రివ్యూ

పరుగాపని రాజా! **ఎక్స్‌ప్రెస్ రాజా ( ఫర్వాలేదు )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారాగణం:
శర్వానంద్, సురభి, బ్రహ్మాజీ, సప్తగిరి, ధన్‌రాజు, సుప్రీత్, ప్రభాస్‌శీను, ఊర్వశి తదితరులు
సంగీతం: ప్రవీణ్ లక్కరాజు
నిర్మాతలు:
వంశీ, ప్రమోద్
దర్శకత్వం:
మేర్లపాక గాంధీ

రెగ్యులర్ సినిమాలతో అపజయాలు ఎదుర్కొన్న హీరో శర్వానంద్ రన్ రాజా రన్‌తో ట్రాక్ మార్చాడా? హిట్టు కొట్టిన ఊపుతో వైవిథ్యమైన కథలను ఎంచుకుంటున్నాడా? ఇక వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌తో దర్శకుడిగా మంచి విజయం అందుకున్న మేర్లపాక గాంధీ రెండో ప్రయత్నంలో ఏం చూపించాడు. యువీ క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఎక్స్‌ప్రెస్ రాజాలో వీళ్లిద్దరు ఎలాంటి మార్కులు సంపాదించారు? అదే చూద్దాం.
కథ
పనీపాటా లేకుండా తిరిగే వైజాగ్ రాజా (శర్వానంద్) తండ్రికి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలుంటాయి. కానీ, కొడుకు మాత్రం మావయ్య శ్రీను (ప్రభాస్ శీను)తో కలిసి అల్లరి చిల్లరిగా తిరిగుతుంటాడు. అలాంటి వీరిద్దరూ ఓ పోలీస్ అధికారి (పోసాని కృష్ణమురళి) కారణంగా హైదరాబాద్ చేరతారు. అక్కడ కనిపించిన అమ్ము (సురభి)తో రాజా ప్రేమలో పడతాడు. ఆమెకు కుక్కలంటే ఇష్టం. స్నూపీని పెంచుతుంటుంది. రాజాకు కుక్కలంటే చిరాకు. ఓరోజు -స్నూపీని మున్సిపాలిటీ వారికి అప్పగిస్తాడు రాజా. దాంతో అమ్ము అతన్ని ఛీకొడుతుంది. కుక్కను వెనక్కితెచ్చి ప్రేమ గెలుచుకునే ప్రయత్నాల్లో ఉంటాడు రాజా. అలా మొదలైన జర్నీలో ఒక్కొక్కరుగా -బినామీ బ్రిటీష్ (సుప్రీత్), ఇనుము (్ధన్‌రాజ్), పొల్యూషన్ గిరి (సప్తగిరి), బిల్‌గేట్స్ (బ్రహ్మాజీ), వసంత కోకిల (ఊర్వశి), నటరాజ్ (షకలక శంకర్) ఎంట్రీ ఇస్తారు. వీళ్ళంతా ఎవరు? ఎందుకు రాజా లైఫ్‌లోకి వచ్చారు? వారి రాకతో రాజా లైఫ్‌లో ఎలాంటి మలుపులు సంభవించాయి? అన్నదే మిగతా కథ.
హీరో శర్వానంద్ పాత్ర గత సినిమాల ఛాయల్లోనిదే. అయితే -యాక్టివ్ యాక్టింగ్ అండ్ డైలాగ్ డెలివరీతో కొంచెం ఆకట్టుకున్నాడు. సినిమాకు హీరోయిన్ అవసరం కనుక -ఆ ఛాన్స్ సురభికి వచ్చిందంతే. కాకపోతే గ్లామర్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కమెడియన్స్‌లో సప్తగిరి మరోసారి కామెడీ టైమింగ్ సత్తా చూపించాడు. ప్రభాస్‌శ్రీను ఓకే. సీనియర్ యాక్టర్ ఊర్వశి రెండు షేడ్స్‌లో కనిపించింది. ధన్‌రాజ్, షకలక శంకర్‌లు ఒకటి రెండు సీన్స్‌లో నవ్వించారు. విలన్స్‌గా సుప్రీత్, హరీష్ ఉత్తమన్, బ్రహ్మాజీలు ఓకే. మిగతా నటులవి వచ్చిపోయే పాత్రలే.
