Others

నాగుల చవితి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళంలో
శ్రీ రాజరాజేశ్వరి పిక్చర్స్ వారు
‘నాగపంచమి’ నిర్మించారు. అదే కథాంశంతో ఎవిఎం వారు ‘ఆదర్శ సతి’ పేరిట కన్నడంలో, తెలుగులో చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వంలో
‘నాగులచవితి’ రూపొందించారు. 1956లో ఈ చిత్రం విడుదలైంది.

మాటలు, పాటలు: పరశురామ్
నృత్యం:
కెఎన్ దండాయుదపాణి పిళ్ళై
ఛాయాగ్రహణం:
మాధవ్‌బుల్‌బులే
కళ: హెచ్ శాంతారాం
సంగీతం: సుదర్శనం, గోవర్థన్
నిర్మాత: ఏవి మొయ్యప్పన్.
ఎడిటింగ్, దర్శకత్వం:
చిత్రపు నారాయణమూర్తి

నటి జానకి వాయిస్ ఓవర్‌తో చిత్రంలో తొలుత నాగులచవితి నాడు ప్రజలచే నాగారాధన, పూజలు చూపటం, నాగులచవితి ఆరాధన ఎలా మొదలైందో తెలుపటంతో ప్రారంభమవుతుంది.
ఈశ్వరుని మానసపుత్రిక మానసాదేవి (జానకి) నాగలోకంలో ఈశ్వరునికి తన చెలులతో కలిసి నృత్యంజలి సమర్పిస్తుంది. అక్కడకు వచ్చిన నారదుడి (రఘురామయ్య) ద్వారా తమ సోదరులు కుమారస్వామి, విఘ్నేశ్వరునికి జరుగుతున్న ఆరాధనలు, పూజల గురించి తెలుసుకుంటుంది. అదే సమయంలో తనకు గుర్తింపు లేదని భావిస్తుంది. కైలాసం వెళ్ళి -ప్రజలు తననూ ఆరాధించేలా అనుగ్రహించమని శివుడు (నాగభూషణం), పార్వతి (మాలతి)లను కోరుతుంది. ఆరాధనలు ఆత్మశక్తివల్లే లభిస్తాయని చెబుతాడు ఈశ్వరుడు. ఆ సందర్భంలో ఈశ్వర భక్తుడు చంపకపురి సామ్రాట్ చంద్రధరుని (ఆర్ నాగేంద్ర) భక్తి గూర్చి ప్రస్తావన వస్తుంది. అతడిని తన భక్తునిగా మార్చుకుంటే తనకు గుర్తింపు లభిస్తుందని భావిస్తుంది మానస. ఓడలో చంద్రధరుడు ప్రయాణిస్తుండగా, తుఫాన్ సృష్టించి అల్లకల్లోలం చేస్తుంది. మహారాణి (రమాదేవి) శివపార్వతులను వేడుకొనగా మానస ప్రత్యక్షమై తన కలశం ఇచ్చి, తనను పూజిస్తే మహారాజు రక్షింపబడతాడని చెబుతుంది. మహారాణి అందుకు అంగీకరించడంతో, మహారాజు క్షేమంగా రాజ్యానికి వస్తాడు. తన దైవ మందిరంలో మానస కలశాన్ని చూసి ఆగ్రహంతో విసిరేస్తాడు. దాంతో మానసకోపించి అతని ప్రజలను, కుమారులను సర్పదక్షులను చేస్తుంది. కుమారుల మరణంతో చింతించిన మహారాణికి మరల ఒక కుమారుని ప్రసాదిస్తుంది. శ్రీపురాధీశుడు (ఎవి సుబ్బారావు) నాగదేవతారాధకుడు. ఆ మహారాణికి జగన్మాత అనుగ్రహం వల్ల పుత్రిక జన్మిస్తుంది. యుక్త వయస్కులైన యువరాజు లక్ష్మీంద్రుడు (మోహన్), యువరాణి విపుల (జమున) ఒక అడవిలో వేట మూలంగా కలుసుకొని అనురాగబద్ధులౌతారు. లక్ష్మేంద్రునికి జాతకం ప్రకారం తొలి రేయి పాముకాటుచే మరణిస్తాడని జోశ్యులు చెప్పినా, విపుల అతనే్న వివాహమాడాలని