Others

ఆడబ్రతుకు (నాకు నచ్చిన సినిమా )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెమినీ స్టూడియోస్ వారు నిర్మించిన ఆడబ్రతుకు చిత్రానికి దర్శకుడు వేదాంతం రాఘవయ్య. ఎన్టీ రామారావు, ఎస్వీ రంగారావు, కాంతారావు, రాజనాల, పద్మనాభం, అల్లు రామలింగయ్య, ముక్కామల, దేవిక, ఎంవి రాజమ్మ, పుష్పవల్లి నటించగా, సంగీతం విశ్వనాథన్, రామ్మూర్తిలు సమకూర్చారు.
ఒక జమీందార్‌గారి అబ్బాయి, నాటకాలలో పనిచేసే అమ్మాయిని రౌడీలబారి నుంచి కాపాడి ప్రేమిస్తాడు. ఇది జమీందార్‌కు ఇష్టం ఉండదు. నాటకాలు వేసే అమ్మాయిలకు శీలం ఉండదని చెప్తాడు. కానీ ఆ అబ్బాయి పట్టుబట్టి ఆమెను వివాహం చేసుకుంటాడు. నాటకాల కంపెనీ మేనేజర్‌తో ఈమెకు సంబంధం ఉందన్న అనుమానం జమీందారుకు ఉంటుంది. భార్యాభర్తలు కారులో వెళ్తుంటే బజార్లో గలాటా జరిగి కర్‌ఫ్యూ విధిస్తారు. కారు కదలకుంటే హీరో ఇంకో ఏర్పాటు చేయడానికెళితే, రౌడీలు హీరోయిన్‌కు అదోరకంగా చూస్తారు. ఆమే తప్పుకుని ఓ యింటిలో తలదాచుకుంటుంది. అది కంపెనీ మానేజర్ ఇల్లే. మంచివాడు కనుక ఆమెను ఓ గదిలో ఉంచి గడియ వేయించుకుంటాడు. ఆమె మంచంపై కూర్చొని చెవి రింగ్‌లు తీసుకుంటుంటే జారి మంచంపై పడుతుంది. ఇది గమనించదు. ఇంతలో ఒక రౌడీని మేనేజర్ చంపాడని అరెస్టు చేస్తారు. కాని సాక్ష్యం ఈమె ఉంటుంది. కోర్టులో హాజరుపర్చగా ఈమె వచ్చి సాక్ష్యం చెప్తుంది. ఆరోజు రాత్రి మేనేజర్ ఇంట్లో వున్నానని. అంతే! జమీందార్ ఆమెను ఇంటినుండి గెంటివేస్తాడు. తల్లితో ఆమె ఊరొదలిపోతుంది. ఒక ముస్లిం సంతతివారు గర్భిణీ స్ర్తిని దయతో తమ ఇంటిలో ఉండనిచ్చి ప్రసవం చేస్తారు. ‘మగ పిల్లవాడిని, హీరో భార్యను జ్ఞాపకం చేసుకుంటూ కారులోవెళ్తూ ఆక్సిడెంట్ పాలవుతాడు. ముస్లింవారు ఇతన్ని తన స్నేహితుడి కుమారునిగా గుర్తించి తగు సపర్యలు చేస్తారు. నిప్పు దగ్గరకెళ్తున్న తన కుమారుని ఎత్తుకొని రెండో వివాహం చేయాలనుకుంటాడు జమీందార్. హీరో ఒప్పుకోడు. భూకంపమొచ్చి చెల్లాచెదురౌతారు. కంపెనీ మేనేజర్, రౌడీని చంపిన రౌడీని పిలుచుకుని వచ్చి జమీందార్‌తో చెప్పించి నిప్పులాంటి స్ర్తి తమ కోడలని చూపుతారు. భర్త ఇంటికొచ్చి హీరోయిన్ అబ్బాయిని మామ కప్పగించి చావాలని వెళ్తుంది. భూకంపంలో ఎక్కడో భూమికి అడుగుభాగాన నీటిలో పడివున్న భర్తను కుక్క పసిగట్టి పిల్చుకొనిపోయి బతికించుకుంటుంది.

-పి రామకృష్ణ