Others

సిల్వర్ స్క్రీన్‌పై ఆవు - పులి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక గ్రామం శివార్లలో ‘పుణ్యకోటి’ అనే పేరుగల ఆవు ‘అద్భుత’ అని పిలువబడే పులి కంటపడింది. చంపడానికి వచ్చిన పులితో ఆవు జాలిగా ‘నా బిడ్డ చాలా ఆకలితో ఉన్నది. దానికి పాలు తాగించి తిరిగి వస్తాను. నన్ను వెళ్లనివ్వు’ అంటుంది. ఆవులోని నిజాయితీ పట్ల పులికి నమ్మకం కలిగింది ‘సరే, వెళ్లిరా!’ అని పంపిస్తుంది. పులికి తనపై కలిగిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా ఆవు తన బిడ్డకు పాలిచ్చి పులివద్దకు తిరిగి వచ్చి ‘ఇప్పుడు నువ్వు నున్న చంపి నీ ఆకలిని తీర్చుకోవచ్చు’ అంటుంది. పులి ఆ ఆవులోని గొప్ప నిజాయితీని చూచి ఆశ్చర్యపోయి దాని ఎదుట తలవంచి వెనక్కి తిరిగి దూరంగా వెళ్లిపోతుంది.

‘ఆవు-పులి’ కథకు సంస్కృతంలో సంభాషణలతో, కథాకథనంతో భారీ వ్యాపార సంస్థ ‘ఇన్ఫోసిస్’ అధిపతి వి రవిశంకర్ ప్రప్రథమ పశుజీవన విధాన చిత్రంగా నిర్మించడానికి పూనుకున్నారు.
‘ఆవు-పులి’ కథ మనం తరతరాలుగా వింటున్నదే. కాని దానిలోని సందేశం ‘జనావాసాలు- అరణ్యాల’ మధ్య సమన్వయం అని చాలా మందికి తెలియదు. ఇటీవలి కాలంలో జనావాసాలు, పట్టణాల పెంపుదలకై అరణ్యాలను నరికివేసి వివిధ అడవి జంతువులు అంతరించిపోయేట్టు చేయడం జరుగుతున్నది. కారునాడులో కావేరిపై బ్రిడ్జిని నిర్మించారు. అడవులను నరికేశారు. దానితో కరవు తలెత్తింది. ఈ పరిస్థితిపై ఒక అధ్యయన కార్యక్రమం నిర్వహించిన తర్వాత, ఇటీవల చాలామంది నిర్మిస్తున్న పశుజీవన విధాన చిత్రాలకు భిన్నంగా ప్రాచీనమైన ఆవు-పులి కథను సంస్కృతంలో నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రయత్నం ఇంతవరకూ ఎవ్వరూ చెయ్యలేదు.
ఈ ప్రయత్నంలో భాగంగా రవిశంకర్ 40 ఏళ్లు దాటిన వయసులో సంస్కృతం నేర్చుకున్నారు. సంస్కృతం నేర్చుకొనడం చాలా సులభమే. అది చాలా సులభమైన భాషే. కాని చాలామంది సంస్కృతం చాలా కష్టమైన భాష అని పొరబడుతూ ‘సంస్కృతం’ అంటేనే భయపడి దూరంగాపోతూ ఉంటారు. పిల్లలు చాలామంది జపనీస్, కొరియన్ భాషల్లో పశుజీవన విధాన చిత్రాలు ఉంటే వాటిని కూడా చూస్తారు కదా! అందువల్ల ఇకపై ఈ పశుజీవన విధాన చిత్రాలను సంస్కృతంలో నిర్మించాలని రవిశంకర్ నిర్ణయించారు.
రెండేళ్లపాటు రవిశంకర్ ఈ విషయంలో ఎంతో శ్రమపడ్డారు. ఈ విషయంలో తనకు సహకరించగల వారికోసం అనే్వషణ జరిగింది. కేరళ నుంచి, ముంబయి నుంచి, కలకత్తానుండే కాక రుమేనియానుండి బ్రెజిల్ నుండి కూడా తనకు సహకరించే వ్యక్తులు లభించారు. ఈ ప్రయత్నంలో రవిశంకర్‌కు సహకరించేందుకు నటి, సినీ డైరెక్టర్ రేవతి, కన్నడ నటుడు రోగర్ నారాయణన్, కన్నడ విద్యావేత్త నరసింహమూర్తి, సంగీత దర్శకుడు ఇళయరాజా ముందుకొచ్చారు.
ఈ చిత్ర నిర్మాణం సగం పూరె్తైందని, ఇప్పటికి 50 లక్షలు ఖర్చైందని, చిత్రాన్ని పూర్తి చేయడానికి మరో కోటి రూపాయలు అవసరమని రవిశంకర్ అంటున్నారు. ఇది సంస్కృత భాషాచిత్రం కాబట్టి అందరికీ సులభంగా భాష అర్థమయ్యలా చేయడానికి బెంగుళూరుకు చెందిన ప్రొఫెసర్ లీల సహాయం పొందుతున్నట్టు రవిశంకర్ చెప్పారు. ఇది సంస్కృత చిత్రం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ప్రదర్శించబడుతుందని, ఇది కేవలం బాలలకోసం నిర్మించిన చిత్రంగాకాక అన్ని వయస్సులవారూ ఆసక్తితో చూడగల చిత్రంగా సులభమైన సంభాషణలతో ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగిందిని రవిశంకర్ వివరించారు.

-సన్నిధానం యజ్ఞనారాయణమూర్తి