Others

జత కలిసే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్కార్ వేడుకకు వాళ్లిద్దరూ స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. హాలీవుడ్ తారగణమంతా వాళ్లిద్దర్నీ మరోసారి కళ్లారా చూసి ఆనందం వ్యక్తం చేసింది. అప్పుడెప్పుడో జేమ్స్ కామెరూన్ -వాళ్లిద్దరి కెమిస్ట్రీని అద్భుతంగా తెరకెక్కిస్తే... ఆ సందర్భాన్ని, సన్నివేశాల్ని గుర్తు చేసుకుని ఇప్పుడు హాలీవుడ్ అతి పెద్ద సినిమా పండుగ వాళ్లకు విషెస్ చెప్పింది. ఆస్కార్ వేడుకకు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలిచిన వాళ్లిద్దరూ ఎవరో కాదు -కేట్ వినె్సలెట్, లియోనార్డో డికాప్రియో. టైటానిక్ తరువాత వాళ్లిద్దర్నీ జతగా చూసేసరికి -వేడుకకు హాజరైన అనేకమంది దర్శకులు మళ్లీ ఆ పెయిర్‌తో సినిమా తీయాలనే భావనకు వచ్చుంటారు. టైటానిక్ చిత్రంలో రోస్, జాక్‌లుగా కనిపించి -ఆధునిక ప్రేమకావ్యానికి వాళ్లే ప్రతీకలన్నంత పేరు తెచ్చుకున్న కేట్, లియోనార్డోలు 88వ ఆస్కార్ బ్యాక్‌స్టేజ్‌లో జంటగా కనిపించి ‘వావ్’ అనిపించారు. చేతిలో చేయి వేసుకుని రెడ్‌కార్పెట్‌పై నడిచొస్తున్న వాళ్లను -ఆహూతులంతా అబ్బురంగా చూస్తూండిపోయారు. బ్లాక్ ఆఫ్-షోల్డర్ డ్రెస్‌లో కేట్, టక్సెడో సూట్‌లో డికాప్రియో జిగేల్ మనిపించారు. అయితే, ఆస్కార్ ఉత్తమ నటుడిగా లియోనార్డో అవార్డును అందుకుంటే -కేట్ మాత్రం అతని చూసి మురిసిపోయే ప్రేమికురాలిగా ఎలాంటి అవార్డు లేకుండా బ్యాక్ స్టేజ్‌లోనే ఉండిపోవాల్సి వచ్చింది.