రివ్యూ

కొంచెం.. నిదానం! (స్పీడున్నోడు - ఫర్వాలేదు )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరాయి భాషా కథల్ని ఒడుపుగా ఒలుచుకుని.. రీమేక్ డౌటురాకుండా స్క్రీన్‌పై మ్యాజిక్ చేయడంలో దర్శకుడు భీమనేనిది సెపరేట్ స్టయిల్. ఆ ధైర్యంతోనే -తమిళ సుందరపాండియన్‌ను తెలుగు స్పీడున్నోడుగా తెరకెక్కించాడు. స్టార్ హీరోలతో రీమేక్‌లు చేసినా -కంటెంట్‌నే నమ్ముకుని హీరోయిజాన్ని పక్కనపెట్టేసే భీమనేని స్టయిల్‌కు ఆడియన్స్ ఒకప్పుడు కనెక్టయ్యారు. ఈసారి భీమనేని ట్రాక్ మార్చాడు. ఫస్ట్‌టైం -్ఫ్యక్షన్ పల్లెటూరిలో సహజ సిద్ధంగా సాగాల్సిన కథకు హీరోయిజాన్ని జోడించాడు. బ్యూటిఫుల్ లొకేషన్లోని సింగిల్ బీటీ రోడ్‌పై ‘ప్రేమపావురం’ ఆర్టీసీ బస్సు నుంచి కథ మొదలైనపుడు -ఇదేదో వినోదాత్మక పల్లెటూరి ప్రేమ కథేలే అన్న భావన కలుగుతుంది. -అసలు కథ గుట్టువిప్పకుండా అర్థ్భాగం వరకూ లవ్ ట్రాక్‌నే లాగినపుడు -ఇదీ రొటీన్ ప్రేమ కథేలే అని ప్రేక్షకుడు ఫీలయ్యాడు. అర్థ్భాగం నుంచి హీరోయిజాన్ని ఎలివేట్ చేసే యాక్షన్ పార్టును భుజానికెత్తుకోవడంతో -స్పీడున్నోడు ట్రాక్ మీదకు వచ్చాడన్న ఆసక్తి కలుగుతుంది. చివరి వరకూ ఆ స్పీడ్‌ను కొనసాగించాడా లేదా అన్నది చూద్దాం.
కథేంటి?
ప్రాణం కంటే స్నేహానికి విలువనిచ్చే కుర్రాడు శోభన్ (బెల్లంకొండ శ్రీనివాస్). స్నేహితుడు గిరి అలియాస్ రబ్బర్‌గాడు (మధునందన్). ఫ్యాక్షన్ పల్లె వెంకటాపురానికి చెందిన వాసంతి (సోనారికా)ని ఫ్రెండ్ ప్రేమిస్తున్నాడని తెలుస్తుంది శోభన్‌కి. హెల్ప్ చేసి వాసంతి, గిరిని ఒక్కటి చేయాలనుకుంటాడు. పనీపాటా లేని మరో ఆకతాయి స్నేహితుడు సూరి (శ్రీనివాసరెడ్డి) అందుకు సహకరిస్తుంటాడు. రెండూళ్ల మధ్య జరిగే బస్సు ప్రయాణం కథలో -శోభన్‌కి చిన్న సమస్య వస్తుంది. రబ్బర్‌గాడి కంటే ముందే చిట్టి (సత్య) అనే మరో స్నేహితుడు వాసంతికి లైనేస్తుండమే ఆ సమస్య. ఇద్దరూ కాదనలేని ఫ్రెండ్సే కనుక -వన్‌సైడర్ సీనియర్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ, వాసంతిని లైన్‌లో పెట్టుకోడానికి వన్‌మంత్ టైమిస్తాడు. ఫ్రెండ్షిప్‌కు విలువనిచ్చే శోభన్ సిన్సియర్ హీరోయజానికి వాసంతి అట్రాక్ట్ అవుతుంది. హైస్కూల్ లెవెల్లోనే తనకు ప్రపోజ్ చేసిన శోభన్‌కి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. లవ్‌స్టోరీ ట్రాక్ మీదకు వచ్చేస్తుందన్నకున్న టైంలో -అసలు కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది. -శోభన్ క్లాస్‌మేట్, వాసంతికి బావ వరుస అయిన కబీర్ సింగ్‌తో ఆమెకు పెళ్లి కుదురుతుంది. రాయలసీమ ఫ్యాక్షన్ కుటుంబం నుంచి ఎదురైన సమస్యను శోభన్ ఎలా పరిష్కరించుకున్నాడు. అమ్మాయిలవైపు చూస్తేనే అడ్డంగా నరికేసే ఫ్యాక్షన్ పల్లెల్లో -శోభన్ లక్ష్యం నెరవేరిందా? వాసంతి ఎవరి సొంతమైంది? లాంటి మలుపుల ప్రశ్నలకు సమాధానం మిగతా కథ.
