Others

ట్రేడ్ టాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్రాంతికి విడుదలైన చిత్రాలకు అదృష్టం అలా తన్నుకొస్తోంది. ఆ సినిమాలు విడుదలైన ఠెండు వారాలకు కూడా వాటికి సరైన పోటీగా నిలిచే చిత్రాలు రాలేదు. ఈవారం ఎప్పటినుంచో దర్శకుడు వంశీ ఊరిస్తున్న చిత్రం ‘వెనె్నల్లో హాయ్ హాయ్’ విడుదలైంది. నరసింహనంది దర్శకత్వంలో అందరూ నూతన తారలతో ‘లజ్జ’ చిత్రం, మెహర్‌రాజ్, మనీషా జంటగా అర్జున్ ప్రవాస్ దర్శకత్వంలో ‘నిలువవే
వాలు కనులదానా’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయ. ఈ చిత్రాలతోపాటు బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడుగా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం ‘స్పీడున్నోడు’. ఈ చిత్రాల్లో వెనె్నల్లో హాయ్‌హాయ్, నిలువవే వాలుకనులదానా చిత్రాలు ప్రేక్షకులను థియేటర్లవద్దకు ఆకర్షించలేకపోతున్నాయి. లజ్జ చిత్రం నరసింహనంది పాత బాణీలోనే రూపొందించినా, కథనంలో ఉన్న వైవిధ్యాలు ప్రేక్షకుడి దాకా
చేరకపోవడంతో బాక్సాఫీసును ఏమాత్రం కదిలించలేకపోయాయి.
స్పీడున్నోడు చిత్రానికి పోటీనిచ్చే సినిమాలు లేకపోవడంతో థియేటర్లవద్ద ప్రేక్షకులు కనిపిస్తున్నారు. ఈవారం ఈ చిత్రంతోనే కొద్దోగొప్పో బాక్సాఫీసు కళకళలాడుతోంది. సో సంక్రాంతి సినిమాల్లో సోగ్గాడు కలక్షన్లను రాబడుతూనే ఉన్నాడు. సంక్రాంతి సినిమాల హవా ఏమాత్రం తగ్గలేదు.