Others

నాకు నచ్చిన పాట ( మనసా.. కవ్వించకే.. నన్నిలా..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పండంటి కాపురం చిత్రంలో సుశీల అద్భుతమైన గానంతో వినిపించే పాట ‘మనసా కవ్వించకే నన్నిలా.. ఎదురీదలేక కుమిలేను నేను, సుడిగాలిలో చిక్కిన నావను’ అనే పాట ఇప్పటికీ రేడియోలో వినిపిస్తుంటే ఆ పాటలో నటించిన జమున శోక రసంతో చేసిన నటన అభిమానులకు గుర్తుకొస్తూనే వుంటుంది. గోపి రచనలో విఫలమైన ఓ అబల ఆక్రందన అద్భుతంగా ఒదిగిపోయింది. జమిందారిణి అయిన జమున తనకు అన్యాయం చేసిన వ్యక్తిపై పగ తీర్చుకోవడంకోసం కథానాయకుని ఉమ్మడి కుటుంబంలో అనేక కలతలు రేపుతుంది. కానీ అది తన ఇల్లే అని ఆమెకు తెలుసు. అక్కడ తన కూతురు పెరుగుతుంది అని తెలుసు. అయినా కానీ పగబట్టిన పడుచు ఎప్పటికీ ఆ పగ వీడదన్నట్టుగా ఆ కుటుంబానికి అనేక ఆటంకాలు కలిగిస్తుంది. అలా ఆమె గెలిచినా చివరికి ఓడిపోయినట్లేకదా అన్న నిజాన్ని గ్రహించి, మనస్సుని తమాయించుకోలేక తను తప్పుచేస్తున్నానా? ఒప్పుచేస్తున్నానా? అని తెలియని పరిస్థితుల్లో జమున ఈ పాటను ఒంటరిగా ఓ పెద్ద మహల్‌లో తన గోడు వెళ్లబోసుకున్నట్లుగా ఆలపిస్తుంది. పాట ఎంత బాగుంటుందో జమునపై చిత్రీకరించిన విధానం అంతకన్నా బాగుంటుంది. ముఖ్యంగా పాటలో ప్రతి పదము అర్థవంతంగా సాగుతూ శ్రోతల హృదయాలను పిండేస్తుంది. ప్రతి మనస్సును ఆలోచింపచేస్తుంది. అలౌకికంగా ఆనందింపచేస్తుంది. జమున ఈ పాత్రలో ప్రాణప్రతిష్ట చేసినట్టుగా ఒదిగిపోయారు, తన హావభావ విన్యాసాలతో. ఎగిరింది కడలీ కెరటం- ఆ నింగి స్నేహంకోసం అంటూ జమున తాను ఇంకా ఆ కుటుంబంలో కలిసిపోవడానికే ఆలోచిస్తున్నానని చెప్పకుండా చెప్పింది. ఏ తీగకైనా కావాలి తోడంటూ, తాను గెలిచానన్న ఆనందంతో నవ్వాలా? ఓడానని ఏడ్వాలా అన్న తెలియని తాదాత్మ్యంలో ఉండిపోయానని చెబుతుంది. ఈ పాట చూసినా, విన్నా ఇప్పటికీ ఎంతో నచ్చుతుంది. అందుకే ఈ పాటంటే నాకు చాలా ఇష్టం.

- పసుపులేటి సాయిలక్ష్మి, నెల్లూరు