నిర్ణయించుకుంటుంది. వారికి వివాహం జరిగిన తొలి రాత్రి ఇనుపకోటలో గట్టి కాపలావున్నా, మానస పంపిన తక్షకుడు అతన్ని కాటువేస్తాడు. భర్త శవంతో, విపుల ఒక పడవలో ప్రయాణించి వ్రతదీక్షతో పుణ్యతీర్థాలు తిరుగుతుంది. ఆమె దీక్ష భంగ్నం చేయాలని ప్రయత్నించిన మానస పిశాచంగా మారుతుంది. అయినా చంద్రధరుని శివదీక్షను, విపుల భర్తను రూపుమాపాలని ఎంతో ప్రయత్నిస్తూనే ఉంటుంది. విపుల ఆత్మశక్తితో సూర్యగమనాన్ని నిలుపుదలచేసి, ప్రజాక్షేమం కోసం తిరిగి సూర్యుని ప్రయాణింపచేసి, భర్త శవంతోపాటు కైలాసంచేరి తపోశక్తితో ఈశ్వరుని యోగ నిద్రనుంచి మేల్కొలిపి, భర్త ప్రాణాలు, మిగిలిన ప్రజలు, బావగార్ల ప్రాణాలను వరంగా పొందుతుంది. అక్కడకు వచ్చిన మానసను చంద్రధరుడు ఆరాధిస్తాననటం, నాటినుంచి భూలోకంలో నాగారాధన ప్రారంభం కావటం జరుగుతుంది. లక్ష్మేంద్రుని మిత్రుడిగా పద్మనాభం నటించారు. నటీనటులంతా పాత్రోచితంగా నటించి మెప్పించారు. మానసాదేవిగా జానకి ప్రశంసనీయమైన నటన చూపటం విశేషం. సన్నివేశాలకు తగినట్టు సౌమ్యం, శాంతం, క్రోధం, అసహనం, పిశాచంగా మారి స్మశానంలో అట్టహాసం, పలురకాల షేడ్స్‌ను నటనలోచూపి (నెగెటివ్ పాత్రను) మెప్పించింది. విపులగా జమున భరతనారి పవిత్రతను, పతిభక్తిని వెల్లడిచేస్తూ ఆత్మశక్తిని, అణుకువను, సాత్వికతను ఎంతో భావయుక్తంగా ఆకట్టుకునేలా నటనలో ప్రదర్శించింది. చంద్రధరునిగా ఆర్ నాగేంద్రం, శివభక్తునిగా అహంభావాన్ని, వైరాగ్యాన్ని అద్భుతంగా నటించి చూపించారు.
దర్శకులు చిత్రపు నారాయణమూర్తి, కళాదర్శకుని తోడ్పాటులో రూపొందించిన అంతఃపురం సెట్టింగ్స్, ఇనుపకోట, నాగలోకం, కైలాసం ఇక మానస ఆగ్రహంతో, అంతపురం అంతా పాములతో నిండిపోవటం, ప్రజలు కకావికలుగా చెదిరి పాముకాటుచే మరణించటం, చంద్రధరుని ఓడ సముద్రంలో రెండుసార్లు అల్లకల్లోలం కావటం, రెండవసారి చంద్రధరుడు నీటిలో మునిగిపోతుండగా శివలింగం పైకివచ్చి చంద్రధరునికి రక్షణ కల్పించటం, దాన్ని కౌగలించుకున్న చంద్రధరుడు భూమిపైకి రావటం, ఇనుప కోటశాలను పాము బద్దలుకొట్టుకుని లోపల ప్రవేశించటం, ఒక పాము పూజింపబడిన పూలను తోసుకుంటూ మరో పాము లక్ష్మేంద్రుని కాటువేయటం, ఇక పాటల చిత్రీకరణను ఎంతో వైవిధ్య భరితంగా, చిత్రాన్ని ఉత్కంఠ కలిగించేలా తీర్చిదిద్దారు.
సుదర్శనం, గోవర్ధనం అందించిన సంగీతంతో పాటలు జనరంజకంగా రూపుదద్దుకున్నాయి. విపుల, లక్ష్మేంద్రుడు కలిసే సన్నివేశం నేపథ్యంలో -మనసూగే చెలి తనువు వూగే ప్రియ పాట ట్యూన్, మరోసారి నాగిని చిత్రంలో ట్యూన్‌గా వినిపించటం గమనించొచ్చు.