దర్శకుడు గాంధీ మొదటి చిత్రంపై చూపించిన ఆసక్తి -ఈ సినిమాపై చూపించలేకపోయాడు. సినిమాలో చెప్పుకోదగ్గ కథ కూడా ఏమీ ఉండదు. కేవలం స్క్రీన్‌ప్లేతో కథ అల్లాడు. రాసుకున్న ట్విస్ట్‌లు ఓకే అనిపించినా, వాటిని నడిపించడానికి రాసుకున్న సన్నివేశాల్లో బలం కరవై రక్తికట్టించలేకపోయాయి.
పాత్రలు, వాటి మధ్య అర్ధవంతమైన సన్నివేశాలు, సరైన సమయంలో మలుపులు ఉన్నా, రక్తికట్టించేలా అనిపించవు. సామాజిక అంశం దగ్గర కథ మొదలై.. మధ్యలో ఎలాంటి సంబంధం లేకుండా ప్రేమకథగా ప్రయాణించి.. క్లైమాక్స్‌లో రివేంజ్ ఎపిసోడ్‌గా మారిపోతుంది -ఎక్స్‌ప్రెస్ రాజా. ఇక ప్రేమ సన్నివేశాలు పేలవంగా అల్లుకున్నాడు దర్శకుడు. హీరోయిన్‌ని ప్రేమించాలి కాబట్టి, ప్రేమకథకు కనెక్ట్ అవ్వాలంటే వారిమధ్య ప్రేమను సరిగ్గా చూపెట్టాలి. అక్కడే దర్శకుడు విఫలమయ్యాడు. సింపుల్‌గా చెప్పాలంటే ప్రేక్షకుడికి కథలో లీనమయ్యే అవకాశం ఎక్కడా ఇవ్వలేదు. కార్తీక్ ఘట్టమనేని అందించిన సినిమాటోగ్రఫీ సూపర్బ్. ప్రవీణ్ లక్కరాజు అందించిన సంగీతం ఫరవాలేదనిపించింది. నేపథ్య సంగీతం ఆకట్టుకోలేదు. ఎడిటింగ్ విషయంలో ఇంకొంచెం దృష్టిపెట్టాలి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఏ సినిమాకైనా కథే బలం అనే విషయం ఇప్పటికే కొన్ని లక్షలసార్లు వినే ఉంటాం. కానీ, సినిమాలో అలాంటి అంశాన్ని గాలికొదిలేసి, కథనం కోసమే అల్లుకున్న సినిమాగా అనిపిస్తుంది. హీరో వ్యక్తిత్వాన్నీ సరిగ్గా చూపిన సన్నివేశాలు లేవు. ఒక్కో పాత్ర పరిచయం.. దాని ప్లాష్‌బ్యాక్ మొదలు.. తిరిగి వర్తమానానికి రావడం ఇదే సరిపోయింది. హీరో, హీరోయిన్ చుట్టూ తిరుగుతుంటే, కథ మాత్రం కుక్కచుట్టూ తిరుగుతుంటుంది. కథలో తన తండ్రి సామాజిక సేవలో ఉన్నాడు. దాన్ని లీడ్ చేస్తూ మోసం జరిగినప్పుడు ఆ మోసాన్ని హీరో ఎలా ఛేదించాడన్న బలమైన పాయింట్‌పై దృష్టిపెట్టలేకపోయరు. కామెడీని నమ్ముకుని చేసిన ఎక్స్‌ప్రెస్ ప్రయాణం తప్ప, కథాపరంగా చెప్పుకోదగ్గ బలమైన అంశాలైతే ఏవీ లేదు.

-త్రివేది