రివ్యూ

ఊపిరి బిగపెట్టిన క్షణం (క్షణం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారాగణం:
అడివి శేషు, అదాశర్మ, అనసూయ భరద్వాజ్, రవివర్మ, రాజేష్, వెనె్నల కిషోర్, సత్యదేవ్ తదితరులు
సంగీతం: శ్రీచరణ్ పాకాల
నిర్మాతలు:
పరమ్ వి.పొట్లూరి, కవిన్ అనె్న
దర్శకత్వం:
రవికాంత్ పేరేపు

ఒక్కోసారి ‘పోస్టర్’ కూడా చిత్ర భవిష్యత్‌ని నిర్ణయిస్తుంది. ఉత్కంఠతని రేకెత్తిస్తుంది. ఈ సినిమా ఏదో చూద్దామన్న ఆలోచనల్లోకి లాక్కెళుతుంది. ‘క్షణం’ అన్న టైటిల్‌లోనే సూక్ష్మాన్ని దాచుకొని.. ట్రైలర్స్‌తో ఆ ‘సస్పెన్స్’ని అలాగే మెయిన్‌టెయిన్ చేస్తూ వచ్చి క్షణక్షణం మదిలో మెదిలేట్టు చేసిందీ చిత్రం పోస్టర్. కొన్నికొన్ని సందర్భాల్లో ‘పోస్టర్’లో ఇంత బాగోతం జరిగి.. ఆఖరికి సినిమాలో ఆ ‘థ్రిల్లర్’ ఊసే కనిపించదు. అంతా పోస్టర్ వైభోగమే అనిపిస్తుంది. అయితే- రెండు గంటలపాటు పోస్టర్‌లో చెప్పిందానికి భిన్నంగా సస్పెన్స్‌ని క్రియేట్ చేస్తూ సాగిందీ ‘క్షణం’. సింపుల్ కథని పకడ్బందీ స్క్రీన్‌ప్లేతో ఆద్యంతం ‘క్షణం’ పొల్లుపోకండా సగటు ప్రేక్షకుణ్ని కట్టిపడేయాలంటే ‘శేషు’ ఎలాంటి అస్త్రాల్ని ప్రయోగించాడో చూద్దాం.
కథ -యుఎస్‌లో లక్షణంగా ఉద్యోగం చేసుకొంటున్న రిషి (అడివి శేషు)కి ఓ రోజు మాజీ ప్రేయసి శే్వత (ఆదా శర్మ) నుంచి ఫోన్‌కాల్ వస్తుంది. తన కూతురు రియా రెండు నెలల్నుంచీ కనిపించటం లేదనీ, ఎవరైనా కిడ్నాప్ చేశారా? పాప అదృశ్యం వెనుక ఎవరి హస్తం ఉంది? శే్వత భర్త చెబుతోంది ఏమిటి? ఇత్యాది అంశాలను అనే్వషించటానికి రిషి ఇండియా వస్తాడు. శే్వత జరిగిందంతా చెప్పి, రిషి సహాయాన్ని అర్థిస్తుంది. రియా చదివే స్కూల్ నుంచి గానీ.. పోలీసుల నించీగానీ రిషికి ఎటువంటి సమాచారం అందదు. అయితే- శే్వత భర్త.. అసలు ‘రియా’ లేనే లేదనీ.. శే్వతకి జరిగిన యాక్సిడెంట్ కారణంగా ఆమె అలా ప్రవర్తిస్తోందని అంటాడు. అసలు శే్వతకి కూతురుందా? ఉంటే ‘రియా’ ఎక్కడికి వెళ్లింది? శే్వత భర్త అలా చెప్పటానికి కారణం ఏమిటి? రియా ‘మిస్సింగ్’ గురించి భర్తని కాదని.. ఎక్కడో ఉన్న రిషి సహాయాన్ని అర్థించటం దేనికి? ఇటువంటి ప్రశ్నలతో క్లైమాక్స్ చేరుతుంది కథ.
