ కనిపించలేదు. కారణాలు అనే్వషించటం అనవసరం. ‘పగ-ప్రతీకారం’తో కథని నింపేసి.. ఊకదంపుడు సన్నివేశాల్తో ఊదర కొట్టేశాడు. సెకండ్ హాఫ్‌లో ‘కామెడీ’ జోలికి వెళ్లలేదు. దీంతో సీరియస్‌నెస్ పెరిగింది. అదీ బానే ఉంది.
రతి అగ్నిహోత్రి విలన్‌గా రాణించినప్పటికీ -బాలయ్య ముందు కుప్పిగంతులా అన్నట్టుంది. ఆ మాటకొస్తే -ఈ సినిమాలో చాలామంది విలన్లున్నారు. ఎవరికీ అంత ‘సీన్’ ఇవ్వలేదు.
సోనాల్ చౌహాన్.. అంజలి -లకు కథలో అంతగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అంజలి ఎప్పుడో వచ్చి ఇట్టే వెళ్లిపోతుంది. సోనాల్ చౌహాన్ గ్లామర్ లుక్‌తో కనిపించినప్పటికీ.. ఫ్లాష్ బ్యాక్ కోసమే ఆ క్యారెక్టర్‌ని పెట్టినట్టుంది తప్ప.. కథలో మమేకం కాలేదు. వాట్సాప్ బేబీ పాటలో రెచ్చిపోయింది.
ఈ సినిమాలో మరో స్పెషల్ ఎఫెక్ట్ ఏమిటంటే- రక్తపాతం లేకపోవటం. బాలకృష్ణని చాలా సాఫ్ట్‌గా చూపించటం. దీంతో వయొలెన్స్ లేని డిక్టేటర్‌ని చూడొచ్చు. అదీ కాస్త రిలీఫ్‌ని అందించింది. తమన్ పాటలు... చిత్రీకరణ బాగుంది. ఆయా శాఖలన్నీ తమవంతు కృషి చేశాయి.

-ప్రనీల్