Others

ట్రేడ్ టాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్రాంతి పండుగ చిత్రాల కాంతి ఇంకా థియేటర్లపై సాగుతోంది. సంక్రాంతి సినిమాల జోరుతో మొదటివారం సినిమాలు విడుదల కాకపోయినా, రెండవ వారంలో మాత్రం రాజ్‌తరుణ్ ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’, లావణ్యాత్రిపాఠి నవీన్‌చంద్రల ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ లాంటి డైరెక్ట్ చిత్రాలతోపాటుగా తమిళంలో రూపొందిన ‘అరణ్మణి-2’ చిత్రం కళావతిగా అనువాదమై వచ్చింది. ఈ వారం విడుదలైన ఈ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. రాజ్‌తరుణ్‌కు తొలి ప్లాప్ ఎదురైంది. లచ్చిందేవి లావణ్యాత్రిపాఠి ఉన్నాకానీ కరుణించలేదు. త్రిష, హన్సికల ప్రభావం ఏమాత్రం కళావతిని కదిలించలేక పోయింది. సంక్రాంతి పండుగకు విడుదలైన చిత్రాలలో సోగ్గాడే చిన్నినాయనా ఇప్పటికీ హౌస్‌ఫుల్ కలెక్షన్లతో సాగుతూ తన స్టామినా చూపిస్తోంది. నాన్నకు ప్రేమతో, ఎక్స్‌ప్రెస్ రాజా చిత్రాలు కూడా బాక్సాఫీస్‌ని కళకళలాడిస్తున్నాయి.