లవ్, ఫ్రెండ్‌షిప్ కానె్సప్ట్ కథలు తెలుగు సినిమాలకు కొత్తకాదు. తమిళంలో హిట్టు కొట్టిందన్న సింగిల్ లైన్ తప్ప, ఈ కథను పరాయి భాషనుంచి ఏరి తెచ్చుకొవాల్సినంత గొప్పగానూ అనిపించదు. తమిళంలో సుందరపాండియన్ హిట్టనిపించుకోవడానికి కథను మించిన ప్రధానాంశం -నటీనటులు. పాత్రకు తగినట్టుగా వాళ్లు పలికించిన హావభావాలు. అలాంటివన్నీ తెలుగులోకి వచ్చేసరికి మిస్సవడంతో -స్పీడున్నోడు కొద్దిగా స్లో అయ్యాడు. కాకపోతే, ఎంటర్‌టైన్‌మెంట్‌ను చూపించడంలో దర్శకుడు భీమనేని అనుభవం, హీరో బెల్లంకొండ వేగం కలగలిపి ప్రేక్షకుడిని కాసేపు కూర్చోబెట్టగలిగాయ.
ఫైట్లు, పాటలు, ప్రెండ్స్‌కోసం పడిన లవ్ కష్టాలతో ఫస్ట్ఫా ప్రయాణం ముగిశాక -కథేంటి? అన్న ప్రశ్నదగ్గరే ప్రేక్షకుడు ఉండిపోయాడు. అర్థ్భాగం తరువాత కథ ట్విస్టులతో మొదలవ్వడంతో -పతాక సన్నివేశాలపై ఆసక్తితో ప్రేక్షకుడు ఎదురు చూడాల్సి వచ్చింది. కానీ, ప్రాసవీడని పాత్రలు.. ప్రతి సీన్‌లోనూ ఉపమానాలు. అసలు విషయాన్ని చెప్పకుండా అద్భుతాన్ని చెబుతున్నట్టు రాసుకున్న సంభాషణల కారణంగా -కథలో పట్టుసడలినట్టు అనిపిస్తుంది. విజయ్ ఉలగనాథన్ కెమెరా అందాలు, డిజె వసంత్ సంగీత స్వరాలు ఆడియన్‌కి ఒకింత ఊరట. గౌతమ్‌రాజు ఎడిటింగ్ సహనానికి పరీక్ష పెట్టింది.
అల్లుడి శీనుతో మంచి మార్కులు సంపాదించుకున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్ అంతకుమించి ఈజ్ చూపించినా -స్పీడున్నోడు మొదటి సినిమా స్థాయని అందుకోలేదు. సంభాషణలు, భావోద్వేగాలు పండించటంలో గతంకంటే బెటర్. హీరోయిన్ సోనారిక జోడీగానూ మెప్పించలేకపోయింది. శ్రీనివాసరెడ్డి, మధునందన్, సత్య, విద్యుల్లేఖ, పృధ్వీ, పోసాని కృష్ణమురళి తదితరులు పాత్రోచిత ప్రయత్నం చేశారు. ప్రూవ్‌డ్ ఆర్టిస్టులు కనుక -పాత్ర పరిధి పెద్దగా లేకున్నా ప్రకాష్‌రాజ్, రావు రమేష్ డీసెంట్ అనిపించారు. ఐటెం చేశాననిపించుకోవడం తప్ప, తమన్నా స్పెషల్ సాంగ్ ప్రాజెక్టుకు ఏమాత్రం ఊతమివ్వలేదు. దర్శకుడిగా, నిర్మాతగా భీమనేని ఓకే అనిపించుకున్నా, రీమేక్ రాబడిని రాబట్టలేకపోయాడు -స్పీడున్నోడు.

తారాగణం:
బెల్లంకొండ శ్రీనివాస్, సోనారిక, తమన్నా (స్పెషల్ సాంగ్), ప్రకాష్‌రాజ్, రావురమేష్, అలీ, శ్రీనివాస రెడ్డి, మధునందన్, సత్య, కబీర్, ఝాన్సీ, రమాప్రభ తదితరులు.
సంగీతం: డిజె వసంత్
నిర్మాత: భీమనేని సునీత
దర్శకత్వం:
భీమనేని శ్రీనివాస రావు

-ప్రవవి