Others

డబ్బింగ్‌తో గుర్తింపా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సొట్టబుగ్గల అందాల భామ తాప్సీకి అన్నీ అందినట్లే అంది చేజారిపోతాయి. తొలి సినిమా కె.రాఘవేంద్రరావుతో చేసినప్పుడే తాప్సీ కెరీర్ టాప్‌మోస్ట్‌గా వెలిగిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ సీన్ సితార అయి ఆమెకు అవకాశాలే లేకుండా పోయాయి. అయినా కానీ పట్టువదలకుండా ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఆమె పట్టించుకున్నా ఎవరూ ఆమెను పట్టించుకున్న పాపాన పోలేదు. అవసరానికి ఏవో చిన్న చిన్న కార్యక్రమాలకు ఆమెని పిలిచి పబ్బంగడుపుతున్నారే కానీ సరైన అవకాశాలు ఎవరూ ఇవ్వలేదు. కొన్నాళ్లు ఎక్స్‌పోజ్ చేయనని మొండికేసింది. కొన్నాళ్లు చేసేస్తానంటూ రెచ్చిపోయింది. ఏది చేసినా కానీ తాప్సీని పట్టించుకున్నవాళ్లు లేరు. ప్రస్తుతం ఆమె హిందీలో ఘాజీ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు చకచకా జరుగుతున్నాయి. సినిమాలో కథానాయకుడు రానా కనుక తెలుగులో కూడా రూపొందిస్తున్నారు. ఈ రెండు చిత్రాల్లో తాప్సీనే తన డబ్బింగ్ తానే చెప్పుకుని నటిస్తోంది. ఈ చిత్రంతోనైనా తాప్సీకి దశ తిరుగుతుందేమో చూడాలి!