ఈ వారం తార

ఇలియానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక సినిమాతో
కిందపడటం, మరో సినిమాతో
పైకిలేవడం -పరిశ్రమలో సర్వసాధారణం.
టాలీవుడ్‌లో అంతెత్తుకు
ఎదిగిన ఇలియానా, బాలీవుడ్ స్క్రీన్ మీద
బొర్లాపడింది. అందుకే ఇమేజ్‌నిచ్చిన తెలుగు తెరనే మళ్లీ నమ్ముకుని వెలిగిపోవాలని ఆశపడుతోందట. బాలీవుడ్‌లో అలుపెరుగని పరుగు తీసినా స్టార్‌డమ్‌ని అందలేదు. దీంతో -తానెదిగిన తెలుగు తెరే బెటరంటూ మళ్లీ ప్రయత్నాలు చేస్తోందని వినికిడి. కాకపోతే -గోవా భామకు కాసింత గోరోజనం ఎక్కువే ఉండటంతో పిలిచి అవకాశాలిచ్చే నిర్మాతలే ఇక్కడ కనిపించటం లేదు. అయినా పట్టువదలని ఇల్లూ బేబీ -అవకాశం దొరికినప్పుడల్లా మీడియా ద్వారా ఫీలర్లు వదులుతూ తెలుగు తెర జపం చేస్తోంది. ఇప్పుడున్న టాప్ హీరోయిన్లు అందరికంటే ముందే కోటి పారితోషికాన్ని
ఖాతాలో వేసుకోగలిగిన ఇలియానా -చాన్స్‌లు అడిగితే పారితోషికంలో కోత విధిస్తారన్న అనుమానాలూ వ్యక్తం చేస్తోంది.
గతంలో ఆమెతో సినిమాలు చేసిన హీరోలు కనిపిస్తే పలకరిస్తున్నారే తప్ప, చాన్సిస్తామన్న హామీ ఇవ్వడం లేదట.
దీంతో అవసరం లేకున్నా మీడియాకి టచ్‌లోకి వస్తూ..
మనసులోమాట నిర్మాతలకు
చెప్పకనే చెబుతోంది. కనికరించి
ఒక్క చాన్స్ అయినా
ఇవ్వకపోతారా? అని ఆశ.