కొన్ని సినిమాల్లో హీరోగా నటించి- ప్రేక్షకులకు చేరువ కాలేకపోయిన శేషు -ఈ చిత్రంలో రైటర్‌గా.. నటుడిగా మంచి మార్కులు వేయించుకొన్నాడు. కిడ్నాప్ కథ -ఈ కథలో అసలు మిస్టరీ అంతా -‘రియా’ ఉందా? లేదా? ఎవరో కిడ్నాప్ చేశారని శే్వత’ ఎందుకు చెబుతుంది? ఆ సంగతి రిషికి చెప్పటం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? ఇలాంటి చిన్నచిన్న సస్పెన్స్‌ని జోడించి కథని ఆద్యంతం ఆకట్టుకొనేట్టు చేయగలిగాడు శేషు. నటుడిగానూ రచయితగానూ పరిణతి చూపాడు. ఒకానొక సందర్భంలోనైతే -శే్వతని సగటు ప్రేక్షకుడిలానే అనుమానిస్తాడు! ప్రేక్షకుణ్ని తనతోపాటు కథలోకి తీసుకెళ్లడు -ప్రేక్షకుడితోపాటే తనూ వెళ్తాడన్నట్టుగా ఉంది. ఇదే టెంపోని మొదట్నుంచీ చూపాడు. ఇలాంటి కథల్లో ప్రేక్షకుడు కనెక్టయితే చాలు. ఆ అనే్వషణ ఏదో తనే చేస్తాడన్నట్టు వదిలేస్తే.. స్క్రీన్‌ప్లేతో కథని ఎంతో అందంగా ముగించవచ్చు.
ఈ సినిమాలో డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తాయి. మొదటిగా రిషి పాత్ర. లవర్‌గా, మాజీ ప్రియుడిగా, అనే్వషకుడిగా.. డిఫరెంట్ లుక్‌ని చూపగలిగాడు. ప్రియురాలిగా.. కూతుర్ని పోగొట్టుకున్న తల్లిగా ఎమోషనల్‌గా నటించింది ఆదాశర్మ. ఇక- అనసూయ. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో టెలీ భాషలో చెప్పాలంటే ఇరగదీసింది. బుల్లితెరపైనే కాదు.. వెండితెరపై కూడా నటిగా తానేమిటో నిరూపించుకొంది. తను చేసిన స్టంట్ సన్నివేశాలు ‘మాస్’ని ఆకట్టుకొంటాయి. ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ ‘సత్యం’ రాజేష్. చెడుగుడు ఆడేశాడు. క్యాబ్ డ్రైవర్‌గా ‘వెనె్నల’ కిషోర్‌కి మరో వీరతాడు.
శ్రీచరణ్ పాకాల సంగీతం బాగుంది. ‘చెలియా’ ‘క్షణం’ పాటలు ఆకట్టుకొంటాయి. ఇక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి ప్లస్ పాయింట్. శానియల్ డియో ఫొటోగ్రఫీ కథకి ప్రాణం.
దర్శకుడు రవికాంత్‌కి ఇది మొదటి సినిమా. కానీ -ఎక్కడా తడబడలేదు. కథని సాఫీగా లాక్కెళ్లాడు. ఫ్లాష్‌బ్యాక్‌లో హీరో హీరోయిన్ల లవ్‌స్టోరీ.. ప్రస్తుతంలో ‘కిడ్నాప్’.. ఇలా చెప్పుకుంటూ వెళ్లాడు. లాజిక్‌ల జోలికి వెళ్లకుండా.. కథని చూస్తూంటే మాత్రం ఎక్కడా బోర్ కొట్టదు. ఐతే -‘క్షణం’లో లవ్‌స్టోరీ అంత రొమాంటిక్‌గా ఉండదు. పాప కిడ్నాప్ వ్యవహారం చూస్తూంటే ‘కహానీ’ సినిమాతో స్ఫూర్తి పొందారా? అనిపిస్తుంది. అదీగాక -కిడ్నాప్ అయిన తర్వాత రియా తన తల్లిని మర్చిపోతుంది. ఎందుకు మర్చిపోతుంది? అన్నది లాజిక్‌కి దొరకదు. సినిమాలో పాటలు అనవసరంగా పెట్టి.. పొడిగించారనిపిస్తుంది. అదీగాక - కొన్ని హిందీ సినిమాల తాలూకు ప్రభావం కూడా సినిమాపై పడిందేమోనన్న అనుమానం కలుగుతుంది. అయితే- సినీ గమనానికి ఇవేవీ అవరోధం కాలేదు. కాబట్టి -‘క్షణం’సేపు థియేటర్‌లో కూర్చోబెట్టగలిగారు.

-ప్రనీల్