Others

నాకు నచ్చిన పాట ..నిన్ను మరచిపోవాలని..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మనుషులు చిత్రంలో శోభన్‌బాబు కోసం ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పాడిన పాట ఇది. ఆత్రేయ రచనకు కెవి మహదేవన్ బాణీకట్టిన ఆ పాటే -నిన్ను మరచిపోవాలని/ అన్ని విడిచివెళ్లాలని/ ఎన్నిసార్లో అనుకున్నా/ మనసు రాక మానుకున్నా’ అన్న పాట చాలా గొప్పది. ఈ పాట ఎన్నిసార్లువిన్నా కన్నీరు పెట్టిస్తుంది. విడిపోయిన ప్రేమికులు, భార్యాభర్తలకు ఈ పాట మధురంగా ఉంటుంది. ‘నీవు విడిచివెళ్లినా నీ రూపు చెరిగిపోలేదు/ నీవు మరలిరాకున్నా నీ చోటెవ్వరికీ ఇవ్వలేదు’ అంటూ ప్రేమికుడు తన ప్రేమను గుర్తు చేసుకునే ఆ ఆలోచన అద్భుతం, మధురాతి మధురం. ‘ఎందుకిలా చేశావో, నీకైనా తెలుసా? నేనెందుకిలా ఉన్నానో నాకేమో తెలియదు, నేను చచ్చిపోయినా నా ప్రేమ చచ్చిపోదులే, నిన్ను చేరువరకు నా కనులు మూతపడవులే’ అంటూ ప్రేమికుడు ప్రేమకై తపించిన ఆ పంక్తులు కన్నీళ్లు పెట్టిస్తాయి. ‘గుండెలోన చేశావు ఆరిపోని గాయాన్ని, మందులాగ ఇచ్చావు మన వలపుపంట పసివాణ్ణి’ అంటూ తన ప్రేమకు తీపిగుర్తుగా బాబును తన ప్రేయసి ఇచ్చి వెళ్లడమే ఓ మధురమైన జ్ఞాపకంగా ఆ ప్రేమికుడు అనుభవిస్తుంటాడు. విరహ ప్రేమికుడు పాడే ఈ పాట కన్నీరు పెట్టిస్తుంది. ప్రతిసారి ఈ చిత్రాన్ని చూసేది ఈ పాటకోసమే. ఇటువంటి పాటను అందించిన మహానుభావులకు ధన్యవాదాలు.

-కోలిపాక శ్రీనివాస్, బెల్లంపల్లి