Others

మళ్లీ అమ్మోరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రమ్యకృష్ణ. -హీరోయిన్‌గా ఒకప్పుడు సెనే్సషన్. ఇప్పుడు క్యారెక్టర్
ఆర్టిస్ట్‌గానూ డబుల్ సెనే్సషన్.
సంకీర్తన సినిమా తరువాత ఐరెన్ లెగ్ అనిపించుకున్న అమ్మాయే -తరువాత ఆమె ఉంటే
చాలనే రేంజ్‌కి ఎదిగింది. ఆమె కాల్షీట్ల కోసం
ఎగబడే స్థాయికి చేరింది. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మోహన్‌బాబులాంటి టాప్ హీరోలతో ఆడిపాడింది.

పెళ్లి చేసుకుని కొంత గ్యాప్ తీసుకున్న తరువాత సెకెండ్ ఇన్నింగ్స్‌నూ అంతే హైప్‌తో సాగిస్తోంది రమ్యకృష్ణ. మొన్నటికి మొన్న బాహుబలిలో మాహిష్మతి రాణిగా, నిన్నటికి నిన్న సొగ్గాడే చిన్నినాయినా చిత్రంలో బాలరాజు గారాల పెళ్లాంగా ఆమె చూపిన అభినయం -నిజంగానే ఓ సెనే్సషన్. వయసుమీరి వెటరన్ యాక్ట్రెస్ అనిపించుకుంటున్నా -ఆమె అభినయించి చూపుతోన్న పొగరు వగరు, చిలిపితనం పెంకితనం, ఊపూ ఉత్సాహం తెలుగు తెరపై సెనే్సషనే అవుతోంది. అలాంటి రమ్య -చాలాకాలం తరువాత అమ్మోరి వేషానికి సిద్ధమైందట.. అదీ మలయాళంలో. అమ్మవారి వేషం రమ్యమ్మకు కొత్తేమీ కాదు. శ్రీ రాజేశ్వరి, శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి, దేవుళ్లులాంటి సినిమాల్లో అమ్మవారి వేషం వేసినా -కోడి రామకృష్ణ చిత్రం అమ్మోరులో అమ్మవారి పాత్రకు రమ్యకృష్ణే సిగ్నేచర్ అనిపించుకుంది. రాబోయే రుద్రాక్షలోనూ చిత్రమైన పాత్రలో కనిపించబోతున్న రమ్యకృష్ణకు -మలయాళ చిత్రం ‘ఆడుపులి యాట్టం’ మాత్రం మరో అమ్మోరు చిత్రంలాంటిదే అంటున్నారు. స్వర్ణయుగం సినిమా కాలంలో అమ్మవారి పాత్రలకు కెఆర్ విజయ సిగ్నేచర్ మార్క్ అన్నట్టే -ప్రస్తుత సినిమాల్లో అమ్మవారిగా రమ్యకృష్ణను తప్ప మరొకరిని ఊహించుకోలేని పరిస్థితి. చాలాకాలం తరువాత మళ్లీ అమ్మవారి పాత్రకు రమ్య సిద్ధమవుతుంటే -సినీ జనాల్లో ఆసక్తి పెరిగిపోతోంది. మలయాళంలో జయరామ్, ఓంపురి ముఖ్యపాత్రలుగా రూపొందుతోన్న ఆడుపులి యాట్టం చిత్రంలో దుర్మార్గులను అంతం చేయడానికి ఒక దెయ్యానికి సహకరించే దేవత పాత్రలో రమ్యకృష్ణ కనిపించబోతోందట. దెయ్యంగా చిన్నపాప కనిపించే ఈ చిత్రంలో దేవతగా రమ్యకృష్ణ ఆహార్యం, అభినయం, రౌద్రరూపం ఇప్పటి వరకూ వచ్చిన సినిమాలకు భిన్నంగా ఉంటుందని అంటున్నారు. రమ్యకృష్ణకు తెలుగులోనూ సరైన మార్కెట్ ఉండటంతో -మలయాళ సినిమా తెలుగు అనువాద హక్కులూ భారీ రేటుకే అమ్ముడుపోయాయట. కె నిర్మల పెద్ద మొత్తం చెల్లించి ఈ చిత్రం హక్కులను సొంతం చేసుకున్నట్టు చెబుతున్నారు. సెకెండ్ ఇన్నింగ్స్ ఆరంభమైన తరువాత తెలుగులో రమ్యకృష్ణకంటూ పైకి కనిపించని అభిమానగణం ఏర్పడిన నేపథ్యంలో -తెలుగులో చిత్రానికి మంచి ఆదరణ ఉంటుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. పగ తీర్చుకునే పసి దెయ్యానికి సహకరించే దేవత పాత్రలో రమ్యకృష్ణను ఊహించుకుంటూ చిత్రం ఎప్పుడు స్క్రీన్స్‌కు వస్తుందా? అని ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు.

-వివి