Others

ధైర్యే సాహసి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓవైపు చక్కగా నటిస్తుంది. మరోవైపు అందాన్ని ఆరబోస్తుంది. పెద్ద పెద్ద హీరోల సరసన ఇమిడిపోతుంది. తెలుగుదనం ఉట్టిపడే అంజలి గూర్చిన వ్యాఖ్యానాలివి. అయితే అంజలి మాత్రం ఎప్పటికప్పుడు తనలో సరికొత్త ఆవిష్కరణలు జరుపుకుంటోంది. కొత్త కొత్త పాత్రల కోసం అనే్వషిస్తోంది. ఈనేపథ్యంలో ఇటీవల వచ్చిన ఓ చిత్రంలో రివాల్వర్ రాణిగా బెదిరించింది. తాజాగా ఓ తమిళ సినిమాలో వ్యభిచారిణి పాత్రలో నటిస్తోందట. ఓహో ఇలాంటి పాత్రలో గతంలో అనేకమంది నటించారులే అని అనుకుంటున్నారా! కానీ ఇది అటువంటి ఇటువంటి పాత్ర కాదు. ట్రాన్స్‌జెండర్ ప్రాస్టిట్యూట్ పాత్ర. అంటే మగ పాత్రే ఆపరేషన్‌తో ఆడ పాత్రగా మారిపోవడం. అటువంటిపాత్రలో అంజలి ఇమిడిపోవడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ పాత్రలో నటించే అవకాశం వందశాతం ఉన్నా ఏమాత్రం తేడా జరిగినా కెరీర్ ఇబ్బందిలోపడే అవకాశాలున్నాయని కోలీవుడ్ విశే్లషణకులు అంటున్నారు. చూద్దాం, ఈ పాత్రలో కత్తిమీద సాము చేస్తుందో లేదో!