Others

నాకు నచ్చిన పాట .. ఓం సచ్చిదానంద.. నీ సర్వం గోవింద..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్ ఎస్టేట్ పతాకంపై నిర్మించిన ‘కోడలుదిద్దిన కాపురం’లోని ‘ఓం సచ్చిదానంద.. నీ సర్వం గోవింద’ అన్న పాట చాలా ఇష్టం. దర్శకుడు డి యోగానంద్ ఈ పాటను చక్కగా చిత్రీకరించారు. పాటలో సత్యనారాయణ -బాబా వేషంలో రక్తికట్టించారు. స్వాములవారి వేషంలో ప్రజలను మోసంచేస్తూ తన శిష్య బృందంతో కలసి తన గొప్పదనాన్ని చాటుకునేందుకు వాడవాడలా ప్రచారం చేస్తూ కోట్ల రూపాయలు మింగి జనాన్ని మోసపుచ్చే బాబాగా సత్యనారాయణ అద్భుతంగా నటించారు. చివరికి హీరో కంట్లోపడి కటకటాలపాలవుతాడు. అంతేగాక స్వాములవారి వస్తధ్రారణ, శిరస్సుమీద విగ్గును తమాషాగా చూపించి నవ్వుపుట్టించారు. పదే పదే విగ్గును తడుముతుంటుంటే అందులోనుంచి పేలు రావడం గమ్మత్తుగా ఉంటుంది. అందుకే అంటారు పెద్దవాళ్లు.. ఎవరినీ చెడగొట్టకు, చెడిపోకు, నీ దారిలో నీవు మంచివాడిగా జీవిస్తే జన్మసార్థకమవుతుందని. ధనం శాశ్వతంగా కాదు. మంచి, మానవత్వం, కీర్తి, పరువుప్రతిష్టలే నువ్వు చేసుకున్న పుణ్యకార్యాలు. పుణ్యతీర్థాలు చేసినా రాని పరమార్థం భగవంతుడిపై మనస్సు కేంద్రీకరిస్తే కలుగుతుంది అన్నదాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఈ చిత్రంలో మిగతా పాత్రధారులందరూ అద్భుతంగా నటించారు. కోడళ్లు కాపురాలు ఎలా దిద్దుకోవాలో అద్భుతంగా చెప్పిన చిత్రరాజం ఇది. అత్తామామలను, ఆడపడుచులను, తల్లిదండ్రులను, బావమరుదులను ఎలా చూడాలో ఈ సినిమాలో చూపారు. అన్ని పాటల్లోకెల్లా ఈ పాట ఎప్పటికీ గుర్తుండి మంచి సందేశాన్ని ఇస్తుంది. కొసరాజు గీతానికి టివి రాజు స్వరాలకు మాధవపెద్ది, పిఠాపురంగార్ల ఆలాపన ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.

-సిహెచ్ హనుమంతరావు, చందానగర్