చిత్ర గీతాలు
తొలుత నాగలోకంలో నటరాజు విగ్రహం ముందు జానకి, చెలులపై చిత్రీకరించిన నృత్య గీతం -ఓంనమో నమో నటరాజ నమో హర జటాజూట ధర శంభో (టిఎస్ భగవతి బృందం). నారదుడిపై చిత్రీకరించిన గీతం -శ్రీ సతీ మోహనా పాహిమాం దేవా (కె రఘురామయ్య). నారదునిపై పద్యం -తన సర్వశ్వము ఈశ్వర్పణముగా (కె రఘురామయ్య). చంద్రధరునిపై చిత్రీకరించిన గీతం -శివశివ శంభో భవభవ హర శంభో (పిబి శ్రీనివాస్). శ్రీశ్రీపురాదేశంలో మహరాజు ముందు ఇవి సరోజపై చిత్రీకరించిన నాగ నృత్యం -నటరాజు తలదాల్చు నాగదేవతా (ఎంఎల్ వసంతకుమారి). నారదునిపై చిత్రీకరించిన పద్యం -సకల సంతానము నష్టమైనప్పుడే (కె రఘురామయ్య). మహరాణులు ఇరువురూ తమ పిల్లలను ఊయల ఊపుతూ పాడే గీతం -జోజో తనయ జోజోవరతనయా (టిఎస్ భగవతి బృందం). రాకుమారి విపుల అడవిలో చెలులలో పాడే గీతం -మది ఉదయించే భావసుధలేవో మాధుర్య నిధులేవో (సత్యవతి బృందం). తొలిరేయి విపుల వీణ వాయిస్తూ లక్ష్మేంద్రుని తిలకిస్తూ పాడే గీతం -ప్రభూ నీ పాద ఆరాధనే తపోసాధన సందర్శనందమే సదానందము (పి సుశీల). విపులపై చిత్రీకరించిన పద్యం -్ధనధాన్యములు, భోగభాగ్యములు తద్ధాం పద్య సౌభాగ్యము (పి.సుశీల). -పతివ్రతమే సంజీవిని పతికిపతియే గతి (పి.సుశీల). -మును దాంపత్యములెన్ని గూర్చితినో (పి సుశీల). -వనితా వివాహం వదిలె వైధవ్యం హేతువాయే (ఎంఎస్ రామారావు, సత్యవతి). -పతియే దైవమటంచునే నిలచినదే సూర్యరధము (పి సుశీల, మాధవపెద్ది). శివలింగంపైకి వస్తుండగా వచ్చే గీతం -కదలివచ్చే త్రిపురారి (మాధవపెద్ది). శివలింగాన్ని పూజిస్తూ చంద్రధరుడు పాడే గీతం -సాగరమీదుటనీదరి చేరుట శంభో నీలీల (పిబి శ్రీనివాస్). తొలిరేయి భర్తను కాటువేయ వచ్చిన నాగుని పూలతో పూజిస్తూ పాలు అర్పించి భర్తసహా విపులపాడే భక్తిగీతం -ఓ దేవ ఫణీశా శరణమయా నానాధుని బ్రోవుమయా.
సంగీతపరంగా కూడా సక్సెస్ సాధించిన ఈ గీతాల్లో -నమోనమో నటరాజ, -నటరాజు తలదాల్చు, -ప్రభూ నీపాద ఆరాధన, -ఓ దేవ ఫణీశా, -శివశివ శంభో నేటికీ భక్తిగీతాలుగా శ్రోతలను అలరించటం విశేషం. ఈ చిత్ర గీతాల్లో, సంభాషణల్లో గంగా, యమునా నదుల వంటి, కాశీవంటి పుణ్యతీర్థాల ప్రాశస్థ్యం, భారత స్ర్తి ఉత్తమ లక్షణాలు, పాతివ్రత్య మహిమల గూర్చి, పతిభక్తిని సతులకు వివరించిన విధానం ఎంతో చక్కగా విశే్లషించటం, విపుల పాత్ర ద్వారా స్ఫూర్తిని కలిగించటం ఎన్నదగిన అంశం.
తమిళంలో ‘‘నాగపంచమి’’ తీసిన రాజరాజేశ్వరివారు దాన్ని ‘‘నాగపంచమి’’ పేరుతోనే తెలుగులో డబ్ చేశారు. కానీ అది విజయవంతం కాలేదు. ఎవిఎం వారి నాగులచవితి చిత్రం పండిత, పామర జనరంజకంగా నిలిచి విజయం సాధించింది.

- సివిఆర్ మాణిక్యేశ్వరి